డిటెక్టివ్ వంశీ

డిటెక్టివ్ వంశీ

రచన: పద్మజ రామకృష్ణ.పి

రోజురోజుకూ దొంగతనాలు పెరిగిపోతున్నాయి ఊర్లో. వేసిన తలుపులు వేసిన్నట్లే ఉంటున్నాయి, గుళ్ళల్లో దేవుడి నగలతో సహా మాయమైపోతున్నాయి.  వెండి వస్తువులు ఎన్ని ఉన్నా కూడా అవి తియ్యడం లేదు, కేవలం బంగారాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ చోరీకి గురికావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఊర్లో అందరికీ. పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది.
అమ్మవారి గుళ్లో నగలు పోయాయని పూజారి కంప్లైంట్ ఇచ్చాడు. మరో ఇద్దరు కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఇంట్లో నగలు పోతున్నాయి,
ఎలా పోతున్నాయో అర్థం కావడం లేదు, మా ఇళ్లల్లోకి బయట నుండి మనిషి వచ్చే ఛాన్స్ లేకుండానే ఇలా జరుగుతుందని, అంతే కాదు వెండి వస్తువులు ఎన్ని ఉన్నా కూడా గోల్డ్ మాత్రమే పోతుందని, ఇదేదో మాయగా ఉందంటూ వాపోయ్యారు.
విజయ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. రంగరంగ వైభవంగా గృహప్రవేశం చేశాడు. కిటికీలు గుమ్మాలు చాలా కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించాడు.
ఆరోజు – విజయ్ భోజనం చేస్తూ డైనింగ్ టేబుల్ మీద ఉంగరాలు పెట్టి మర్చిపోయాడు, భార్య నీలిమ చెవి దుద్దులు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి నిద్రకు ఉపక్రమించింది.
తెల్లారి, నిద్రలేవగానే నీలిమ చెవి దుద్దులు కనిపించలేదు, ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయానేమో అని ఇల్లంతా వెతికింది, ఎక్కడా కనిపించలేదు.
“నీలిమా నీలిమా” అంటూ భర్త కేకలు వినిపించి, “ఏంటండీ” అంది.”డైనింగ్ టేబుల్ మీద నా ఉంగరాలు చూసావా?”
“డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన నా చెవి దుద్దులు కూడా కనిపించడం లేదండీ, పని వాళ్ళు కూడా ఇంకా ఎవరూ రాలేదు ఏమైఉంటాయి, వేసిన తలుపులు వేసిన్నట్లే ఉన్నాయి.” విజయ్ కి అర్థమైంది ఊర్లో జరిగే చోరీలు తన ఇంటి వరకు వచ్చాయని. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఉపయోగం ఉండదేమో ఊర్లో తరచూ జరిగే దొంగతనాలను కూడా ఛేదించలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు అని నిన్నటి పేపర్లో తాను చూసాడు కదా! ఇప్పుడు ఎలా? వెంటనే గుర్తుకు వచ్చాడు తన చిన్ననాటి స్నేహితుడు డిటెక్టివ్ వంశీ.
గుర్తు వచ్చిందే తడవుగా వంశీని మీటయ్యాడు.
ఊర్లో జరుగుతున్న చోరీలు గురించి వివరంగా చెప్పాడు విజయ్. వంశీ తన అన్వేషణ మొదలు పెట్టాడు. మొదటిగా వేలిముద్రలు సేకరించాడు ఆ వేలిముద్రలు చూసిన వంశీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు, అవి సంవత్సరం లోపు ఉండే పసిపిల్లల వేలిముద్రలు.”చూడండి అన్నయ్యా! ఎక్కడా కూడా తలుపులు తీసిన సందర్భం లేకుండానే ఇలా జరిగింది, ఆ చెవి దుద్దులు వారు నాకు ఎంతో ప్రేమగా డైమండ్స్ పెట్టించి మరీ చేయించారు, గోల్డ్ కంటే కూడా అవి చాలా విలువైనవి, కొత్తింట్లోకి రాగానే ఇలా జరిగింది, ఏమీ అర్థం కావడం లేదు మాకు” అంది నీలిమ బాధగా వంశీతో. ఇల్లంతా పరిశీలించాడు వంశీ. ఒకచోట ఎగ్జాస్ట్ ఫ్యాన్ కొరకు ఉంచిన చిన్నరంధ్రం కనిపించింది, కాని అందులో మనిషి పట్టే ఛాన్స్ లేదు అని ఆలోచనలో పడ్డాడు. బాధలో ఉన్న నీలిమ కాఫీ కూడా పెట్టలేదు. వంశీకి కనీసం కాఫీ అయినా ఇప్పించాలి అనుకుని. “వంశీ అలా బయటకు వెళ్లి కాఫీ తాగి వద్దాం” అని విజయ్ వంశీని బయటకు తీసుకువెళ్ళాడు.ఇద్దరూ కాఫీ తాగుతుండగా, అక్కడకు చేతిలో రెండు కోతుల్ని పట్టుకుని ఒక గారడీవాడు వచ్చాడు. వంశీ చూపు ఆ కోతులపై పడింది. విజయ్ తో మాట్లాడుతూనే ఆ గారడివాణ్ణి గమనిస్తున్నాడు. గారడీవాడు టీ తాగగానే చిల్లర సంచిలో నుండి కరెక్ట్ గా రెండు రూపాయల తీసిచ్చింది కోతిపిల్ల “ఇక్కడే ఉండు నువ్వు రాకూ” అని విజయ్ కి చెప్పి, ఆలస్యం చెయ్యకుండా ఒక్కడుగులో  గారడివాడి దగ్గరగా వెళ్ళాడు వంశీ. తన పర్స్ నుండి ఐదురూపాయి తీసి గారడివాడి చేతిలో పెట్టి నీకే తీసుకో అన్నట్లు నవ్వాడు. “నీ కోతి అలా ఎలా చిల్లర ఇవ్వగలిగింది, అందులో నోట్లు కూడా ఉన్నాయి కదా బాగా ట్రైనింగ్ ఇచ్చావనుకుంటా” అన్నాడు వంశీ నవ్వుతూ. “అయ్యా, దానికి అలా గారడీ విద్య నేర్పందే మాకు పూట గడవదు, లేదంటే మాకు పస్తులే.” “ఇక ఇబ్బంది ఉండదు త్వరలో నీ కష్టాలు  తిరిపోయి, ప్రతిపూట పస్తు లేకుండా జరుగుతుంది.” అని చెప్పి అక్కడి నుండి కదిలాడు వంశీ. భయంగా చూసాడు గారడీవాడు. అతనికి అర్థమైపోయింది తన ఆట ఇక కట్టని. గబగబా ఇంటికి నడిచాడు గారడీవాడు. విజయ్ ని ఇంటికి పంపి తను మాత్రం అక్కడే గోడ చాటున దాక్కుని ఉన్న వంశీ, గారడివాడ్ని ఫాలో అయ్యాడు. వంశీ విజయ్ ఇంటికి వెళ్ళాడు. “రేయ్, విజయ్ దొంగ దొరికాడు” అవునా..! వంశీ నిజమా..!
“అవును, ఆ గారడివాడే మీ ఇంట్లో చోరీ చేసింది”
ఇంట్లోకి మనిషి వచ్చే అవకాశం లేదు కదా’ అని అర్థం కాక అయ్యోమయంలో ఉన్నారు నీలిమా దంపతులిద్దరూ. విజయ్ మనం స్టేషన్లో ఆధారాలతో సహా కంప్లైంట్ చెయ్యాలి, పోదాం పదా.” “డిటెక్టివ్ గారూ, కాస్తంత వివరం చెప్పండీ మీరెలా దొంగను కనిపెట్టారో” అని నవ్వాడు విజయ్. ఒక్కసారి ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద చూడూ కుంకుమ వొలికిపోయి ఉంది.” అంతలో నీలిమ అందుకుని. “అవును అన్నయ్యా నా చేతిలోనే ఆ కుంకుమ వొలికి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడింది.” “టీ స్టాల్ దగ్గర ఆ కోతి చేతికి సేమ్ కలర్ కుంకుమ అంటి ఉంది, ఇలా రా ఇక్కడ రంధ్రం దగ్గర చూశావా అది చోరీ చేసి వెళ్ళేటప్పుడు అంటిన కుంకుమ మరకలు, మొదట ఆ కోతి దుద్దులు తీసింది తరువాతే డైనింగ్ టేబుల్ మీద ఉంగరాలు తీసింది అందుకే టేబుల్ మీద కూడా కుంకుమ మరకలు అంటాయి.”
స్టేషన్లో జరిగిన విషయం చెప్పారు. పోలీసులు పాత ఫైళ్ళు మొత్తం తీశారు వాటిలో కూడా పసిపిల్లల వేలుముద్రలుగా రిపోర్ట్ ఫైల్ చేసి ఉంది.పోలీసులు గారడివాడ్ని అరెస్ట్ చేసి విచారణ జరిపారు.
ఈ దొంగతనమే కాదు మిగతా దొంగతనాలు మొత్తం నువ్వే చేశావని అర్థమైంది, ఎలా చేశావో చెప్పు” అంటూ నిలదీశారు పోలీసులు.”పగలంతా గారడీ చేస్తూ ప్రతి ఇంటిని గమనించే వాడ్ని, అనుకూలంగా ఉన్నా ప్రతి చోట చోరీ చేసేవాడ్ని, బంగారు రంగులో ఉన్న వస్తువులు మాత్రమే తెచ్చేలా నా దగ్గర ఉన్న రెండు కోతులకూ నేర్పించాను, ఎంత చిన్నరంధ్రం ఉన్నా కూడా దూరేలా దానికి అలవాటు చేశాను” అని చెప్పాడు గారడీవాడు . ఎవరి నగలు వారికి ఇప్పించారు పోలీసులు. నీకు ఇక పస్తులే లేని రోజులు అంటే ఇవే అని అక్కడి నుండి నవ్వుతూ వంశీ వెళ్లిపోయారు. మరో కేసు అన్వేషణకై.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!