ప్రియతమా

ప్రియతమా

అంశం:-నిన్ను దాటి పోగలనా

మౌనం నన్ను ఆవహించి
నిన్ను నా నుండి దూరంగా
ఉన్నట్లు నీకు కనిపించిన..

ప్రతి శ్వాసలో తడబడుతున్న
నీ గుర్తుల నుండి నన్ను నేను
ప్రేమ నుండి నిన్ను దాటిపోగలనా..

నేను విసిరే ప్రతిచూపులో
నువ్వు కనపడకున్నా
కనురెప్ప వాల్చిన ప్రతిసారి
ఒదిగిపోయిన రూపం నుండి
నన్ను నేను నిన్ను దాటిపొగలనా..

పలికే ప్రతి పలుకులో
నువ్వు లేకున్నా ఎదో ఒక
ఊసులు నిన్ను మళ్ళీ మళ్ళీ
నా తలపులు అలజడి
సృష్టిస్తుంటే నీ ఊసే లేని లోకంలో
నన్ను నేను నిన్ను దాటిపోగలనా…

అందరిలో ఉన్న నవ్వులు విసురుతున్న
నీ తాలూకు జ్ఞాపకాలు గుర్తొచ్చిన
ప్రతిసారి మెలిపట్టిన నా గుండెబాధ నుండి
తడబడిన గుండెసవ్వడి దాటుకొని
నేనుగా నిన్ను దాటిపోగలనా..

ఏమని నేను నీకు దూరంగా ఉంటూ
నన్ను నేను శిక్షించుకోవడం తప్పితే
నా ప్రాణం ఉన్నంత వరకు
నేను నిన్ను దాటిపోలేను ప్రియతమా..

రచయిత :: జో(జ్యోతిరాణి)

You May Also Like

2 thoughts on “ప్రియతమా

  1. మనసు భాష లా ఉంది….చాలా బావుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!