అందమైన ప్రేమ

(అంశం:: “అర్థం అపార్థం”)

అందమైన ప్రేమ

రచన:: బండారు పుష్పలత

రాజు కు ఇరవై ఐదేళ్లు నిండాయి ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వెర్ గా ఉద్యోగ హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఒక ఫ్లాట్ కొనుక్కొని ఉంటున్నాడు. వాళ్ళ అమ్మా అన్నయ్యలు అందరు సిద్ధి పేట ఊర్లో వుంటారు. ఉగాది పండక్కి ఊరికి చేరు కోవడానికి సాయింత్రమైంది వెళ్ళగానే అందరు ఇంట్లోకి ఆనందంగా ఆహ్వానించారు. అందరి యోగక్షేమాలు ఆడిగేంతలో అమ్మ కాఫీ తెచ్చింది. అమ్మ చేసిన మంచి కాఫీ తాగి స్నామము చేసి బట్టలు మార్చుకొని ఆలా పెరట్లో చల్ల గాలికి మంచం వేసుకొని కూర్చున్నాడు రాజు. అప్పుడే అమ్మ వచ్చి ఏ రాజు నీకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాము అంది అమ్మ. రాజు మనసులో ఇన్నో ఊహలు ఎగిసి పడ్డాయి. తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పాలని అమ్మా ఆది… అని మాటలు రాక ఆగిపోయాడు అంతలో పెద్దన్న వచ్చి ఏంటి అమ్మా కొడుకులు ఏవో రగస్య మంతనాలు జరుపుతున్నారు మాకుచెప్పొచ్చు అన్నాడు సరదాగానవ్వుతు.. అప్పుడు అమ్మా ఎరా తమ్ముడికి మొన్న ఒక సంబంధం వచ్చింది కదా అదేంటో వివరాలు తమ్ముడికి చెప్పు అంటూ లేచి ఇంట్లో కి వెళ్లి వంటపనుల్లో మునిగింది వాళ్ళమ్మ. అన్న రాజుతో ఎరా పెళ్లి అంటే వెలిగి పోవాలి గాని ఆలా మొకం ముడుచుకున్నావు ఎందుకు అన్నాడు అన్నయ్య ఆది అని మొదలు పెట్టగానే తమ్ముణ్ణి మాట్లాడనివ్వకుండా తానే మాట్లాడుతూ.. పక్కవూరిలో రామయ్య వాళ్ళ కూతురు
పీజీ చదివిందంటా ఎదో వుద్యోగం కూడా చేస్తుంది అంటూ మొదలెట్టి కట్నం ముప్పై లక్షల వరకు ఇస్తారట అమ్మాయి బాగుంది నువ్వు ఓకే అంటే ఎల్లుండి పండగతరువాత వెళ్లి చూద్దాం అన్నాడు. అన్న మాట్లాడు తున్నాడు కాని రాజు అవేవి వినకుండా తనకు హైదరాబాదులో జరిగిందంతాకళ్ళ ముందు మెదులుతుంది..

###

రాజు యమ్ టేక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో వున్నాడు. అంత వరకు కాంపస్ హాస్టల్ లో వున్న రాజు ఒక రూమ్ వెతుకుంటూ అన్ని ఏరియాలు తిరుగు తున్నాడు. తామంతాపూర్ ఒక టూలేట్ బోర్డుచేసి బండి ఆపి వెళ్లి తలుపు కొట్టి నిలుచున్నాడు. అప్పుడు ఒక అందమైన అమ్మాయి ఆకుపచ్చని పరికినిలో వుండి ఎవరండీ అంటూ కోకిల కంఠంతో అడుగుతూ తలుపుతీసింది. ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు రాజు ఆ అందాన్ని చూసి తన్మయత్వం పొందిన రాజు అలానే టూలేట్ అండి అన్నాడు. అతను తేరుకునే లోపలే ఆ కోకిల నాన్న ఎవరో అద్దెకోసం వచ్చారు అంటూ లోపలి వెళ్ళింది. తన కళల దేవత ఆలా కనబడకుండా లోపలి వెళ్లడం చూసి గుండె పిండినట్టయింది. ఎవరు బాబు ఏంచేస్తావు అంటూ వాళ్ళ నాన్న వచ్చి అడిగాడు. రాజు తేరుకొని అంకుల్ నేను ఎంటెక్ చేశాను వుద్యోగం వెతుకుంటున్నాను. నాకు రూమ్ కావాలి రెంటుకు అన్నాడు. సరే రా బాబు రూమ్ చూద్దువు అని చూపించాడు. రాజురూమ్ c చూస్తూ వున్నా మనసంతా ఆ అమ్మయి పైనే వుంది. రెంట్ ఎంత అని అడిగాడు రాజు. ఐదువేల అన్నాడు. ఒకే అన్నాడు అడ్వాన్స్ బాబు అనగానే పైసలు చేతులో పెట్టిరేపు ఇక్కడి వెచ్చేస్తాను అని హాస్టల్ కి వచ్చాడు. స్నానం చేసితినీ పడుకున్నాడు అమ్మాయి ఊహల్లో తేలి నిద్దుర పట్టక తన జ్ఞాపకాల్లో తేలి ఆడుతూ కలత నిదుర పోయాడు రాజు. పొద్దున్నే లేచి అన్ని సర్దుకొని రూంకి వెళ్లి పోయి పాలు పొంగించాడు. ఇక తనకి ఒక ఐ. బి. ఎం కంపెనీ కి వెళ్లాడని బయలు దేరాడు. అంతలో ఆ సునీత ఎదురుగా వస్తుంది.
అది శుభశకునంగా భావించి వెళ్లి వుద్యోగం లో సెలక్ట్ అయ్యాడు. స్వీట్ డబ్బాతో ఇంటికి వచ్చి ఇంటి ఓనర్ వాళ్ళకి విషయం చెప్పి స్వీట్ ఇచ్చాడు. సునీతతో మీరు ఎదురు వచ్చినందుకు నాకు వుద్యోగం వచ్చింది అని చెప్పాడు. అప్పుడు రాజును చూసింది సునీత అప్పుడు రాజు చాల సంతోషించాడు ఆలా వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వాళ్ళు సినిమాలు పార్కులు తిరిగి జీవితాన్ని ప్రేమని ఆస్వాదిస్తున్నారు. అంతలో ఒకరోజు రాము అనే ఇంటర్ స్నేహితుడుసునీతకు కలుస్తాడు.అప్పటి నుండి అతనితో స్నేహంగా ఉంటుంది. అదిరాజుకు నచ్చక రాజు అపార్థం చేసుకొని సునీత తో గొడవ పెట్టుకొని దూరమవుతాడు.
కాని తనని మరిచి పోలేదు. ఎన్నో సార్లు సునీత రాజుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కాని రాజు వినిపించుకోకుండా ఇల్లు కాళీ చేసి వెళ్లి కొన్ని రోజులకు మంచి అపార్టుమెంటు తీసుకోని అందులో ఉంటాడు. కాని తన తలుపులన్నీ సునీత తోనే నిండి ఉంటుంది. ఈదేవిషయం వాళ్ళ అమ్మతో చెప్పి బాధపడుతాడు రాజు.

###

రాత్రి అమ్మతో చెప్పి హాయిగా పడుకున్నరాజు పొద్దున్న లేటుగా లేచాడు. అమ్మా కాఫీ అని లేచి కూర్చుని అరవగానే
అందమైన చేతులు కాఫీ అందించయి. ఎవరా అని చూడగానే, సునీత కళ్ళ ముందు ఉంటుంది. ఆశ్చర్య పోయిన రాజు నువ్వూ ఇక్కడ ఇది కళా నిజమా అని తనను తాను గిల్లుకొని చూస్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి పొలానికి వెళ్లి విషయాలు మాట్లాడుకొని అపర్దాలు తొలగించుకొంటారు. సునీత చెపుతుంది నాప్రాణము నువ్వూ అంటూ తన వొళ్ళో వాలింది. అప్పుడు రాజు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇద్దరు ఆనందంగా ఇంటికి వచ్చారు.

&&&

వాళ్ళ అమ్మా సునీత వాళ్ళ ఇంటికి వెళ్లి అన్ని మాట్లాడి సునీతను ఇంటికితీసుకొచ్చింది అని సునీత రాజు తో చెపుతుంది రాజు అమ్మకి సంతోషంగా కృతజ్ఞతలు చెపుతాడు అమ్మా సంతోషించి ఆతర్వాత అన్ని మాట్లాడి వివాహం జరిపిస్తారు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!