శివప్ప

శివప్ప
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:యాంబాకం

ఒక అడవిలో ఒక భోయవాడు పేరు “శివప్ప” చిన్న గుడిసె వేసికొని కాపరం ఉండే వాడు.
అతనికి ఇద్దరు భార్యలు గంగమ్మ, మంగమ్మ అందులో పెద్ద భార్య గంగమ్మ చిన్న భార్య మంగమ్మ. గంగమ్మ ఉత్తమురాలు మంగమ్మ కాస్త మొండి గట్టం గయ్యాళి శివప్ప వేటకు పోయినప్పటి నుండి మంగమ్మ రోజు గంగమ్మ తో ఆగడాలు ఎక్కువై పోతుంది. కానీ గంగమ్మ సర్దుకు పోసాగింది. భర్త తో మంగమ్మ గంగమ్మ పై చాడీలు చెప్పటం పేచీలు పెట్టడం మొదలు పెట్టింది. శివప్ప భార్యలకు ఒకరంటే ఒకరికి క్షణం కూడా పడకపోవడం తో వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడు కోవటం చూసి శివప్ప ఇక ఈ బాధ పడలేననుకున్నాడు. తన ఇంటని రెండు భాగాలు చేసి తూర్పున గంగమ్మ, పడమటభాగాన మంగమ్మను ఉంచాడు వారి వెనుక ఖాళీస్థలంలో మంచి మంచి పూల మొక్కలు పెద్ద మానులై వారి గుడిసె చుట్టూ  కొమ్మలు విరిగా రావడంతో ఎవరి భాగంలో పూలు వాళ్ళు కోసుకొనేవారు, సరే ఇక భార్యలిద్దరూ ఒకళ్ళతో ఒళ్ళు పోట్లాడు కోకుండా ఉంటారు. ఇక ముందు తగువులు ఉండవని శివప్ప ఆశపడ్డాడు. కానీ మంగమ్మ బుద్ది మాత్రం ఎప్పటిలాగనే ఉండేది. ఆమెకు గంగమ్మ మీద ఉన్న అసూయ ఎంత మాత్రం తగ్గలేదు. సమయం దొరికి నప్పుడల్లా గయ్యాళి తనం చూపుతూనే ఉన్నది. ఇంకా గంగమ్మ ని కష్టపడదామనే ఎదరు చూస్తూనే ఉంది మంగమ్మ. గంగమ్మ కు దైవభక్తి కలదు అందకే అక్కడ పూసే బంగారు అడవి పూలతో ప్రతిదినం ఉపవాసం చేస్తూ ఉండటం చిన్న తనంనుండి అలవాటు. దేవునికి మహిమలు ఉంటాయని తెలిసిన భక్తురాలు అక్కడ ఉండే పూలచెట్ల మధ్య ఒక మరేడు చెట్టు కూడా పెరిగింది. అవి శివునికి ఇష్టం అని తరచూ వాటితో కూడ పూజలు చేసేది. మంగమ్మకు భక్తి అసలు ఉండేది కాదు దైవభక్తి, పతిభక్తి అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకంలేదు. పైగా సోమరిపోతు, అందుచేత కాస్త దురుసు తనం ఎక్కువ. అదేమిటోగాని గంగమ్మ వైపు ఉండే కొమ్మలకు పూలు బాగా కాసేవి గాని మంగమ్మ వైపు చాలా తక్కవ పూలు పూచేవి. అంతేగాక గంగమ్మ సంసారం చక్కగా ఉండేది. కొంతకాలం గడిచింది. మంగమ్మ ఉండే వైపు చెట్లు బాగా ఎండిపోయినాయి. గంగమ్మ వైపు ఉన్న చెట్లు పచ్చగా మెరిసిపోతున్నాయి అది గమనించిన మంగమ్మ నాకు గంగమ్మ ఉండే వైపు కావాలని భర్తను పట్టు పట్టింది. నాకు మంచి వైపు భాగం ఈయలేదు “నాకు గంగమ్మ ఉండే తూర్పు భాగం కావాలని అడిగింది. మంగమ్మ. సరే నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అని పడమటి వైపుకు గంగమ్మ వచ్చింది కాపురానికి. గంగమ్మ మునుపటి లాగానే పడమటిపక్క శుభ్రంగా బాగుచేసి చెట్లకు నీళ్లు పోసి పూజలు చేయడం వల్ల తక్కువ కాలంలో చెట్లు పచ్చగా మెరవడమే కాక బంగారు పూలు కాచాయి. సోమరిపోతు ఐన మంగమ్మ తూర్పు వైపు పోగా అక్కడ చెట్లు వాడి ఎండిపోయి. ఒక రోజు గంగమ్మ ఉదయం లేచి పూలు కోసుకుంటూ ఉండగా చూసింది. మంగమ్మ కు మళ్లీ అసూయ పుట్టింది గంగమ్మ మీద. మరలా భర్తకు చెప్పింది. అంతే కాదు ఆపూలు నీవు రోజు దొంగతనంగా కోసి నాకు తీసుకొనిరా అని చెప్పింది. అంతే శివప్ప ఈ ఇద్దరు మధ్య నలిగిపోతున్నందుకు, ముఖ్యంగా తన చిన్న భార్య ఐన మంగమ్మ తో వేగలేక ఈ చెట్ల వలనే రోజు తగువులు వస్తున్నాయి. అని భావించి. గొడలి, గడ్డపాప తీసుకెళ్లి ఆ చెట్లను నరకి వేశాడు. అక్కడే ఉన్న మారేడు చెట్టు నుండి రక్తం చిమ్మింది. “చెట్టులో నుంచి రక్తం చిమ్మడం ఏమిటి? అని”ఆశ్చర్యంగా చూశాడు. శివప్ప. ఏమి కనిపించల గునపంతో చుట్టూ తవ్వాడు అంతే  ఒక్కసారిగా కిందపడి పోయాడు. శివప్ప భర్త ఇంకా ఇంటికి రాలేదని భార్యలిద్దరూ బయట వచ్చి చూడగా శివప్ప కిందపడి ఉన్నాడు. ఇద్దరూ కలసి ఇంటికి లోపలికి తీసుకు పోయి నీళ్ళు మొహం మీద చల్లగా శివప్ప భయంతో వణుకుతూ నత్తిగా ర…. ర.. రక్తం అని ఏదో చెప్పుతూ మారేడు చెట్టు ఉన్న స్థలం వైపు వేలు చూశాడు. ఆ తరువాత దేవుని పై నమ్మకం లేని మంగమ్మ ఆ రక్తం వచ్చే చోటుకు పోయి చూదాం రండి అని ముగ్గురు పోయి చూస్తురు కదా, ఆ మారేడు చెట్టు కింద భాగం లో “ఒక లింగం దాని ముందు బాగంలో నోరు, ముక్కు కళ్ళు అచ్చం మనిషికి ఉన్నట్లు గా ఉన్నాయి. గొడ్డలి తగిలి గాయం అయ్యి ర‌క్తం కారుతుండగా దైవభక్తి గల గంగమ్మ దేవున్ని నరికావా అని బిగ్గరగా అరుస్తూ దంపతులు ముందు గాయం కడిగారు. తక్షణమే శివప్ప ఆకుపసురు వేశాడు.”కొంత సమయానికి అక్కడ రక్తం కనించలేదు. ఆ ముగ్గురు కాస్త ధైర్యం తెచ్చుకుని ఇంటికి పోయి నిద్ర పోయారు. కానీ శివప్పకు ఎంత సేపటికి నిద్ర పట్టలేదు. భయ పడుతూనే చివరి క్షణంలో కునుకు తీశాడు. ఇంతలో శివప్పకు ఒక కళ ఆ కళలో శివుడు కనపడి “ఓ శివప్ప నీవు భయపడకు నేను అక్కడే జపం చేసుకొంటున్నాని నీకు ఏలా తెలుస్తుంది. నీవు ఈ ఊరి రాజుకు ఈ సంగతి తెలియజేయి ఆ తరువాత నీకు అంతా మంచే జరుగుతుంది. అని చెప్పి మాయమైపోయాడు.
వెంటనే శివప్పకు మెలుకువ వచ్చి కళ్ళు నలుపుతూ లేచి, భార్యలతో కళ గురించి చెప్పగా గయ్యాళి మంగమ్మ కొట్టిపడేససింది. కానీ భక్తురాలు గంగమ్మ దేవుని మహిమలు తెలిసినది కాబట్టి శివుని ఆజ్ఞ మేరకు భర్తను తొందర పెట్టింది. ఇద్దరి భార్యలను తీసుకొని పోయి రాజుతో చెప్పారు. ఇది విన్న సభలోని వారు రాజు ఆశ్చర్యపడి ఆ వింత చూడటానికి అవశ్యం బయలుదేరారు. ఆ అడవిలో ఒక “నది దాని పేరు వంశధార” అనే నది ప్రవహిస్తూఉంటుంది. ఆ నది సమీపంలో ఉన్న గ్రామాధికారిని పిలిచి శివప్ప చెప్పిన స్థలానికి ఎంత దూరం అని అడిగాడు. వారు ప్రభూ ఇక్కడకు రెండు మైళ్ళదూరం ఉంటుదని చెప్పగా రాజు ఆ గ్రామాధికారితో కలసి శివప్ప చెప్పిన స్థలానికి చేరగా! అక్కడ ఒక గుడి వెలసి నిగ, నిగ లాడే కాంతులతో మెరుస్తూ కనిపించింది. శివప్ప వారి భార్యలు, రాజు వచ్చిన గ్రామాధికారి ప్రజలు ఆశ్చర్య పోయారు. నిన్న లేని గుడి ఎట్లా వచ్చిందో! అని ఆ గుడి ఎవరుకట్టారు? ఆని రాజు ఆ పల్లెవాళ్ళను ప్రశ్నించగా! వారు మాకు అర్థం గాలే అక్కడ ఏదో శబ్దం వినపడగా కొంతమంది వ్యక్తులులతో కలిసి చూడటానికి పోతుండగా! మాకు పులులు, సింహాలు ఎదురు కావడంతో మేము తిరిగి వచ్చేసాము, ఇదిగో ఇప్పుడు చూస్తే గుడి కనబడుతుంది. ఇంతలో గుడి ఇది మానవులకు సాధ్యం కాదు, ఇది దేవుని మహిమనే అనుకున్నము ఇదే మాకు తెలిసినది. అని చెప్పారు. అక్కడి వారు. ఈ సంగతి వినేసరికి రాజుతో సహా ఆ నదిలో మునిగి గుడిలోకి ప్రవేశించారు అక్కడ లింగం మనిషి ముఖంతో కనిపించింది. అక్కడ పూజలు జరిగినట్టు కూడ దీపాలు వెలిగించి పూల మాలలు వేసి ఉన్నాయి. వెంటనే రాజు అర్చకులను పిలిచి ఆ గుడికి పూజారులుగా నియమించి ఈ గుడికి పేరు పెట్టిమని చెప్పగా! వారు ముందు ముఖం ఉంది కాబట్టి “ముఖలింగేశ్వరుడు”అని పేరు పెట్టారు. అప్పటి నుంచి అక్కడ నిత్యం దీపదూప నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించి కొంటూ భక్తులు ఏర్పడారు. ఇది మొదట గా చూసినవాడు “శివప్ప”వారిభార్యలు కనుక వారిని అక్కడ దేవాలయ యజమానులుగా ధర్మకర్తలుగా రాజు నియమించాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!