కళ్ళు తెరుచుకున్నాను

కళ్ళు తెరుచుకున్నాను

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

డియర్ గోపాల్..

నీకు రాస్తున్న లేఖ ఇదే, లాస్ట్ టైం నీకు ఎన్నిసార్లు రాసిన నువ్వు రిప్లై ఇవ్వడం లేదు నువ్వు ఎలాంటి వాడివి ఎలా మారిపోయావు, ఎలా ఉండేవాడివో నీకు గుర్తుందా! నన్ను ఇలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నిన్ను నమ్మినందుకు నమ్మక ద్రోహం చేశావు. ఇలా ఎలా మారావ్ గోపాల్. నేను ఇంకా ఇలా చేసావంటే నమ్మలేకుండా ఉన్నాను. కానీ నమ్మాలి. ఇదే నిజం కనుక నీతో గడిపిన క్షణాలు నీ మాటల గారడి నన్ను ఎంత బాగా నమ్మించావు గోపాల్. నువ్వు మ్యాజిక్ చాలా బాగా చేస్తావు నన్ను మంత్రముగ్ధురాలిని చేసి నమ్మించి మోసం చేసావ్ నిజంగానే నమ్మి మోసపోయాను. ప్రేమించుకునే ముందు అండర్స్టాండింగ్ బాండింగ్ ఉండాలి అదే నీకు లేదు. ఇంత చదువుకొని సంస్కారం ఉండి ఆడపిల్లలతో ఆడుకోవడం ఏంటి గోపాల్ ప్రేమించుకొని తిరిగే ముందున్న ధైర్యం? పెళ్లి చేసుకునే ముందు ఎందుకు ఉండదు ఆ ధైర్యం! ఆడపిల్లలు నిజంగానే నమ్మేస్తారు నేనే కాదు ఎవరైనా ఇట్టే నమ్మేస్తారు.ఇదే మీకు ఆ ధైర్యం తల్లిదండ్రులు కుదిరిస్తారు. ఇట్టే ఒప్పుకుంటారు కదా!అటు పెద్ద వాళ్ళకి ఇటు పెద్ద వాళ్లకి అండర్స్టాండింగ్ బాండింగ్ ఉంటుంది. అదే ప్రేమించుకున్న వాళ్ళకి కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం అండర్స్టాండింగ్ ఉండాలి ఉంటుంది. అదే మనం తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలి మనం నిజంగా ప్రేమిస్తే తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం ఉంటుంది. అది నీలో లేదు మూర్ఖుడివి ప్రేమ విలువ తెలియదు.
ఆ ప్రేమ నిజమేననుకుని మోసపోయాను. మేము మనుషులమే మాకు ఒక మనసు ఉంటుంది. నా మనసుతో ఆడుకోవడం ఎవరిచ్చారు ఆ అధికారం ఆడవాళ్ళకి కరుణ, ప్రేమ, జాలి ఎక్కువగా ఉంటాయి కదా! నీవు ప్రేమించే ముందు నీ కుటుంబం గుర్తు రాలేదా? ప్రేమించే ముందున్న ధైర్యం పెళ్లి చేసుకోవాలనేటప్పుడు ఎందుకు రాలేదు. ప్రేమించే ముందు లేని ఆటంకాలు పెళ్ళికి ఎందుకు వస్తాయి. మీ వాళ్ళని అడిగి ప్రేమించలేదే అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అవసరం లేదు! అదే ధైర్యంతో చేసుకోవాలి మొహం చాటేస్తారు ఎందుకు మీ చెల్లిని ఎవరైనా మోసం చేస్తే నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావా లేదా చెప్పు గోపాల్ ప్రతిక్షణం నీ జ్ఞాపకాలు గుర్తు వస్తూనే ఉంటాయి మేము ఎలా మర్చిపోతాం నన్ను మోసం చేసి మరో పెళ్లి ఎలా చేసుకుంటావు? నీకు ఓ మనస్సాక్షి ఉంటుంది. నీకు కూడా జ్ఞాపకాలు ఉంటాయి నీవు ఎలా మర్చిపోగలవు వాటి అన్నిటికి నీ దగ్గర సమాధానం ఉండాలి కదా! మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి మాలాంటి వాళ్ళు మోసపోతూనే ఉంటారు. ఒక మనిషిగా మానవత్వంతో ఆలోచించు గోపాల్ నీకు మాత్రం కరెక్ట్ అనిపిస్తుందా! నీవు ఎక్కడ ఉన్నా నేను రాగలను. నువ్వు ఏంటో తేల్చుకోగలను కానీ నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్న మేము సుఖపడలేము. ఇది నీ విచక్షణకి వదిలేస్తున్నాను. గోపాల్ అందరూ నీలాంటి వారే ఉండరు సమాజంలో మంచివాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. నేను ఆడపిల్లను ఎలా అయినా మారగలను తల్లిదండ్రులను మెప్పించగలను. కాని తప్పు చేశాను. తల్లిదండ్రులను బాధపెట్టాను ఆ బాధ ఎప్పటికీ పోదు. మాలాంటి వాళ్ళకి మనసున్న వాళ్లు దొరకక పోరు పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం ఉండదు. వాళ్లకి న్యాయం వేస్తాననే నమ్మకం నాలో ఉంది నువ్వు ఎవరిని చేసుకున్న బాధపడతావు ఆ అమ్మాయికి న్యాయం చేయలేవు ప్రతి క్షణం మోసం చేశాననే మదన నీలో మొదలవుతుంది. పశ్చాత్తాపం పడే రోజు ఒకటి వస్తుంది గోపాల్ గుర్తుంచుకో బాయ్ నీ కథ ముగిసింది నీవు చేసుకున్నది కూడా ఆడదే. నన్ను మోసం చేసినట్టు ఆ అమ్మాయిని చేయకు, మాల ఎవరు ఉండరు. జాగ్రత్త ఎలా మలుచుకోవాలన్నది నీ చేతిలో ఉంది. బాయ్ గోపాల్! చేదు జ్ఞాపకాలతో ఎన్నడు మర్చిపోలేని గతాన్ని చిరిగిపోయిన కాగితంలా పక్కకు పడేసాను. ఓ కలలా మిగిలిపోతుంది అంతే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!