అనుచితం

అనుచితం

రచన:: జి.ఎల్.ఎన్.శాస్త్రి

ఎగిరే విహoగానికి రెక్కలు కట్టేసి,
ఉరికే తినిపిస్తుంటే ఇంకేమి నేర్చుకోదు,
ఈదే చేపపిల్లని తీసుకువచ్చి
గాజు డబ్బాలో బంధిoచి,
ఎంత కడుపునిoపినా
తాను జీవనవిధానం మరిచి
గాలి పీల్చడం కూడా మరచిపోతుంది.
ఉచితం పేరుతో అనుచితంగా
పంచుకొంటూ పోతే బీదవాడు
గొప్పవాడు కాడు,
దేశం మాత్రం బీదదైపోతుంది.
ఆకలైన వాడికి అన్నం సంపాదించే
అనువు నేర్పు,
వాడులోకాన్ని జయిస్తాడు,
లేకపోతే లోకహీనుడైపోతాడు,
అన్నీ ఉచితమంటే తినికూర్చుని,
ఏ వ్యాపకం లేక ఎందుకూ కొరగాక
లోకకంఠకుడైపోతాడు.
అపాత్ర దానం ఆపి పాత్రత కలిగిన దానం
ప్రగతికి రహదారి.
పాలకులు మేలుకోండి
అన్ని ఉచితమనే
అనుచితం ఆపండి,.
పధకాల పేరుతో ఓట్లు కొనే
వంచనా రాజకీయాలు ఆపి,
ప్రజలను ఆదుకునే నిజమైన పoపకాలు
చేసి దేశాన్ని అభివృద్ధి పధంలో నడపండి.
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!