ఏ జన్మ బంధమో కదా మనది!

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

ఏ జన్మ బంధమో కదా మనది!

రచన: జయ

ఎక్కడ మొదలౌవుతుందో,ఎక్కడ అంతం అవుతుందో తెలియని జీవిత ప్రయాణంలో ఎన్ని మలుపులో, ఎన్ని మజిలిలో కదా.. అమ్మ పేగుతో మొదలైన మన గమనంలో ఎన్నో పరిచయాలు మనల్ని పలకరించి పోతు ఉంటాయి. వాటిలో కొన్ని మనకు సంతోషం మిగిల్చి పోతే,కొన్ని బంధాలు కన్నీటిని బహుమతి గా ఇచ్చిపోతాయి. కానీ అన్ని బంధాలు రక్తసంబంధాలే అయ్యివుండకపోవచ్చు ,పేగు బంధమే కనక్కర లేదు గా.స్నేహబంధాలు కావొచ్చు, కొన్ని బంధాలు అన్ని బంధాలకు అతీతమైన వి కావొచ్చు ఏంటి అతీతమైనదే.. అవును నిజమే దానికి సాక్ష్యం మన బంధమే
కదా కన్నా.!
“ఎవరి వో తెలియదు కాని నా చిరునవ్వు కి చిరునామా వు అయ్యావు ఇప్పుడు.
ఎందుకు వచ్చావో తెలియదు నా ఎదలో కొలువైన ప్రేమకు ప్రతిరూపం నువ్వయ్యావు””
నా సంతోషంకు కారణం నువ్వు.
నా అలకలు తీర్చు ఆత్మీయత నువ్వు.
నాలో నాకే తెలియని స్వార్ధాన్ని బయటకు తీసిన ధర్మర్గుడువు నువ్వు.
నన్ను బుజ్జగించు అమ్మవు నువ్వు
నా చిలిపి అల్లరి భరించే నాన్నవు నువ్వు
నాతో గొడవ పడే తోబుట్టువు నువ్వు.
నా తుంటరికొరికలకు కళ్ళెం వేసే మగమహారాజువు నువ్వే కదా పిల్లొడా.
మరి ఏమి కానీ నాకు అన్ని నువ్వైనప్పుడు మన బంధానికి పేరు ఏమిటి?
అన్ని బంధాలకు అతీతమే కదా!
ఉఫ్ఫ్….
ఏంటే ఏమైంది నీకు ,ఏవేవో మాట్లాడుతున్నావ్. బానే ఉన్నావ నువ్వు.
ఓయ్ హెలో బానే ఉన్న నా కన్నా తోడు ఉండగా నా సైన్యమై ,నా నీడ గా, నా ధైర్యంగా ఉండగా ..
ఇక ఆపుతావా .! ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను ఇలా మాట్లాడుతున్నావ్.
ఎవరో అన్నారు అని కాదు కాని కొందరి మాటలు మనస్సుకు బాధ కలిగిస్తాయి.

గత జన్మలో మిగిలిపోయిన ప్రేమ బంధాలే ఋణబంధాలై మనల్ని చేరతాయి అంట అలా అని ఎవరో చెప్పగా విన్న అది నిజమే నేమో బహుశ.

అవును నిజంగా నిజమే అని నిన్ను కలిశాక అనిపిస్తుంది. అదేమిటి కలిశాక ?మనం ఎప్పుడూ కలవలేదు గా అంటావ.
ఎవరైనా బాధగా వున్నప్పుడు సంతోషంగా ఉన్న క్షణాలు తలుచుకొంటారు, నేను ఏమిటో సంతోషం కావాలి అనిపించినప్పుడు నా దగ్గర మిగిలిన చేదు చేదు జ్ఞాపకాల దొంతరాలకు తాళం తీసి ఆ సంతోశాలను కూడా వాటికి తోడు గా పంపిస్తా.
ఎందుకంటే నాకు మిగిలినవి ఆ జ్ఞాపకాలు,ఆ కన్నీళ్లు కదా అని అనుకునే దాన్ని. సర్ది చెప్పేసుకునేదాన్ని ఎప్పటికప్పుడు నా మనస్సుకు, వాటితోనే జోల పాడి నిద్రపుచ్చేదాన్ని. నీ పరిచయం తో నా ఊహలకు కొత్తగా రెక్కలొచ్చి స్వేచ్ఛగా ఎగురుతున్నాయి తప్పో ఒప్పో తెలియదు కాని నా ఆశలకి కలలు కనే అనుమతిని ఇచ్చా. ప్రతి ప్రేమలో ప్రేమ తో పాటు ఏదో కోరిక,వ్యామోహం,పిచ్చి ఉంటుంది అంటారు. అది అంతా నాకు తెలియదు.
ఎప్పుడు ప్రేమ నే కోరుకునే నా మనస్సుకు నీ ప్రేమ ఓ స్నేహమై నాకు ధైర్యాన్ని ఇచ్చింది.నువ్వు ఉన్నావ్ అనే భరోసా ఇచ్చింది. చిరునవ్వును పరిచయం చేసింది. ఆ స్వచ్ఛమైన స్నేహం తోడు ఉంటే ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని ఇచ్చింది.
నా కన్నీటి చెమ్మ నీకు తెలుస్తుంది.
నా హృదయంలో బాధ తెలుస్తుంది.
నా ఎద సవ్వడి తెలుస్తుంది.
నా మాటలు ,నా ప్రతి ఆలోచన నేను చెప్పకుండానే తెలుస్తుంది.
ఇవ్వన్నీ ఎలా రా !మనస్సుని ఇంత బా అర్ధం చేసుకునే విద్య ఏ పాఠశాల లో నేర్చుకున్నావ్ కన్నా!

అమ్మా తల్లి ఆపు నీ భజన కార్యక్రమం ఆపు మనం ఎదురుపడము అని నువ్వు ఎలా నుకుంటున్నావ్. నేను ఎక్కడ ఉన్నా నా ఎదురుగా నా మనస్సులో ఉన్న నువ్వు ఉంటావు.
నీ నీడ గా నేను ఉంటా.మరి ఇంకేంటి.

నీకో ఇంకో విషయం చెప్పనా నిన్ను కలవడానికి త్వరలోనే ఇండియా వస్తున్నా.
హే అవునా నిజమా!
హా అవును.
కన్నా ఎంత మంచి విషయం చెప్పావ్ థాంక్యూ సో మచ్ కన్నా.!
నీకు తెలుసా నువ్వు ఎదురుగా ఉండి ఉంటే గట్టిగా హత్తుకొని ఒక ముద్దు ఇచ్చేదాన్ని.
ఆహా.! అవునా హా..హ..
చూద్దాం కదా !వచ్చినప్పుడు ఏమి చేస్తావో.
ఓయ్ ఏం చూస్తావ్.
ఆహా.! చెప్పేస్తారు మరి అన్ని. చూద్దువు నేను ఏమి చేస్తానో, నువ్వు ఏమి చేస్తావో నేను చూస్తా. సరే ఇక ఉంటా వర్క్ ఉంది. నువ్వు ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా బొజ్జో.
హ్మ్మ్ సరే.
నీ రాక కోసం ఎదురు చూస్తు ఉంటా కన్నా.
మా బంధానికి ఎవరు ఏ పేరు పెట్టినా మా బంధం మా అనుబంధం నా జీవితానికి కొత్త అర్ధం ఏమిటో తెలియదు .ఇది ఏ జన్మలో బంధమో.లేకపోతే ఎక్కడ తను-ఎక్కడ నేను ఒక అక్షరం మా బంధానికి పునాది వేసింది.. ఏ జన్మ బంధమో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!