తామర (సంక్రాంతి కథల పోటీ)

తామర
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: చెరుకు శైలజ

ఈ రోజు నీకు పెళ్లి చూపులు ఎక్కడికి వెళ్లకు.
ఏమిటి? అమ్మ.. ఎవరిని అడిగి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.
ఎవరిని అడిగి ఏమిటే?
కూతురు పెళ్లి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులదే కదా!
చూడు అమ్మ నేను నీకు చాలా సార్లు చెప్పాను.
ఇప్పుడు చెప్పుతున్నాను.
నాకు ఈ పెళ్ళిచూపులు ఇష్టం లేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని నేను పెళ్లి చేసుకోలేను.
మేము చేసుకో లేదా? మాకు ఏమైంది?
అది అంత నాకు అనవసరం.
పోని నువ్వు ఎవరైనా ఇష్టపడవో చెప్పు.
అమ్మ నీకు ఇంత తొందర ఎందుకు? ఇప్పటి వరకు ఒకరు కూడా నాకు నచ్చలేదు. అసలు నేను పెళ్ళి చేసుకుంటానో లేదో!
అది ఏమిటే?
నీ కన్నా నాకు ఎక్కువ బాధ వుండాలి.
అమ్మ నువ్వు ఎందుకు బాధ పడడం.
ఏమిటే? నీ గురించి నీతల్లికి నాకు కాక ఎవరికి వుంటుంది బాధ.
సరే బాధ పడుతు కూర్చో సరేనా? అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది తామర
ఏమిటి ఇది మరి మొండిగా తయారైంది.. అంటు సుజాత భర్త పని చేసుకుంటూ వుంటే అక్కడికి వెళ్ళి చూసారా! మీ కూతురు ఏమి చెప్పిందో? అది నేను ఏది చెప్పిన తీసి పారేస్తుంది.
ఏమిటి? సుజా అంటు భర్త శేఖర్ ఓపికగా అడిగాడు.
మీ అంత ఓపిక నాకు లేదండి. తామరకు పెళ్లి చూపులు రేపు ఒకరు చూడడానికి వస్తున్నారు కదా!
అవును కదా! నేను మరచిపోయాను.
మీరు అన్ని మరచిపోతారు.
నేను మాత్రం టెన్షను భరించలేకపోతున్నాను.
ఏం టెన్షన్ పడకు, సుజాత అన్ని ఓపికగా అవే జరుగుతాయి.
వాళ్లకు రావొద్దు అని చెపుతారా! కూతురికి ఇంట్లో వుండు అని చెప్పుతారా!
చూద్దాం అన్నాడు.
ఇంకా చూడడం ఏమిటి? ఓ రామ నాకు అర్దం కావడం లేదు. రండి అన్నం పెడతాను.. అంటు కిచెన్ లోకి వెళ్ళింది.
శేఖర్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చేతితో టేబుల్మీద చిన్నగా కొడుతు కూనిరాగం తెస్తున్నాడు.
తామరను పిలవండి, సరే అంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు పైన చిన్నగా తట్టాడు.
దబ్బులున్న తలుపు తీసి ఏమిటి? అని విసురుగా మొఖం పెట్టీ చూసేసరికి, శేఖర్ అలాగే చూస్తూ వుండడంతో.. ఓ నాన్న ఏమిటి?
నేనే రా అన్న తిందాం రా.
నాకు ఆకలిగా లేదు.
అయితే సరే, నేను కూడా తినకుండా పడుకుంటాను.
మీరు తిన్నండి.
నువ్వు వస్తేనే తింటాను.
సరే పదండి నాన్న మీరు వినేటట్టు లేరు కదా!
ఏమిటి వస్తున్నా రా! తండ్రీ కూతుర్లు అంటు సుజాత గట్టిగా పిలిచింది.
మీ ఇద్దరిర సంగతి అర్దం కాదు.
నీకు ఏది అర్దం కాదు అంటు శేఖర్ నవ్వుకుంటూ ప్లేట్లో వడ్డించుకున్నాడు. తామరకు కూడా వడ్డించాడు.
రేపు ఊరికే వాళ్ళు ఫార్మల్ గా వచ్చి చూసి వెళతారు. నువ్వు కొంచము సేపు వుండి, నీ పని చేసుకోవడానికి వెళ్ళిపో.
నాన్న నాకు ఆ ఫార్మాలిటస్ ఇష్టం లేదు.
మరి ఎలా పెళ్లి చేసుకోవా!
నా కెరియర్ సెటిల్ అయ్యాక చేసుకుంటాను.
పెళ్లి చేసుకుంటే సెటిల్ కదా!
నాన్న నా కాళ్ల మీద నేను నిలబడ్డాక, నాకు ఒక మనిషి తోడు కావాలి అని నిజంగా అనిపించిప్పుడు చేసుకుంటాను.
అప్పటి వరకు మేము వుంటామా? నీ పెళ్లి చేసే బాధ్యత అయిపోతే, మాకు హాయిగా వుంటుంది సుజాత అంది.
అమ్మ నీ కన్న నా లైఫ్ నాకే ఎక్కువ ఇష్టం అందుకే నాకు ఇష్టమున్నప్పుడు చేసుకుంటాను.
ఇది మనల్ని మనఃశాంతిగా వుంచదు. చూశారా! దాని జవాబు భర్తతో అంది.
శేఖర్ సుజాత మాటలను వింటూ, తామర వాళ్ళకి రేపు ఏదో ఒక రీజన్ చెప్పి రావొద్దు అని చెపుతాను.
ఓకె నాన్న థాంక్ యూ.. అంటు తన గదిలోకి వెళ్ళిపోయింది.
శేఖర్ తన వర్క్ చేసుకోవడానికి వెళ్ళాడు. సుజాత కిచెన్ క్లీన్ చేస్తూ ఆలోచిస్తుంది
ఈ పిల్ల మొండి దానిలాగా చేస్తుంది, 25 యేళ్లు నిండాయి. ఇప్పుడు కాక ఎప్పుడు చేసుకుంటుంది. పెళ్ళి పోని ఎవరైన ప్రేమించవా అంటే అది లేదు అంటుంది.
శేఖర్ సుజాతలకు ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు. కొడుకుకి 25 ఎండ్లకే పెళ్లి అయిపోయింది. కొడుకు ఇష్టపడి ఒక అమ్మాయిని చేసుకున్నాడు. కూతురు తామర మొదటి నుండి ఆలోచన విధానము వేరే లాగ వుంటుంది.
ఎప్పుడైనా.. తామర ఈ ప్లేట్స్ కడిగి టేబుల్ పైన పెట్టు అంటే.. అమ్మ నాకే చెప్పుతావు పని, అన్నని కూడా పిలువు వాడు చేస్తేనే నేను చేస్తాను అంటుంది.
వాడు మగవాడే అంటే అయితే ఏమిటి? ఇద్దరు సమానంగా పని చేయాలి అంటుంది.
మగవాళ్ళు ఆ పనులు ఎలా చేస్తారే అంటే.. ఆడవాళ్ళు జాబ్ చేస్తూ ఇంట్లో పని చేయడం లేదా! ఈ రోజుల్లోఇద్దరు సమానము, అంటుంది
అమ్మ ఎందుకు వాదనలు అంటు కౌశిక్ తను ప్లేట్స్ కడిగి టేబుల్ పైన పెడతాడు, పోని అమ్మ చెల్లితో గొడవ ఎందుకు అని అనేవాడు.
ప్రతి దానికి అన్న చేస్తే నేను చేస్తా అనేది. అమ్మ నువ్వు ఆడదానివే కదా, మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎందుకు అంటూ వాదిస్తూ వుండేది.
కొడుకు కౌశిక్ పెళ్లి అయి, కెనడాకు వెళ్ళిపోయాడు. తామర అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు అంటుంది. నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదు, నాకు సరిపడ ఎవరు లేరు అంటుంది. సుజాతకు కూతురు మీద ఆలోచనలతో సతమత మవుతుంది.
తామర టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. తన కెరియర్ ఇంకా బెస్ట్ గా చేసుకోవాలి అనే తన ఆరాటం. తన పెళ్లి తన మనీతోనే చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇప్పటికి ఆ కోర్స్ అని, ఈ కోర్స్ అని నాన్నని చాల డబ్బులు ఖర్చు చేయించాను. షార్ట్ ఫిల్మ్ నుండి సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. ఇక టీవీ సీరియల్స్ ఆపేసి వేరే ఏదైనా చూసుకో అని సుజాత చెప్పడంతో తామర అలిగి పడుకోవడం మామూలు అయిపోయింది .
చూస్తూవుండగా తామరకి 26 యియర్స్ నిండాయి. తనతోటి వారి అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఏ పెళ్లికి వెళ్ళిన మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడు? అయిన సీరియల్స్ యాక్టింగ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం కష్టమే అని వారి మాటలు ఈటలుగా సుజాతకు తగిలేవి.
సుజాత అక్కలు ఏమిటే కూతుర్ని యాక్టింగ్ అని ఎంకరేజ్ చేశావు. ఇప్పుడు దానికి పెళ్లి ఎలా అవుతుంది. అని వాళ్ళు అంటు వుంటే, ఏమి జవాబు చెప్పాలో తెలియక మౌనంగా బాధపడడం అలవాటు చేసుకుంది సుజాత.
అవి అన్నీ కూతురికి చెప్పి సుజాత బాధ పడుతుంటే, అమ్మ అసలు లైఫ్ అంటే పెళ్లి చేసుకుంటేనే వుంటుందా! ఏమి పెళ్లి చేసుకోకుంటే లైఫ్ లేదా! పెళ్లి ఒక భాగం మాత్రమే, పెళ్లి చేసుకోవాలి అత్తమామలకు, ఆడబిడ్డలకు సేవలు చేస్తూ భర్త సంపాదనతో పనిమనిషిలా బతకాలి. నాకు ఇష్టం లేదు. నా కాళ్ల మీద నేను నిలబడిన తర్వాతే పెళ్లి అంటు తల్లికి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయింది.
తను చెప్పేది అంత నిజమే, కానీ ఈ సమాజం ఊరుకుంటుందా.. ఆడపిల్ల అనగానే పెళ్లి చేయాలి, అయిన తామరకు ఏమి తక్కువ. ఎంత అందం తనది, ఎవరైనా కళ్లు మూసుకొని పెళ్లి చేసుకుంటారు. తెల్లని తెలుపు, పెద్ద కళ్ళు, కోటేరు ముక్కు, నల్లని పొడగాటి జుట్టు, అసలు మేకప్ అవసరం లేకుండానే సీరియల్స్ లో ఎక్కువగా నటిస్తుంది.
ఒకరోజు కౌశిక్ ఫోన్ చేసి.. అమ్మ చెల్లిని ఒకసారి ఇక్కడకి పంపించవే. ఇక్కడి లైఫ్ స్టైల్ చూసి అయిన మారేజ్ కి ఒప్పుకుంటుంది అన్నాడు.
అదే కూతురితో చెప్పింది.
నేను వెళ్ళను, ఇప్పుడే నా కెరీర్ మొదలైంది. మళ్ళా దాన్ని డిస్ట్రబ్ చేసుకొని వెళ్ళడం ఇష్టం లేదు, అంది
అదే విషయం భర్తతో చెప్పితే దాని ఇష్టం మనమేమి చేస్తాము. నీ పని నువ్వు హ్యాపీగా చేసుకో సరేనా భార్యతో అన్నాడు. అది ఎప్పుడు పెళ్లి అంటే అప్పుడే చేద్దాం, పెళ్లి చేసుకొని ఎవరు మాత్రం సుఖంగా వున్నారు నవ్వుకుంటూ సుజాత వైపు చూసాడు.
మీకు ఏమి తక్కువ అయింది. అన్ని ఎక్కువ అయినవి.
ఖర్చులు, పిల్లలు, చదువులు అన్నాడు
ఎవరికైనా ఇవి వుండ వలసిందేగా.
అందుకే నేను కూడా మా అమ్మతో పెళ్లి చేసుకోను అని మొండికేస్తే తను చచ్చిపోతాను అంటు బెదిరించి అత్త కూతురు అయిన నీతో ముడి వేయించింది ఏమి చేస్తాం. తప్పలేదు నాకు నిన్ను చేసుకోవడం అన్నాడు.
రూంలో వున్న తామర ఆ మాటలు విని బయటకి వచ్చి
అవునా! నాన్న మరి నన్ను అంటారు, చేసుకో పెళ్లి అని అంది.
అడిగినపుడు చేసుకుంటే మంచి వాళ్ళు దొరుకుతారు, నాలాగ లేట్ చేస్తే ఇలా మేనత్త కూతరులు, సాధీంచేవాళ్లు వస్తారు. నాన్న అంటు తామర నవ్వుతు తండ్రి భుజం మీద చెయ్యి వేసి పట్టుకొని నవ్వింది
తండ్రి కూతుర్లు మీకు అన్ని జోక్ అయ్యాయి, అంటు కోపంగా సుజాత లోపలికి వెళ్ళిపోయింది.
తామర తన పనులలో బిజీ అయిపోయింది.
ఒకరోజు తామర.. అమ్మ నీ కోరిక తీరే రోజు వచ్చింది.
ఏమిటే నీరసంగా అడిగింది.
అదే నా పెళ్లి.
అవునా ఎవరే అతను.
వన్ యియర్ నుండి పరిచయం ఇంకా స్టడీ చేయాలి నాకు తనకి కుదురుతుందో, లేదో చూడాలి.
జాతకాలు చూస్తే సరిపోతుంది అంది.
పిచ్చి అమ్మ జాతకాలు కాదు, ముందు మా మానసత్వాలు ఐతే కలిశాయి.
చూడు తామర పూర్తిగా ఎవరివి కలవవు, కొన్ని ఒకరికొరకు అడ్జస్ట్ చేసుకోవాలి.
అవును అమ్మ చెప్పింది నిజం, నేను ఎన్ని అడ్జస్ట్ చేసుకున్నాను తెలుసా! తామర అంటు శేఖర్ కూర్చున్న హాల్లొకి వచ్చాడు.
నేను మాత్రం అడ్జస్ట్ చేసుకోలేదా! మీరు మరీ సుజాత కోపంగా అంది.
చూసారా! ఇన్ని యిర్స్ అయిన ఇప్పటికి మీరు కోట్లాడుకుంటూనే వున్నారు.
ఇలాంటివి సహజంరా ఫ్యామిలీ అన్నాక సర్దుకోవాలి. అన్న లవ్ మారేజ్ చేసుకున్నాడు వాళ్ళు కూడా ఇలాగే వున్నారా.
ఏమో మనకు ఏమి తెలుసు నువ్వే అడగపోయవా?
అడిగితే వాడేమి చెప్తాడు ఇష్టపడి చేసుకున్నాడు కదా!
కొన్ని కొన్ని నవ్వుతూ అడ్జస్ట్ చేసుకుంటాడు. ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవిస్తూ ఉంటే చాలు అవే సర్దుకుంటాయి.
రేపు గౌతమ్ నీ పరిచయం చేస్తాను. దాదాపుగా తనకి నాలాంటి అభిప్రాయాలే వున్నయి అనిపించింది. నేను నా ఇష్టాలు చెప్పాను. తను అన్నింటికి ఓకే అన్నాడు. ఏమి చెప్పావు??
మీకు తెలియదా నాన్న. మీ ఇంట్లో మన ఇద్దరికీ ఈక్వాలిటీ ఇవ్వాలి. తన పేరెంట్స్ తను ఎట్ల చూసుకుంటాడో, నేను నా పేరెంట్స్ నీ అలాగే చూసుకుంటాను. నా కెరియర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం వుండాలి.
ఓ లిస్ట్ పెద్దగానే వుంది కదా!
ఇంక అయిపోలేదు నాన్న పెళ్ళి అయ్యాక నేను అన్నవన్ని కరెక్టుగా వుండాలి. అప్పుడే పిల్లల గురించి ఆలోచించాలి. ఒక 4 యియర్స్ అన్ని పెర్ఫెక్ట్ వుంటెనే కలిసి వుండడం, లేకపోతే విడిపోవడం.
ఏమిటే? ఇది మరి విడ్డురం!?
నాలుగు ఏండ్లకి కూడా కుదరక పోతే అప్పుడు నామైండ్ సెట్ని బట్టి ఆలోచిస్తాను.
ఏమోనే అన్నింటికి సరే అన్నాడా!! అవున్నమ్మ రేపు మీరే చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. మీకు ఓకె అయితే నాకు ఓకె సరేనా అంది.
ఇంకా మాకు ఓకె కావడం ఏమిటి? నువ్వే అన్ని చూసుకున్నావూ కదా!
లేదు నాన్న మీకు కూడా నచ్చాలి అంది.
చాల హ్యాపీరా సంతోషం అంటు కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు.
ఈ శుభ ముహూర్తాన నేను స్వీట్ చేసి తీసుకొస్తాను.. అంటు సుజాత కిచెన్లోకి వెళ్ళింది.

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!