తాత కల

తాత కల 

ట్రింగ్.. ట్రింగ్..’ అంటూ మోగుతున్న ఫోన్ ని తీశాడు శ్రీను.”నేనురా!మీ నాయనమ్మని”అంటూ అవతలి వైపునుంచి వినిపించిన మాటలతో,

ఏమి చెప్పాలో అర్థం కాక, తన తండ్రి రమేష్ కు ఫోన్ అందించాడు శ్రీను.

“అమ్మా! ఎలా ఉన్నావు?” తల్లిని క్షేమ సమాచారం అడిగాడు  రమేష్.

“ఇంకా మంచాన పడకుండా బాగానే ఉన్నాను” అనే అమ్మ సమాధానంతో మాటలు రానివాడైయ్యాడు రమేష్.

“ఏరా! మీ అమ్మను వదిలి నువ్వు అమెరికా వెళ్లినా, ఆస్ట్రేలియా వెళ్లినా ఊరిలో ఒక అమ్మ ఉంది అని  మరిచిపోయావా? అంతే లే, నీ భార్యా పిల్లలు తప్ప ఎవరు గుర్తుంటారులే నీకు..” అంటూ ఆపకుండా ఏనాడో జరిగిన విషయాలను ఏకరువు పెడుతూ, కొడుకును దుయ్యబట్టసాహిన్దీ  కృష్ణాపురం అనే పల్లెటూరిలో ఉన్న రమేష్ వాళ్ళ అమ్మఅలివేణి.

తల్లి అంటున్న అన్నీ మాటలు ఓపిగ్గా విని…

“సరే అమ్మా ! ఇక్కడ అంతా బానే ఉన్నాము జాగ్రత్త నీవు ” అంటూ మారు మాటకి తావు ఇవ్వకుండా కాల్ కట్ చేసాడు రమేష్.

తండ్రి ముఖంలో రంగులు మారడం గమనిస్తూనే ఉన్నాడు శ్రీను.

చేయవలసిన ప్రాజెక్ట్ పూర్తిచేసి తండ్రి గదిలో లైటు వెలుగుతూ ఉండటం చూసి లోపలికి తొంగి చూసాడు శ్రీను. పాడ్ మీద రాస్తూ రాస్తూ వదిలేసిన డైరీ అలానే ఉంది . నిద్ర వచ్చిందేమో అలానే పడుకుండి పోయాడు రమేష్. ఏ‌సి గదిలో చాలా చల్లగా అనిపించి రగ్గు కప్పి డైరీ ఉన్న పాడ్ తీసి పెట్టేద్దాం అనుకుంటూనే “అమ్మా!” అని కనిపించేసరికి సమంజసం కాదు కానీ అక్కడ వ్రాసి ఉన్నది చదివాడు శ్రీను.

తండ్రి మనసును తెలుసుకున్న శ్రీను ఒక నిర్ణయానికి వచ్చాడు . మరో రెండునెలల్లో తన కోర్స్ పూర్తి అయిపోతుంది. ఈలోపు ఇండియా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలి, తాత కల నిజం చేస్తూ భీడుగా మారిన భూమిని అంతా పచ్చని పైరుగా మార్చాలి కొత్తగా వచ్చిన వ్యవసాయ సాధనాలతో… అనుకుంటూ బెడ్ మీద వాలి నాన్న డైరీ లోని అక్షరాలను మననం చేసుకుంటున్నాడు శ్రీను.

“ అమ్మా! నీ ఈ నోటికి భయపడే కదా నాకు అగ్రికల్చర్ లో ఉన్నత విద్యలను అభ్యసించి వ్యవసాయంలో కొత్త మెలకువలతో పంటలను పండించాలని… తరతరాలనుండి వస్తున్న ఈ భూ సంపదను కాపాడుకోవాలని ఎంతో కోరిక ఉండేది. కానీ నీవు ఊరిలో అందరి పిల్లలు ‘అదేందో శాఫ్ వేర్ అంట.. అది సదివి విమానం ఎక్కి విదేశాలకు పోతున్నారు.. నా బిడ్డ కూడా అట్లనే చదవాల.. అమెరికాకి బోవాల ‘ అంటూ ఒకటే గోల పెట్టావు. నాన్న కూడా ఎంత చెప్పినా వినలేదు. సచ్చిపోతా అని బెదిరించావు. మరచిపోయావా అమ్మా! తప్పదని కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి ఇలా వచ్చిపడ్డాను. ఇంత దూరంలో మేము ఉండి ఏం సాధిస్తున్నాము. నాన్న పోయినప్పుడు కూడా సమయానికి రాలేక పోయము. మీరేమో మేము కావాలని రాలేదు అనుకుంటారు. పొలం అంతా బీడు అయిపోయింది. తాత కలలు కన్నీళ్లయిపోయాయి….”

అంతవరకే రాసి ఇక రాయలేక పడుకుండిపోయారు నాన్న. నాన్నకి వాళ్ళ తాత అంటే ఎంత ఇష్టమూ నా పేరు తోనే తెలుస్తుంది. శ్రీనివాసులు అని పెట్టుకున్నారు. “ అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు శ్రీను.

******

కొడుకులు విదేశాల్లో హాయిగా ఉన్నారు అనుకునే తల్లితండ్రులు వాళ్ళ ఇబ్బందులను కూడా గ్రహిస్తే మంచిది . అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా వాళ్ళ అభిరుచి మేరకు చదివించాలి అని నా అభిప్రాయం.

రచయిత :: సుజాత తిమ్మన

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!