నీ రాకకై

నీ రాకకై...

రచయిత :: తేలుకుంట్ల సునీత

జతగా కలిసి నడిసిన నా అడుగులు
తడపడుతున్నాయి …
నీ ఎడపాటు తెలిసి

గాలిలో నీ ఊసుల పరిమళాలు కరువై
మూసుకుపోతున్నాయి…
నా నాసికా రంధ్రాలు

నీ నయనాలతో కాంచిన సొగసైన దృశ్య మాలికలు
కనుమరుగవుతున్నాయి….
జలమయమైన నా కనులకు

వీనుల విందైన నీ మధుర స్వరం వినాలని
ఆరాటపడుతున్నాయి…
నా కర్ణ కుటీరములు

నీ పేరే జపమై పలికిన పలుకులు
మూగపోతున్నాయి….
మాటలే మరచిన నా అధరములు…

మూడు ముళ్ళతో నీ ముని వేళ్ళ
స్పర్శకై పులకరించి
పునీతం కావాలని
వెంపర్లాడిన నా మేను
నీ రాకకై నిరీక్షించి
నిర్జీవంగా మారి
అడవిగాచిన వెన్నెలయింది
నా జీవన తరంగం..

You May Also Like

5 thoughts on “నీ రాకకై

Leave a Reply to GADILA ANIL KUMAR Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!