సాహసం

(అంశం: చందమామ కథలు)

సాహసం

రచన: విస్సాప్రగడ పద్మావతి

మగధ సామ్రాజ్యాన్ని చంద్ర కేతుడు అనే రాజు ప్రజలను కన్నబిడ్డల వలె పరి పరిపాలించే వాడు. ఆయన ఆస్థానంలో దేవ దత్తుడు అనే మంత్రి ఉండేవాడు. అతను సమయస్పూర్తి.. విజ్ఞత కలిగిన వ్యక్తి.
ఒకనాడు రాజు గారి కుమారుడు వేటకోసం అడవికి వెళ్ళాడు. మార్గం మధ్యలో అతనికి దాహం వేసింది. మంచి నీళ్ళ కోసం చుట్టూ చూసాడు. దూరంగా పెద్ద చెరువు కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూడగా ఆ చెరువు కొంత భాగం తామరలతో నిండి ఎంతో అందంగా ఉంది. చెరువు నీటిలో ఆకాశం నీడ బహు సుందరం గా కనిపించింది. నీళ్ళు తాగి వెనక్కి వస్తుంటే.. పాము కాటుకు గురైయ్యాడు. ఒళ్లంతా నీలంగా మారిపోయి.. జీవచ్చవం గా పడిపోయాడు.. విషయం తెలిసిన రాజు గారు రాజ్యంలో ఎవరైతే రాకుమారుడి ని మామూలు స్థితికి తీసుకొస్తారో.. వాళ్ళకి బంగారు కత్తిని బహుకరిస్తా అని దండోరా వేయించారు.
అది విన్న బంగార్రాజు తన🙄 భైరవ ద్వీపం కు బయలుదేరాడు. అది ఎంతో దట్టం గా.. భయంకరం గా.. విష సర్పాలతో ఉంటుందని తెలిసి, సాహసం తో ద్వీపం కు  చేరాడు. గబ్బిలాల మంద నెత్తి మీంచి వెళ్తుంటే భయపడకుండా దైర్యం తో.. లక్ష్యాన్ని మదిలో నింపుకొని ఏదురోచ్చే జంతు జీవాలను హతమారుస్తూ.. చివరకు ద్వీపం చేరుకుని, అక్కడ ఉన్న మణిని తీసుకుని హుటాహుటిన రాజ్యం కు బయలుదేరాడు..
వెంటనే ఆ మణిని రాజ కుమారుడి నుదిటిపై న పెట్టగానే.. అతను మామూలు స్థితికి వచ్చాడు. ప్రాణాపాయం నుండి గట్టేక్కేడు.
వెంటనే రాజు గారు బంగార్రాజు దైర్య సాహసాలను కొనియాడి, అన్నమాట ప్రకారం బంగారు కత్తిని, రత్నాల హరం ను బహుమతిగా ఇవ్వటమే కాకుండా ఉంద్యోగం కూడా ఇచ్చాడు. బంగార్రాజు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళేడు.

నీతి_ ధైర్యం గా ఉంటే ఏదైనా సాధించ వచ్చు. ఎంతటి అసాద్యాన్నైన సుసాధ్యం చెయ్యచ్చు.

You May Also Like

One thought on “సాహసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!