నాకై వెతికే నేను

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

నాకై వెతికే నేను

రచన: కవితదాస్యం

నేను ఎవరనే ప్రశ్న ప్రతిరోజు ఉదయిస్తుంది… బాల్యపు అనుభవాల నీడలో పెరుగుతూ పెరుగుతూ…

నాతోపాటే ఆకాశాన్నంటుతున్న ధరలతో కడుపు నింప లేని అశక్తితో….

నిద్ర కు దూరమై…
రోజూ కన్నీళ్ళతో… బాధనిదాస్తూ…
బరువును మోస్తూ…

నీ నెవరనే ప్రశ్న ఉదయిస్తూనే ఉంది… రోజులు, నెలలు సంవత్సరాలు,
తరాలు- అంతరాలు అన్ని మారాయి…
ఒక జీవనం తప్ప…

ప్రతి పనికి నేను సర్వకాల సర్వావస్థలయందు ఉన్నట్టుగా….
పేరు మోగుతూనే ఉంది… కానీ నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందం….

నాకు మీరు పెట్టిన అందమైన పేరు అభివృద్ధి దిశలో ముందుకు పయనిస్తున్న…

నన్ను నేను వెతుకుతూ అన్వేషిస్తూనే ఉన్నాను నేను ఎవరిని!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!