సాధించానోచ్….!

అంశం: హాస్య కవిత

సాధించానోచ్….!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: అరుణ చామర్తి ముటుకూరి

ఏ గూటి నుండో వచ్చి వాలా తెలంగాణ గడ్డపై
రుచి లెన్నో తెలిసినా  మనసు పడ్డా ఒక వంటకం పై
స్నేహితుల ఇంట్లో తిన్నాను రొట్టె
చేత ,చెప్పినా అర్థం కాలేదు వారి కధ కట్టే కొట్టే
మొదలెట్టా  ప్రయత్నం.. అవ్వాలని సఫలం
సర్వం అంటే అన్ని పిండ్లు అనుకొని చేస్తే  విఫలం
రిగర్ మార్టిన్ ప్రారంభమైన శవంలా…
చాకుతో ను ముక్కలు కానీ గట్టి పదార్థంలా
అనుకున్నా అలవాటే గా జొన్న రొట్టె
చేసి చూస్తే ఆఖరన మిగిలింది మాడిన అట్టే
మరోసారి మరోసారి చేసే సాహసం
కుదరనే కుదరక అయ్యింది ప్రయాసం
వచ్చింది ముక్కలు ముక్కలు గా
అయినా తినబోతే ఓవైపు ఉంది పచ్చిగా
చెప్పలేదు కుక్కకు వేసినా
తినని విషయం
అప్పటికి నా ప్రయత్నాలు సశేషం
పరిహసించారు ఇదే అవకాశంగా
మరోసారి గమనించా సావకాశంగా
అర్థం అయ్యింది దాని పేరు సర్వపిండి
సర్వ కు తట్టి చేసే బియ్యం పిండి
తెలుసుకున్నా జొన్నరొట్టె అంత పల్చగా కాదని..
నూనె ఎక్కువేసి మందంగానే కాల్చాలని..
బాగానే కుదిరిందో మాదిరిగా
మరి నలుగురి ని చంపంది వైద్యుడు కాదుగా..
మరింత రుచిని కూర్చా పల్లీలు , ఆకుకూరతో
కుదుట పడ్డది మనసు తిరుగు లేదన్న ప్రశంసతో..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!