మరో ప్రపంచం

అంశం: చీకటి వెలుగులు

మరో ప్రపంచం

రచన: క్రాంతి కుమార్

మెరిసే కనుల కాంతి వెలుగులో
కనిపించని చీకటి జీవితాలు ఎన్నో

సంతోషంగా నవ్వుతున్న పంటి బిగువున
అణచిపెట్టిన భరించలేని బాధలు ఎన్నో

మైమరపించే శ్రావ్యమైన సంగీతంలో
మది ఆలపిస్తున్న ఆర్తనాదాలు ఎన్నో

ఆప్యాయత అనురాగాల స్పర్శలో
మానసిక వేదన పొందిన మనసులు ఎన్నో

స్వచ్ఛమైన సుగంధాలు సువాసనలలో
ఉనికిని కోల్పోయిన కుసుమాలు ఎన్నో

పైపైన కనిపించే అనేక అద్భుతాలలో
ముగిసిన కార్మిక జీవుల ప్రాణాలు ఎన్నో

స్వేచ్ఛా ప్రపంచ విహారంలో
బందీలుగా బాధను అనుభవిస్తున్న జీవితాలు ఎన్నో

చీకటి ప్రపంచంలో కలిసిపోయిన
ప్రతి జీవి కష్టాలను కన్నీళ్ళను
నీ అలుపెరుగని పోరాట స్ఫూర్తి వెలుగుతో
మరో ప్రపంచానికి పరిచయం చెయ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!