మా అమ్మ సత్యవతి

మా అమ్మ సత్యవతి

రచయిత:: బొడ్డు హారిక(కోమలి)

పునర్జన్మ పొందే
పుడమిపై పరమాత్మవు నీవు
రుదిరాన్ని పాలగా మార్చి
మాకందించిన అన్నపూర్ణవు నీవు
మా పొట్ట నింపుటకై
నీ చరములనే చక్రాలుగా చెసినదానివి నీవు
రేయింబవళ్ళు మాకై
రక్తాన్నే స్వేదంగా మలుచుకున్న దానివి నీవు
పతిలేకపోయిన పుట్టిన వారే ప్రాణంగా
జీవించే దానివి‌ నీవు
ప్రతిక్షణం మా ప్రతిభకై పొరాడెదవు నీవు
నీ ప్రేమను వర్ణించుటలో అక్షరాలు సైతం
ఓటమి పాలయ్యేను కదా
భగవంతుడు సైతం నీ ప్రేమకు
దాసోహమాయేను కదా
స :-సతివై
         త్య:-త్యాగమూర్తివై
            వ:- వ్యవస్థ ను సైతం
             తి :- తీర్చిదిద్దుదానివి
నీవే కదా అమ్మా…..!

You May Also Like

6 thoughts on “మా అమ్మ సత్యవతి

Leave a Reply to BODDU HARIKA Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!