రచన – వేముల ప్రేమలత
శిరసు పైన గంగమ్మ చిద్విలాసంగా నిలువ
సగము మేనిలో గౌరి నిండగా
మారేడు పత్రాలు సమర్పించినంతనే మాకు ఆనందాలొసగేవు
భోళా శంకరుడా! ఎంతటి దయామయుడివయ్యా!
అభిషేక ప్రియుడవని తెలిసి
దోసెడు నీటి అభిషేకానికే కోటి వరాలిచ్చేవట
విభూతి ధారణతో స్మశానంలో నివాసమట
ఇచ్చే వాడివీ నీవే, తీసుకునే వాడివీ నీవే మేమంత??
నందివాహనా! నమశ్శివాయని శరణు వేడినంతనే
శీఘ్రముగా కరుణించే ముక్కంటి నీవట
చంద్రశేఖరా చల్లగా చూడుమయ్యా
మల్లిఖార్జునా నిన్ను మల్లెలతో పూజింతుమయ్యా
గరళ కంఠా, నాగాభరణా
పాపములెల్ల పారద్రోలుమయ్యా
కాశీ విశ్వనాథా, కైలాసపుర నివాసా
ఆది భిక్షువు నీవే అర్థ నారీశ్వరా
అశితోషితా శివా! శివరాత్రి రోజున నీ నామ స్మరణతో,
ఉపవాస దీక్షతో నిను గొలిచేము
కాశీ పుర నివాస నిత్య సంతోషాలు
చేకూర్చుమయ్యా! శివా!
గుడ్ బాగుంది