పిల్లలలో కరోనా వైరస్..

పిల్లలలో కరోనా వైరస్

Dr.లలిత అరవింద్

1. మొదటి వేవ్ కన్నా రెండవ వేవ్ ప్రమాదమైనదా?ఎందుకు?
అవును మ్యుటేషన్ జరగడం వల్ల చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

2. కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు?
పిల్లలకు ఏ అంటువ్యాధులైనా త్వరగా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పిల్లలను ఎక్కువ మంది జనాభా ఉండే ప్రదేశాలకు తీసుకుని వెళ్లకుండా జాగ్రత్త      తీసుకోవాలి. వివాహాలకు, వినోదాలకు పిల్లలతో హాజరు కాక పోవడం ఉత్తమం.
ఇంకా SMS ను అనుసరించాలి..
S-సోషల్ డిస్టన్సింగ్ (మనుషుల మధ్య దూరం)
M-మాస్క్ (నోటికి, ముక్కుకు అడ్డుగా మాస్క్)
S-సానిటైజేషన్( చేతులను శుభ్రపరచుకోడం.)

3.పిల్లలకు వచ్చే జ్వరం కోవిడ్-19 అవునా? కాదా? అని ఎలా తెలుస్తుంది..?
ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో వచ్చే ప్రతి జ్వరాన్ని మనం కోవిడ్ లాగానే అనుకుని ముందు నుండి జాగ్రత్తలు తీసుకోవాలి..ఇంకా చెప్పాలి అంటే పిల్లలకు వచ్చే ఏ చిన్న జబ్బులను అయిన చాలా జాగ్రత్తగా పరిశీలించి తొందరగా జాగ్రత్తలు తీసుకోవాలి.

4. పిల్లలలో ఈ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి?
జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి మరియు వాంతులు, విరోచనాలు.

5. పిల్లలకు ఎప్పుడు కోవిడ్ టెస్ట్ చేపించాలి?
-ఎప్పుడైతే తల్లిదండ్రులు లేదా ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులలో కోవిడ్ ఉంది అని తెలుస్తుందో.
-పిల్లలకు మూడు రోజులు మించి జ్వరం ఉన్నట్లయితే.

– పిల్లలలో కోవిడ్ కి సంభందించిన లక్షణాలు ఉంటే.
6. ఏ టెస్ట్ లు చేపించాలి?
-RT -PCR
-RAPID టెస్ట్
chest CT స్కానింగ్ అందరికి అవసరం లేదు.డాక్టర్ నిర్ణయించిన వారికి మాత్రమే అవసరం.

7. A.తల్లి బిడ్డ కరోనా పాజిటివ్ అయితే ఏమి చేయాలి?
తల్లి బిడ్డలను ఒకే దగ్గర ఉంచి తల్లి పాలను తాగించడమే మంచిది.
B. తల్లి కరోనా పాజిటివ్, బిడ్డకు కరోనా నెగటివ్ అయితే ఏమి చేయాలి?
తల్లి మాస్క్ వేసుకుని తల్లి పాలు ఇవ్వడం ఉత్తమమైనది. ముఖ్యంగా పైన చెప్పిన SMS ని తప్పకుండా ఆచరించాలి.

8. ఏ వయసు ఉన్న పిల్లల నుండి మాస్క్ ఉపయోగించాలి?
రెండు సంవత్సరాల వయసు పైనుండి పిల్లలందరు మాస్క్ ఉపయోగించవచ్చు.

9. ఎటువంటి పిల్లలలో ఈ వ్యాధి ప్రమాదకారి అవుతుంది?
ఏ పిల్లలకైతే గుండె, లివర్, కిడ్నీ మరియు క్యాన్సర్ కు సంభందించిన వ్యాధులతో బాధ పడుతూ ఉంటారో వాళ్ళ విషయంలో ఈ వ్యాధి ప్రమాదకారి అని చెప్పవచ్చును.
ఇంకా ఊబకాయం ఉన్న పిల్లల్లో కూడా ఈ వ్యాధి ప్రమాదకరమైనదిగా చెప్పుకోవచ్చు.

10. పిల్లల్లో వచ్చిన కోవిడ్ -19 ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి?
-ఐదు రోజులు మించి జ్వరం ఉన్నప్పుడు.
-ఊపిరి తీసుకోవడం ఎక్కువ లేదా ఇబ్బంది అయినా.
– నోటి ద్వారా గాలి తీసుకుంటున్నప్పుడు.
-నీరసంగా మరియు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు.
-SPO2 95% కంటే తక్కువ ఉన్నప్పుడు(SPO2< 95℅).

11. వాక్సిన్ ఎవరు తీసుకోకూడదు?
గర్భవతులు మరియు బిడ్డకు తల్లి పాలు ఇచ్చే తల్లులు ఈ వ్యాక్సిన్ వేసుకోకూడదు.

Dr.లలిత అరవింద్ (చిన్నపిల్లల డాక్టర్) గారు…
పిల్లలకు కోవిడ్ -19 రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు, సలహాలు, సూచనలను మా తపస్వి మనోహరంతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

 

 

You May Also Like

3 thoughts on “పిల్లలలో కరోనా వైరస్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!