ఓ నేస్తమా నీవ్వెక్కడ

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                ఓ నేస్తమా నీవ్వెక్కడ

రచన ::వి. కృష్ణవేణి

ఎన్నో జన్మల బంధంలా
నా ఊహల ఆలాపనలా
పంచప్రాణాలు నీవే అన్నట్టు,
మది చెప్పే కబురులకు
నీవే చిరునామాలా
వచ్చి చేరావు,
కాలాలు మారిన
గత జ్ఞాపకాలు నీవేగా
నా మదిని కలవరపరచి
నీ స్నేహమృతంలో ముంచి వెళ్ళిపోయి
నా చిలిపి స్నేహమా!
ఎద కలవర పెడుతుంది నీవెక్కడ అని..
తోడు నీడవైన బంధం ఏదని.
ఊహల రెక్కలగానమై వస్తావా
ఊపిరి అలజడిలా వస్తావా
మధురానుభూతిని తెస్తావా.
మరపురాని కాలాన్ని తిరిగితెస్తావా అని
బంధాన్ని కలుపుకుని
చేయందిస్తావా.
గత జ్ఞాపకాలనే చవిచూపిస్తావా!
నీకై ఎదురు చూస్తున్నా…
ఓ నేస్తమా నీవ్వెక్కడ..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!