వృత్తి ని గౌరవిద్దాం

వృత్తి ని గౌరవిద్దాం

రచన:లోడె రాములు

గుణము లేని వానికే కులం పిచ్చి… కులము కన్నా గుణమే మిన్న…
అని అనాదిగా ఎందరో మహానుభావులు చెప్పినా…నేటికీ కొంత మంది కులమదాంధులు ,
తమ స్వార్థం కోసమే అందరినీ ఆ రోచ్చు లోకి లాగుతున్నారు… కులమూ, కులమూ అని కూసే
కన్నా..
మన మందరo ఒక్కటేనని తెలుసుకో అన్నా..
కులపిచ్చి తో గజ్జీ,గత్తర తప్పా, సాధించేది ఏమీ లేదు…. అందరిలో కలిసి చూడు ఆ ఆనందమే వేరు… కులం అంటే …మనకు జీవనోపాధి నిచ్చే వృత్తి కి మరో పేరు… ప్రతి మనిషికీ…ప్రకృతి లోని ప్రతి జీవికీ తనదైన ప్రత్యేకత ….. నైపుణ్యం కలిగిన తనదైన జీవన శైలి ఉంటుంది….అదే వారి ఆస్తి… అదే వారి ధైర్యం….ఆ వృత్తికి అందరూ దాసోహం కావాల్సిందే… ప్రతీ వృత్తినీ,అందులోని ప్రజ్ఞ నూ అందరం గౌరవించాల్సినదే..
ఇది తెలియని వాడు పండితుడైనా
పామరుడే..
ఒకరినొకరు అనచుకునే దోరణి.,
దొరతనం అనిపించుకోదు..
అది దోపిడీ,దుర్మార్గం, దుఛర్య,
దొంగతనాని కన్నా హీనం… అందరూ ..చీ …కొట్టే బతుకూ ..
ఓ బతుకే నా.!
ఆలోచించుకోండి….
ఆ ఆలోచనలను మార్చుకోండి.. నీ వృత్తి హక్కులకోసం పోరాటం చెయ్యి…
సాధించే వరకూ సమరం చెయ్యి…
నీ హక్కుల కోసం ఇంకొకరి
హక్కులను కాలరాయకు…
నీ భాద్యతలను కూడా గుర్తించుకో ఎవరూ ఎక్కువా తక్కువా కాదు…. ఎవరికి వారు ఎక్కువే..
ఎల్లలు లేవు ప్రతిభ కు. …

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!