గంజి నీళ్ళు

గంజి నీళ్ళు

ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. పేద వాడి పాలిట పరవన్నం, సంపన్నుడికి అరుగుదల మంత్రం. అందుకే గంజి నీళ్ళుకి అంత విలువ.

పరశురామయ్యది  ఏలూరు దగ్గర చిన్న పల్లెటూరు. అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటాడు.  అతనికి చరణ్ ఒక్కడే కొడుకు. లేకలేక కలిగిన సంతానం అవటంచేత ఆడింది ఆట, పాడింది పాట లాగా ఉండేది వాడి పెంపకం.

చరణ్ పుట్టిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి మెరుగు పడటం వలన వాడు ఏదీ కోరితే అది నిమిషాల మీద వాడి కోరిక తీర్చేవాళ్ళు ఆ దంపతులు. అలా అలా ఇప్పటికి ఇంటర్ లోకి అడుగుపెట్టాడు చరణ్.

ఫస్ట్ ఇయర్ ఎక్సామ్స్ రాసి, రిజల్ట్ చూసుకోవటం కోసం అని ఏలూరు సిటీకి బయలుదేరాడు.

అదే రోజు పరశురామయ్యకు కొంచం నలతగా ఉండటం వల్ల, ‘నన్ను నీతో హాస్పిటల్ కి  తీసుకుని వెళ్లరా’  అంటూ చరణ్ వెనుక బయలు దేరాడు.

చరణ్ రిజల్ట్ చూసుకుని నాన్న నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అని చెప్పాడు.

ఆయన సంతోషిస్తూ, నాకు తెలుసురా నువ్వు ఎంత తెలివిగలవాడివో. నువ్వు మా బంగారం కాదూ అంటూ కొడుకుని చూసి మురిసిపోయాడు.

హాస్పిటల్ కి వెళ్లి వైద్యం పొంది, బయటకు వచ్చేసరికి పరుసురామయ్యకి కళ్ళు తిరిగి చరణ్ మీద వరిగిపొయాడు.

మళ్ళీ వెనకకు వెళ్లి, డాక్టర్ కి చూపిస్తే, ఎమైనా తినిపించు, నీరసంగా ఉన్నారు మీ నాన్న. అవసరమైతే సిలైను పెడదాము అన్నారు. అప్పటికే  మిట్ట మధ్యాహ్నం రెండు గంటలు దాటుతుంటే, పక్కనే ఉన్న హోటల్ కి తీసుకుని వెళ్ళి భోజనం ఆర్డెర్ చేసాడు ఇద్దరికీ. సర్వర్ ఫస్ట్ సూప్ తీసుకు వచ్చి ఇచ్చాడు వేడివేడిగా. చాలా బాగుంది అంటూ వేడి వేడి సూప్ తాగారు ఆయన . పరందామయ్య గారు అప్పటికి  కాస్త తేరుకున్నాడు మనిషి.

చరణ్ వైపు చూసి, కాస్త కుదుటపడుతోందని, కళ్లు తిరగడం  కూడా కాస్త నయం అయినట్టుగా చెప్పారు. ఇద్దరూ భోజనం చేసేశారు.

ఇంటికి వెళ్ళాక, భార్య సుమతిని పిలిచి, సాయంత్రానికి గంజి నీళ్ళు తీయమన్నారు. చాలా రోజులకి నా కొడుకు వల్ల  నాకు పాత రోజులు గుర్తుకొచ్చాయి.

పిల్లలు మంచి మంచి చదువులు చదివి, ఉన్నతంగా, ఉత్తమంగా ఎదుగుతున్నారని ఆనంద పడాలో, యాంత్రిక జీవనంలో పడి,  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విఫలం అవుతున్నారని భాద పడాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క, తన కొడుకును చూసుకుని చాలా గర్వంగా అనిపించింది.

పట్టణ జీవన వ్యామోహంలో పడి, ఆ సౌకర్యాల మోజులో మునిగి, కన్న వాళ్ళని, పుట్టిన ఊరుని మరుస్తున్న ఈ రోజుల్లో, చరణ్ మాత్రం సొంత ఊరిలోనే ఉంటూ, తాను విజయాలను సాధిస్తూ, ఆనందం పొందుతున్నాడు.

వాడి భాద్యత ప్రకారం తాను నడుచుకుంటాడు. నిజంగా ఈ రోజు హొటల్లో, ఆ సూప్ తాగుతుంటే, మా అమ్మ చేసిన గంజి నీళ్ళు గుర్తుకొచ్చాయి నాకు. అది ఇప్పటి పాషన్ కావచ్చు, కానీ ఆ నీళ్లే ఒకప్పుడు మమ్మల్ని  బ్రతికించినాయి.

పెళ్లి అయ్యాక కొన్నాళ్ల వరకూ కూడా అవే మాకు ఆహారం. అని చెపుతూ, కళ్ల నీళ్ళు పెట్టుకున్నారు గతం గుర్తు చేసుకుంటూ.

ఊరుకోండీ నాన్న అసలే మీకు ఆరోగ్యం బాగా లేదు. ఇప్పుడు పరిస్తితి అలా ఏం లేదు కదా. అంటూ ఓదార్చాడు.

కానీ అసలు జీవిత పరిస్తితులు అంత దారుణంగా కూడ ఉంటాయి అని ఇప్పుడే తెలిసింది చరణ్ కి. తనకు తెలియకుండానే తన కళ్లల్లో చెమ్మ వస్తోంది.

చరణ్ కళ్ళల్లో తడి చూసిన పరందామయ్య గారు మాత్రం, ‘మా వృద్దాప్యంలో కూడా మా ఈ బతుకులు మాత్రం ఈ పల్లె నుండి దూరం చెయ్యొద్దు రా’  అంటూ కళ్ళు ఒత్తు కున్నాడు’.

‘మీకు నచ్చినట్టే ఉండండి నాన్నా’ అంటూ ఓదార్చాడు.

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!