అవ్యాజ్య సంకెళ్ళు

(అంశం:”బానిససంకెళ్లు”)

అవ్యాజ్య సంకెళ్ళు

రచన:మక్కువ. అరుణకుమారి

అప్యాయతానురాగాల అలరించే ఐనవారి బానిససంకెళ్ళు అమాంతంగా అందుకోవాలి

మమతానుబంధాల మురిపించే మనవారి బానిససంకెళ్ళు ముడివేసుకోవాలి

మనసుతో మనసును పెనవేసుకునే మనసైనవారి ప్రేమానుబంధాల బానిససంకెళ్ళును ఇష్టంగా భరించాలి

మనదారిన పూలబాట పరిచేందుకు మనతో కలసి ముళ్ళదారిలో పయనించే
త్యాగధనుల బానిససంకెళ్ళును కష్టమైనా భరించాలి

అకారణంగా కోపాగ్ని జ్వాలలు కురిపించే కఠిన పాషాణ హృదయుల బానిససంకెళ్ళు విదిలించుకోవాలి

మేకవన్నె పులిలా మాటువేసి సమయం చూసి జూలు విదిలించే జులాయిల బానిససంకెళ్ళు జులపాలు పట్టి తరిమివేయాలి

వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచేందుకు వేచిచూసే వెదవాయీల బానిససంకెళ్ళు
వేయిముక్కలు చేయాలి

పక్కలో పాములా బుసకొడుతూ పడగలెత్తే పగవారి బానిససంకెళ్ళు పగలగొట్టగలగాలి

అందమైన జీవితాన్ని అతలాకుతలం చేస్తూ అధఃపాతాళినికి తోక్కెసే అరిషడ్వర్గాల బానిససంకెళ్ళు
బద్దలగొట్టగలగాలి

దేవదేవునిపై అవ్యాజ్యమైన భక్తిభావనా బానిససంకెళ్ళుతో
గాఢంగా బంధింపబడాలి.
********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!