కల నెరవేరింది

అంశం: హాస్య కథ

కల నెరవేరింది
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత. కోకిల

ఒక చిన్న పల్లెటూరులో వెంకమ్మ మల్లయ్య అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి సంతానం లేదు పిల్లల కోసం చాలా బాధపడుతుండేవారు. పిల్లల కొరకు మొక్కని దేవుడు అంటూ లేదు మల్లయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం ఎంకవ్వ మనం ఏం పాపం చేశామని ఇంక మనకు పిల్లలు పుట్టడం లేదు ఇంకా పుట్టరా అంటూ బాధపడుతుండేవాడు. ఎందుకయ్యా అంత దిగాలుపడిపోతావు మన మొర ఆలకిస్తాడు ఆదేవుడు మనకు పిల్లలను ఇస్తాడు. అంటూ అడగినప్పుడల్లా అలా బదులు చెప్పేది. తనకు కూడా మనసులో బాధగానే ఉండెేది కానీ బయటకు అనేది కాదు మల్లయ్య ఇంకా బాధపడతాడని మనసులోనెే తన బాధను దాచుకునేది. ఏమే ఎంకవ్వ ఇంకా ఇంటికాడనే ఉన్నావా కట్టేలకు పోలే అంటూ పలకరించింది సీతాలు ఏం చేయమంటావు వదిన మీ అన్నను చూశావా ఎట్టా కుమిలిపోతున్నాడో చూడు నేనెట్టా కట్టెల కాడికి పోయేది వదిన అంది బాధగా ఏమైందట మా అన్నకి అంటూ లోనికి వచ్చింది. ఏందెే అన్న అట్టా దిగాలు పడుతున్నావు అట్టా ఎన్నిదినాలు దిగాలుపడుతావు దిగాలు పడితెే పిల్లలు పుడతారా ఎంది ఇయ్యాల కాకుంటే ఇంకొద్ది దినాలకు పుడుతాడు. మీ వయసు ఏమన్నా మించి పోయిందా ఎంది అంతలా రంది పడుతున్నావు ఏమే వెంకీ యెంగిలిపడి పొ కట్టేల కాడికి. అంది వెళుతూ సీతాలు! అట్టాగే వదిన అంది ఇంత ఎంగిలిపడి ఇంటికాడనే ఉండయ్యా అని చెప్పి కట్టేలకాడికి సీతాలు మాటలకి మల్లయ్యకు మళ్లీ ప్రాణం పోసినట్టయింది. నువ్వు అన్నట్టయితే నీ నోట్ల ఇంత చక్కెర పోస్తా చెల్లి తను కూడా హుషారుగా లేచి బువ్వ తిన్నాడు. ఆ దేవుడు మొర ఆలకించినట్టున్నాడు వెంకవ్వ నీళ్ళొసుకున్నది. ఆ దంపతుల సంతోషం ఇంతా అంతా కాదు కొద్దీనాళ్లకే పండంటి పిల్లోడిని కన్నది ఆ పిల్లోడిని కంటికి రెప్పలా చూసుకుంటూ రాము అని పిలుచుకుంటూ మురిసిపోయారు ఆ సంతోషం ఎన్నిదినాలు పట్టలేదు తన కోరిక నెరవేరిందన్న సంతోషమో, లేక, ఎక్కువ ఆనందం పట్టలేకనో. ఆ పిల్లాడు పుట్టిన ఏడాదికే మల్లయ్య కన్ను మూశాడు.
ఎంకవ్వ కన్నీరుమున్నీరై విలపిస్తూ కూర్చుంది.
సీతాలు వచ్చి ఎంకవ్వ ఎన్ని దినాలు ఏడ్చుకుంటూ కూర్చుంటావు ఇలా లే లేచి ఇంత ఎంగిలిపడు ఇట్లా ఏడుస్తూ కుకుoటే పోయినోడు వస్తాడా పిల్లాడి కోసమైనా ఇంత ఎంగిలిపడాలి లెే లెే ఎంకి ఇంత ఎంగిలిపడు ఏంటో వదినా పిల్లాడు పుట్టిండని ఆనందపడాలా మల్లయ్య నాకు దూరమైండని బాధపడాలా వదిన అంటూ భోరుమని ఏడ్చింది.ఏదో నీ ఖర్మ అంది బాధను మనసులో దాచుకొని కట్టెలు అమ్ముకుంటూ కాలం గడుపుకుంటూ వచ్చింది. పిల్లాడిని తోటిపిల్లలదగ్గర దింపేసి కట్టెేలు అమ్ముకొని వచ్చేసరికి సాయంత్రమయ్యేది తను వచ్చేసరికి పిల్లాడు నిద్రపోయేవాడు ఇంత బువ్వ తినిపించి మళ్లీ పడుకోబెట్టేది.
ఇలా రోజూ ఇంటి దగ్గరే ఉంచి వెళ్లిపోయేది. కట్టెలమ్ముకుని వచ్చేసరికి ఆ చీకట్లోనే పిల్లాడు పక్షులతోటి జంతువులతోటే ఉండేవాడు. ఎవ్వరెoత చెప్పినా వినేవాడు కాదు అక్కడే ఉండేవాడు ఒకరోజు పిల్లలందరూ కలిసి చెప్తుంటే ఎంకవ్వ నవ్వుతూ వినీవిననట్టుగా వుండేది.
ముద్దుగా రాము అని పిలుకునెేది పిల్లలందరూ చెప్తే విని రాము ఆ పక్షులతో ఏంటిరా ఆటలు అవిఏమైనా చేస్తాయంటూ మందలించేది అవ్వ మాట వినీ విననట్లుగా ఉండేవాడు.అన్నప్పుడల్లా అవి నన్ను ఏమీ చేయవు అవ్వా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పేవాడు నాకు వీటితోటే ఆడుకోవడం ఇష్టం అనే వాడు అవ్వా ఈ మనుషుల కన్నా పక్షులు జంతువులెే నయం నన్నేమీ చేయవు నాకు ఇవి అలవాటెే ఇవెే నాకు మంచి స్నేహితులు నాలోకం నా ప్రపంచమంతా ఇక్కడే అంటూ చెట్లల్లో పుట్టల్లోనెే ఎక్కువ గడిపేవాడు పక్షులతోటి జంతువులతోటి ఎప్పుడు మాట్లాడుతూ నవ్వుతూ ఉండేవాడు పిల్లలందరు నవ్వుతూ గేల్ చేసేవారు అయినా తను అవేం పట్టించుకునేవాడు కాదు.వాటితో కలిసి అడవంతా తిరిగేవాడు.
తన పనేంటో తను చేసుకుంటూ పక్షులతో జంతువులతో మాట్లాడుతూ ఆడుకుంటూ కాలం గడిపేవాడు. రాము చేసే వింత పనులకి ముచ్చటేసేది తమాషాగా వింతగా అనిపించేది రాము ఎలా చెప్తే అలా వినేవి రామును గేలి చేసిన వారే వచ్చి ఆ వింత తమాషాను చూస్తూ ఆనందపడేవారు. నీ జట్టు ఉంటామంటూ పిల్లలందరూ వచ్చి సారి చెప్పి నీతోటి ఎప్పుడు దెబ్బలాడం అని నీతో స్నేహంగా ఉంటామని చెప్పి రాముతో స్నేహం చేశారు.మనుషుల కంటే జంతువులు ఎంతో మిన్న వాటితో స్నేహం చేస్తే అవి మన ప్రాణాన్ని కాపాడతాయి. మన మీద ఈగ కూడా వాలనివ్వవు అప్పుడప్పుడు వీధిలోకి కూడా తీసుకువచ్చి అందరికీ విన్యాసాలు చూపించేవాడు అందరు రాము విన్యాసాలను చూసి అందరూ సంతోషపడేవారు.రాము తెలివితేటలను మంచితనాన్ని చూసి అందరూ గర్వపడే వారు ఈ వింత మనుషుల కంటే ఈ వింత జంతువులెే నయం
ఈర్షాద్వేషాలు కుళ్లు కుతంత్రాలు మన మనుషులలోనెే ఉన్నాయి. ఈ నోరు లేని జంతువులను పక్షులను మనం కాపాడుకుంటే మనకు ఎంతో మేలు మంచి జరుగుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!