అభయ హస్తం

(అంశం : నా అల్లరి నేస్తం) 

అభయ హస్తం

రచన ::సావిత్రి కోవూరు

ఎన్నో జన్మల బంధంగా వచ్చావు నాకుఆలంబనగా నిలిచాయి
నేనే నీవని పెంచావు, నీవే నేననిపించావు
ఆనందాల ఓలల్లాడించావు, అందలమే ఎక్కించావు,
మౌనంగా ఉండే నాకు, మధురభాషణలే నేర్పావు.

కలత చెందిన నా మదికి శీతల పవనమందించావు, ఒంటరినైన నా జీవితానికి కలకాలం తోడుగా నిలిచావు.
దిక్కు తోచని నా బ్రతుకుకు అభయ హస్తం అందించావు,బ్రతుకే పూలవనం చేశావు
కలల్లోకి వచ్చి కమ్మని నిద్రే కరువు చేశావు
కళ్ళతోనే ఊసులెన్నో చెప్పావు ,నా జీవిత నావకు చుక్కానివయ్యావు.

నీ హృదయరాణిని చేసి, రాజసాన్ని కలిగించావు
నీ ఊపిరి సవ్వడులు నా గుండెల సరిగమలు
నీ అడుగు జాడలు నాకు కాంతినిచ్చే దివిటీలు
నీ పదముల బాటలలో నా పయనం సాగింది
ఓ అల్లరి నేస్తమా నీ అల్లరితో నామదిలోనే మురిసాను
ఇంత చేసిన నీకు బదులుగా ఏమివ్వగలను
నన్ను నేను తప్ప.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!