రామాయణం నేర్పే జీవితపాఠాలు

రామాయణం నేర్పే జీవితపాఠాలు

అన్నదమ్ముల మధ్య అనుబంధమైన

భార్య భర్తల బంధమైన

పితృవాక్యపరిపాలనైన 

స్నేహితుల మధ్య వారధి కైనా

మంచికైనా…చెడుకైనా 

ఒకే ఒక కథ 

అదే రామాయణ కథ. 

అన్న రక్షణకై…అతనిని అనుసరిస్తూ తన సుఖం మరిచిన తమ్ముడు

భార్య కోరికను తీర్చుటకై ఉచితానుచితాలు మరచిన పతిదేవుడు 

తండ్రి మాటకై అంది వచ్చిన ఆవకాశాన్ని వదులుకున్న తనయుడు 

స్నేహం కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భక్తుడు

తన తప్పులేదని తెలిసి

పతి ఆనతి పై అగ్ని ప్రవేశం చేసిన సతి

ప్రతి సంఘటన ఒక జీవిత పాఠం 

ఏది మంచి… ఏది చెడు తెలుసుకోవడమే మన విజ్ఞత…!

రచన:: సావిత్రి తోట “జాహ్నవి”

You May Also Like

2 thoughts on “రామాయణం నేర్పే జీవితపాఠాలు

Leave a Reply to Savitri K Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!