బలం కన్నా తెలివి మిన్న
రచయిత :: జీ వీ నాయుడు.
ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నారు. ఆయన రాజ సౌదం కు వెళ్లే మార్గంలో రెండు పెద్ద మర్రి చెట్లు రహదారికి అడ్డంగా ఉన్నాయి.. వాటిని తొలగించాలని రాజు గారు సంకల్పించారు. వీటిని తొలగించే క్రమంలో ఆ ఊళ్ళో ఎవరు బలవంతులో కూడా తెలుసుకోవాలి అనుకున్నారు రాజు. ఒక రోజు సాయంత్రం ఆ ఊళ్ళో ఒక చాటింపు వేయించారు..
రాజు గారు సౌదం కు వెళ్లే మార్గంలో రెండు మర్రి మాన్లను తొలిగించాలి. ఇందుకోసం ఇద్దరు బలమైన వ్యక్తులు కావాలి. రెండు మాన్లను ఎవరు ముందు కొట్టేస్తే వారికి ఓ అద్భుత మైన బహుమతిని అందిస్తారు అం టూ చాటింపు వేయించారు. పురజనుల మధ్య ఈ కార్యక్రమం ఓ పండుగులా జరుగుతుందని అందరూ ఆహ్వానితులే అని చాటింపులో పేర్కొన్నారు.
మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మహూర్తం గా నిర్ణయించారు. ఊళ్ళో ని చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ హాజరు అయ్యారు. హాజరైన పుర ప్రముఖులను సాధరంగా ఆహ్వానించారు రాజు.”” ఓ నా పురప్రముఖులారా… మీరు అందరు ఈ కార్యక్రమం తిలకించడానికి వచ్చినందుకు ఆనందం గా ఉంది. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా జాగ్రత్త గా వినాలి. ఇక్కడ రెండు మర్రిచెట్లను కొట్టేదానికి ఇద్దరు వ్యక్తులు ముందుకు రావాలి..30 ఏళ్ల లోపు వారుగా ఉండాలి.. ఈ ఇద్దరిలో చెట్లను కొట్టినందుకు పారితోషికం ఉంటుంది..
ఎవరు చెట్టును సమూలంగా ముందుగా కొడతారో వారికి మీరు ఎవరూ ఊహించని అతి గొప్ప బహుమానం ఉంటుంది… “”. అంటూ వివరించారు రాజు. ఓ బలమైన బాగా కండలు తిరిగిన యువకుడు… నేను రెడీ… అంటూ లేచాడు.. మరో బలహీనమైన యువకుడు కూడా… ఎస్.. నేనూ రెడీ అన్నాడు. బలహీనుడ్నీ చూసి బలవంతుడిలో నూతన ఆనందం కనిపించింది.
రాజు గారు ఇద్దర్నీ అభినంధించి చెరో గొడ్డలి ఇచ్చి చీకటి పడేలోపు ఈ వృక్షాల తొలగింపు పూర్తి కావాలి అన్నారు… అంతే రాజు గారు ఆదేశించారు… ఇరువురు చకా చకా కొట్టుడు కార్యక్రమం లో నిమగ్నం అయ్యారు.
కొట్టీ… కోట్టీ.. కొట్టీ.. అలసిపోయే లా ఉన్నారు ఇద్దరు.. ఇంతలోనే బలహీనుడు కొంచం అలుపు తీసుకునేందుకు చెట్టుకింద కూర్చొన్నాడు.. ఇది చూసి బలవంతుడు తెగ ఆనంద పడ్డాడు.. “చెట్టు కొట్టడం అంటే మాటలా.. నాతో పోటీనా. నేను కూడా అలసిపోకుండా మెల్లగా కొట్టుకుంటా ” అంటూ తనలోని అహం ను బయటకు చూపాడు బలవంతుడు. అయితే ఇదంతా గమనిస్తున్న బలహీనుడు చెట్టుకింద ఖాలీగా కుర్చో లేదు. ఒక నునుపు రాయిని తీసుకొని గొడ్డలిని సానబట్టాడు…”అమ్మయ్య. అలుపు తీర్చుకున్నాను. సానబట్టుకున్నాను. ప్రత్యర్థిలో అహం చూసాను. అతనిలో స్పీడ్ తగ్గింది.,ఇన్ని ప్రయోజనాలు కలిగాయి “అంటూ రెట్టింపు ఉత్సాహం తో గొడ్డలికి పని చెప్పాడు బలహీనుడు….
అంతే బలవంతుడు బలహీన పడ్డాడు,స్పీడ్ తగ్గింది. గొడ్డలి మొద్దుబారింది.. సాయంత్రం లోపే బలహీనుడు చెట్టును నెలకూల్చి..” బలం కన్నా తెలివి మిన్న “అని చాటాడు. రాజు గారు అతని తెలివి కి మెచ్చి ” శహాభాష్, నీవు విజేతవు. బలహీనుడవు కావు., బావంతుడవు. నా సగం రాజ్యం నీకు అప్పగించెదను ” అంటూ సెలవిచ్చారు. అందుకే “బలం కన్నా తెలివి మిన్న ” అంటారు.
