దేవుడు

దేవుడు

రచన::చెరుకు శైలజ

భాస్కర్రావు సుజాత లకు ఇద్దరు కూతుళ్లు . భాస్కర్రావు గవర్నమెంట్ ఉద్యోగి. పెద్ద కూతురు సుమ పెళ్లి తనకు వున్న పొలం అమ్మి చేశాడు.
మంచి సంబంధమే ఇందరు గవర్నమెంట్ టీచర్స్
.ఆ పెళ్లి జరిగిన రెండు సంవత్సరావకే రెండో కూతురు ఉమ పెళ్లి చేశాడు. అల్లుడు చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు కూతురు కూడా పైవెట్ జాబ్ చేస్తుంది .ఉమ పెళ్లికి ఉన్న ఇల్లు ను అమ్మి చేశాడు.
తనకంటు ఉన్నది ఒక ఉద్యోగం మాత్రమే . భాస్కర్ రావుకి కొన్ని దురువ్యసనాలు వున్నాయి. అప్పుడప్పుడూ స్నేహితులతో కలిసి మందు తాగడం. సిగరేట్ రోజు నాలుగు ఐదు వరకు తాగుతాడు.
అది చూసి భార్య మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పటికైన మానేయండి అని చెప్పుతునే వుంటుంది.
అన్నట్టుగానే
ఈ మధ్య భాస్కర్ రావు ఆరోగ్యం కొంచెం క్షీణించింది.
ఒకేరోజు ఆఫీస్ నుండి వచ్చేసరికి చిన్న కూతురు ఉమను చూసి సంతోషంతో
ఏం అమ్మ వస్తున్న అని ఒక మాట కూడా చెప్పలేదు అన్నాడు. చెప్పే టైం లేక మిమ్మల్ని చూడలనిపించి వచ్చేశాను అంది. మరి ఆఫీస్కి లీవ్ పెట్టావా అన్నాడు. అవును అంది.
మీరు రాగానే ప్రశ్నల మీద ప్రశ్నలు ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఇద్దరికి టీ ఇస్తాను భార్య సుజాత అంది. ఉట్టి టీ నేనా నాకు చాలా ఆకలిగా వుంది. సరే కొంచెం కారంపూస తింటు టీ తాగండి తొందరగానే రాత్రి వంట చేస్తాను అంది .సుజాత టీ చేసుకొని ఒక ప్లేట్ లో కొంచెం కారప్పూస పట్టుకొని వచ్చి వాళ్ళకు ఇచ్చి తాను కూర్చుంది.
ఏమండి అది వచ్చి గంట అయింది. వచ్చినప్పటి నుండి ఒక మాట మాట్లాడలేదు. అల్లుడు రాలేదా! అన్న జవాబు లేదు.ఉమ ఏమైంది? తల్లి అన్నాడు.ఏం లేదు. నాన్న నేను ఒక్కదాన్నే ఉద్యోగం చేయాలి.ఆయన ఏం ఉద్యోగం లేదు.తిని కూచోవడమే
మా అత్త గారు కూడా మాతోనే కదా! తను దగ్గర వున్న ఒక పైసా తీయదు. అన్ని నేనే ఇంట్లో చూసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది నాన్న అంది.
అంతా తొందరగా కూతురుఏ కష్టం చెప్పదు నోరు విడిచి, ఎంతో బాధ అయితే తప్ప మనసులో అనుకున్నాడు.
నేనూ వచ్చి ఏమైనా అల్లుడు గారితో మాట్లాడలా అన్నాడు. వద్దు నాన్న ఆయన ఏమైనా కోపంతో ఏదైనా మాట అంటే నేనే బాధపడాలి అంది. ముగ్గురు భోజనాలు చేసి పడుకున్నారు.
పడుకున్నక సుజాతతో భాస్కర్ రావు
మనం ఉమ పెళ్లి విషయంలో చాలా తొందర పడ్డాం కదా అన్నాడు.దాని గురించి ఏం బాధ పడకండి దాని తలరాత ఎట్లా వుంటె అట్లా జరుగుతుంది.
అదే సర్దుకుంటుది .
కొన్ని రోజులు చూసి మనమే వెళ్లి మాట్లాడి వద్దాం అంది. అది నిజమే అనిపించింది.
తెల్లవారి తండ్రితో పాటు రెడి అయి నేను కూడా ఆఫీస్కి వెళ్లాలి అమ్మ అంది.
ఈ ఒకరోజు లీవ్ పెట్టి ఉండోచ్చు కదా! తల్లి అంది.లేదమ్మా లీవ్ లేదు.మరల ఎపుడైన వస్తాలే అంది. ఉమ కూడా వుండేది హైదరాబాద్లోనే కాబట్టి అలా రావడం కుదురుతుంది .
అదే పెద్ద కూతురు విజయవాడలో వుంటుంది.పైగ ఇంట్లో అత్త మామ ఉద్యోగం దానికి అసలు తీరికే వుండదు.
ఈ పండుగకి అక్క నువ్వు వచ్చి ఓ నాలుగు రోజులు వుండండి అంది.
అలాగే అమ్మ అంటు తండ్రితో స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది. ఉమని బస్ స్టాప్లో దింపి భాస్కర్ రావు ఆఫీస్ కి వెళ్ళాడు.
పనిలో కూతురు గురించి ఆలోచించే తీరికే దొరుకలేదు ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. కాని నిద్ర పట్టడం లేదు.ఏదో ఒకటి చేయాలి ఉమ కోసం పాపం పిచ్చిది.
ఎంతో కష్టం పడుతుందో ఏమో! అనుకున్నాడు.
తెల్లారి లేవడినికే ఓపిక లేదు. చాలా దగ్గు, జ్వరం అలాగే ఆఫీస్కి వెళ్ళాడు. సుభద్ర వద్దు అని అంటున్నా వచ్చెటపుడు డాక్టర్ దగ్గరకు వెళ్తాను అని చెప్పి వెళ్లాడు. వచ్చెటపుడు టెస్ట్ చేయించుకున్నాడు.
ఆ విషయం ఇంట్లో చెప్పాడు. మరునాడు టెస్టు రిపోర్ట్ తీసుకొని డాక్టర్కి చూపించాడు ఆయన చెప్పిన విషయం విని భాస్కర్ రావు షాక్ అయ్యాడు.
మీకు మందు సిగరెట్ అలవాటు వుందా! డాక్టర్ అడిగాడు. అప్పుడప్పుడు ముందు తాగుతాను. సిగరేట్ రోజు రెండు మూడు తాగుతాను అన్నాడు.
మీరు మందులు వాడుతు కిమో చేయించుకుంటునే వుండాలి. కాన్సర్లాస్ట్ లాస్ట్స్టేజ్ లో వుంది అన్నాడు.
భాస్కర్ రావు ఇంటికి వచ్చాక రిపోర్ట్ ఏం వచ్చింది అని సుభద్ర అడిగింది. అంతా నార్మల్ అనే చెప్పాడు.
సుభద్ర పండుగకు పిల్లను రమ్మని ఫోను చేయి అన్నాడు .దసరా పండుగకు అందరు కూతుళ్లు, అల్లుళ్లు వచ్చా రు .సరదాగా గడిపారు. కూతురులు తండ్రిని కదల నివ్వకుండ సేవలు చేశారు.రేపుఅయితేఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళి పోతారు. అందరు భోజనాలు చేసి పడుకున్నారు.
మరునాడు వెళ్లడానికి రెడీ అవుతున్నరు కూతుర్లు .
అమ్మ నాన్న ఇంకా లేవలేదు.ఆఫీస్కి వెళ్లరా అంది .ఏమో ఇప్పటికే లేస్తారు
. మీరు టీపిన్ చేస్తూ వుండండి. నేను చూస్తాను అని గదిలోకి వెళ్ళింది. సుభద్ర ఏమండి అని పిలిచింది .చలనం లేదు వెళ్లి కుదిపి చూసింది .అసలు కదలిక లేదు .రండే సుమ,. ఉమ మీ నాన్న కదలడం లేదు. అందరు పరుగెత్తుకుంటూ వచ్చారు. నాన్న ,నాన్న కూతుర్లు పిలిచిన పలుకు లేదు. అల్లుడు వెళ్లి డాక్టర్ తీసుకొచ్చాడు. డాక్టర్ పరీక్ష చేసి ఏవో మాత్రలు మింగి ఆత్మ హత్యా చేసుకున్నాడు.ఆని చెప్పాడు.
ఇరుగుపొరుగు అందరు గుమి గూడారు. ఆత్మహత్యా అని తెలుసుకోని పోలీసులు వచ్చారు .ఆయన మంచం మీద ఉత్తరం దొరికింది. అది తీసి చిన్న అల్లుడు చదవడం మొదలు పెట్టాడు.
ప్రియమైన నా భార్యకు మరియు పిల్లలకు నేను ఆత్మహత్య మీ సుఖం కోసమే చేసుకున్నాను. నాకు కాన్సర్ చివరి దశలో ఉన్నది. నేను ఎలాగు బతుకను డాక్టర్ చెప్పారు. ఎలాగో నా రిటైర్మెంట్ ఆరునెలలే వుంది.అందుకే ఈ పని చేశాను.నా ఉద్యోగం ఉమాకి వస్తే అది సుఖంగా వుంటుంది. అలాగే సుజాత నీకు పెన్షన్ వస్తుంది.అన్ని బాధల తీరుతాయి.
నన్ను క్షమించండి మీరు సంతోషంగా వుండండి. ఇట్లు మీ నాన్న.నీ భర్త
ఆ ఉత్తరం చదవడం అయిపోగానే కూతుళ్లు నాన్న ఎంతో పని చేశావు.నా కోసం నీవు అంటు ఉమ ఏడుస్తూనేవుంది .ఇంత బాధను నాకు ఎందుకు చెప్పలేదండి అంటు సుభద్ర ఏడుస్తుంది.
చిన్న అల్లుడు బీరువాలో వున్న డాక్టర్ రిపోర్ట్ చూశాడు అందులో కాన్సర్ అని వుంది. అది చూసి కూడా ఏడ్చారు. వచ్చినవాళ్ళు ఓదార్చుతు
మీ నాన్న ఎంత పని చేశాడు.అని ఓదార్పు మాటలు అంటు వుంటే
మా నాన్నను ఏమి అనకండి
మా కోసం ప్రాణ త్యాగం చేశారు.తను బలి అయి నాకు సంతోషం ఇవ్వడానికి ఆత్మహత్య చేసుకున్నాడు
నాన్న నీవు దేవుడిని అంటు చిన్న కూతురు ఉమ ఏడుస్తూ ఫోటోకి దండం వేసింది. సుమ, సుభద్ర వెళ్లి ఉమని పట్టుకొని ఏడుస్తూ భాస్కర్రావు పోటోకి దండం పెడుతు చూస్తుండిపోయారు.

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!