మనవళ్ళ ప్రేమ

అంశం: సస్పెన్స్

మనవళ్ళ ప్రేమ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

అండరిలాగానే నేను పెరిగి ఉండవచ్చు. అందరి లాగానే నాకూ అన్నీ జరిగి ఉండవచ్చు. కానీ మనసులోని ఆలోచనలు తెలిపే ధైర్యం అందరికీ ఉండదు. మనసులోని భావాన్ని కూడా అందరితో పంచుకోలేము. మనసున అలజడి వర్ణింపనలవి కాని సుడి ఏదో సాధించాలన్న తపనతో, ఎవరినీ పట్టించు కోకుండా చదువుకునే నాకు, ప్రణవ్, ప్రజ్వల పుట్టుకతో భంధుత్వాలు, స్నేహ బంధాలు, మంచి చెడులు, తప్పొప్పులు అన్నీ తెలిసి వచ్చాయి. అసలు కంటే వడ్డీ ముద్దు అంటే అదే నిశ్చయానికి రాసాగాను చాలా త్వరగా నన్నే ఎంతో గారంగా, మురిపంగా, అపురూపంగా చూసుకునే మా కుటుంబ సభ్యులు (మాది ఉమ్మడి కుటుంబం ) నా తొలి సంతానాన్ని అంతే కాదు కాదు!!!! అంత కన్నా ఎక్కువ  అపురూపంగా చూస్తుండేవారు.
చిన్న పిల్ల అందునా ఆడపిల్ల అవటంతో దానిని ఇంకా అపురూపంగా చూసుకున్నారు. వారి ముద్దు ముద్దు మాటలతో, అందరి హృదయాలు ఆనంద భరితం కాసాగాయి. వారిలో నా చిన్న తనాన్ని చూసుకునే వారు మా అమ్మానాన్నలు. వారి ఆశయాల సాధనలో వారి నియమ నిబంధనలలో
వారి ఆత్మీయతా, అనురాగాలతో వారి జీవితం ఆనందమయం కాసాగింది. కిందటి సంవత్సరం కూడా వేసవి సెలవలకు ఎంతో ఇష్టంగా అమ్మమ్మా, తాతయ్య దగ్గరకు అంటూ పరుగు పెట్టిన ఆ పిల్లలకు, ఈ సారి తాతయ్య లేరు, నేను అక్కడకు రాలేను అని చెప్పలేని పరిస్థితి. చిన్నిహృదయాలకు
కదలికలు ఎక్కువ, చిన్ని మనసులకు, ఆలోచనలు ఎక్కువ ఆ పసికందులకు ప్రేమాప్యాయతలు ఎక్కువ, నాకు ఎదురు చెప్పలేని ఆ పసివాళ్లు, అమ్మమ్మ ఇంటిని మరువలేని ఆ చిన్నారులు, మామయ్య పిల్లలతో చిలిపి అల్లర్లు ఊహించుకునే బుజ్జాయిలు సెలవులకు వెళ్లే ఆలోచనలతో మెండుగా నిండి ఉన్నారు. సమయం సాగుతుంది
మది కలవర పడుతోంది. నన్ను నేను సంధింపలేనంది. నన్ను జీవితాన్ని గడపమంది
ఆ రోజు ఉదయం ప్రజ్వల స్కూల్ కి వెళ్లాను. ( క్లాస్ కి వెళ్లాను అనాలి. ఎందుకంటే, నేను అదే స్చూల్ లో టీచర్ని) అదే సమయానికి ప్రజ్వల బెంచీ మీద పడుకుని ఏడవటం చూశాను. ఏమైంది అని అడుగగా, నాకు తాతయ్య గుర్తుకు వస్తున్నారు అని స్నేహితులతో చెప్పిందిట. ఎవరన్నారు??? పిల్లలకు ఏమి తెలియదు అని! ఎవరన్నారు? పిల్లలకు అర్దం కాదు అని! వాళ్ళకూ అన్నీ తెలుసు. కానీ, చెప్పలేరు మనతో అని నాకు అప్పుడే అర్దం అయ్యింది. ఇంకో విషయం, మా బాబును మా నాన్న ఎప్పుడూ, నువ్వు నాలాగే ఉంటావు. నీ బుద్దులు నువ్వు చేసే పనులు అన్నీ నేను చేసినట్టు ఉంటాయి అంటూ, ‘యు ఆర్ అ పర్ఫెక్ట్ బాయ్ రా, నువ్వు నేనే’ అనేవాళ్ళు. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ఆ రోజు రాత్రి, మా ప్రణవ్ కి ఆలాపన. నేనే, నువ్వు నేనే అంటూ చేతులు చాపి చూపించటం వాడు కళ్లారా చూశాడు. ఎవరినీ అడుగ లేము, ఎవరికీ చెప్పలేదు. ఓ తాతయ్య ప్రేమ మనువడి పై ఎప్పుడైనా ఉండవచ్చు. ఎలాగైనా ప్రకటించ వచ్చు.
అదే మూగప్రేమ అదే జన్మ జన్మల ప్రేమ, అదే వారి అనుబంధం అదే వారి ఋణానుబంధం, ఆ ఋణం తీరిపోయిందేమో, మరెప్పుడూ కలలోకి కూడా రాలేదు మాకెప్పుడూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!