తెలుసుకో

(అంశం:”బానిససంకెళ్లు”)

తెలుసుకో

రచన: యాంబాకం

ఓ మనిషి నీవు స్వాతంత్రుడవని.ఎవరికీ బానిస కావు అని తెలుసుకో!

నవమోసాలు మోసిన అమ్మకు నీవు బానిస కావు అని తెలుసుకో!

నిన్ను పెంచి పెద్ద చేసిన తండ్రి కి బానిస కావు అని తెలుసుకో!
నీకు చదువు నేర్పిన గురువు కు నీవు బానిస కావు అని తెలుసుకో!

నీ తోడు అన్న అక్క తమ్ముడు చెల్లెలు ఏ బంధాని కి నీవు బానిస కావు అని తెలుసుకో!
నీవు కట్టు కొన్న భార్య బిడ్డలకు నీవు బానిస కావు అని తెలుసుకో!

నీవు సంసారానికి జీవన ఆధారానికి బంధువుల కి నీవు బానిస కావు అని తెలుసుకో!
నీవు ఏ చెడు అలవాట్లు కు సమాజానికి పుట్టి పెరిగిన గడ్డికి నీవు బానిస కావు అని తెలుసుకో!
కాలనికి పరిస్థితులకి దైవానికి చావు పుట్టుకలకు నీవు ఎంత మాత్రం బానిస కావు అని తెలుసుకో!

నీ కోరికల కే నీవు బానిస నీఆలోచనలకే నీవు బానిస అని తెలుసుకో కోరికలు అదుపులో పెట్టుకో అప్పుడే నీకీ “బానిస సంకెళ్ళు” బాధ వీడి పోతుంది.
—————————————-

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!