(అంశం:”బానిససంకెళ్లు”)
బానిస సంకెళ్ళు
రచన:సురేఖ దేవళ్ళ
తోటి మనిషిని నమ్మలేని
మనసుకు పడిన సంకెళ్ళను గుర్తించేదెలా?
మానవత్వాన్ని మరిచిన
మనుషుల తీరు మార్చేదెలా?
నిజాయితీ అన్న పదాన్ని
మరుగున పడకుండా కాపాడేదెలా?
ఆదరణ, అభిమానం మరచి
అసూయాద్వేషాలతో రగిలిపోయే
వైఖరి మారేదెలా?
మేము అనే భావాన్ని మరిచి
నేను అనే అహాన్ని కప్పుకున్న
మనిషికి కనువిప్పు కలిగేదెలా?
నాగరికత పేరున మనిషి
తనకుతానే వేసుకున్న
బానిసత్వపు సంకెళ్ళను తెంచేదెలా???