సంధ్య I.P.S.

సంధ్య I.P.S.

రచన: జయ

చూడు  బావ ఇది నా క్యాప్ ఇవ్వడం లేదు.
ఆగు తల్లి డ్యూటీ కి టైం అయ్యిపోతుంది.ఈ రోజు మీటింగ్ కూడా వుంది.నాకు లేట్ అవుతుంది రా.
బావ నువ్వు కూడా నవ్వుతావు ఏంటి  తీసుకొని ఇవ్వు.
ఇది ఇంకా బాగుంది. నువ్వు ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ వి.పిల్ల దగ్గర క్యాప్ తీసుకోలేకపోతున్నావ్.
హడల్, నువ్వు పిల్లకి బయపడుతున్నావ్.
సరి సరే లే ఇస్తున్నా.
క్యాప్ పెట్టుకొని ,వెళుతున్న బావ.
ఎన్ని సార్లు చెప్పా సంధ్య వెళ్తా అనొద్దు అని.
సరే బావ ఇక అనను.
గుడ్ జాగ్రత్తగా వెళ్లి రా.
అమ్మ తొందరగా వచ్చేయి సాయంత్రం.
ఓకె తల్లి బై.
సంధ్య కార్ స్టేషన్ దగ్గర ఆగగానే ఏవరో సంధ్య కాళ్ళ మీదా పడి ,
మీరే న్యాయం చెయ్యేలి అమ్మ.
ముందు మీరు లేవండి,
కానిస్టేబుల్ వీళ్ళని లోపలకి తీసుకు రా.!.
సంధ్య వెళ్లి సీట్ లో కూర్చుని. వాళ్ళని లోనికి పంపు అని కానిస్టేబుల్ కి చెప్పింది.
వాళ్ళు లోనికి రాగానే.
నమస్కారం అమ్మ,మాకు మీరే న్యాయం చెయ్యాలి .
సరే అండి చేస్తా.
ముందు మీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పండి.
అది అమ్మ,మా కొడుకు, ధోరగారి అమ్మాయి, ప్రేమించుకున్నారు అమ్మా,
వాళ్ళు నా కొడుకు ని బెదిరించారు మా అమ్మాయి జోలికి వస్తే ఊరుకొము అని,మేము కూడా చెప్పి చూసాము కానీ వాడు వినలేదు.
ఇప్పుడు ఏమో వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. తెలిసిన వాళ్ళని కూడా అడిగాము.
కానీ అందరూ మాకు తెలియదు అనే అంటున్నారు. భయం గా ఉంది తల్లి ,నా కొడుకుని ధోరగారు ఏమైనా చేసారేమో అని.

మీరు బయపడకండి అమ్మ మీ అబ్బాయి కి ఏమి కాదు, మీ అబ్బాయి ని క్షేమంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది .
మీరు ప్రశాంతంగా ఉండండి.
అని వాళ్ళని పంపించింది కానీ సంధ్య కి  వాళ్ళు మాట్లాడుతుంటే రవి నే గుర్తుకు వచ్చాడు.

కళ్ళు మూసుకొని తన కుర్చీలో అలా ఉండిపోయింది.
*  ** *
సంధ్య కి 4 ఏళ్ల అప్పుడు వాళ్ళ అమ్మ,నాన్న ప్రమాదం లో చనిపోతారు.
అప్పటి నుంచి తను మేనమామ దగ్గరే పెరుగుతుంది.
తన మేనమామ రెడ్డి కొడుకు సూర్య, సంధ్య చిన్నప్పటి నుంచి కలిసిపెరగడం వాళ్ళ వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు గా ఉండేవారు.
సంధ్య అంటే సూర్య కి పంచప్రాణాలు.
రెడ్డి కూడా వారికి పెళ్ళి వయస్సు వచ్చింది అని
సూర్య కి ,సంధ్య కి పెళ్ళి చేద్దాం అని నిర్ణయించుకొని. పంతులు ని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాడు. రెడ్డి సూర్య ని పిలిచి పెళ్లి విషయం చెప్పగానే చాలా సంతోషంగా తన తండ్రిని గట్టిగా కౌగిలించుకొని థాంక్యూ డాడీ ,థాంక్యూ సో మచ్.
సూర్య మనస్సు గాలిలో తెలినట్టు,తన నూరేళ్ళ జీవితాన్ని సంధ్య తో ఊహించుకుంటే.
తన మనస్సు,తనని వదిలి
హంసలు రెక్కలు తొడిగి గగన విహారం చేసినట్టు ఉంది.
డాడీ ఒక సారి సంధ్య అభిప్రాయం కూడా అడగండి.
ఏంటి రా తనని అడిగేది.
ఆడ పిల్ల తను,చిన్నప్పటి నుంచి మన చేతుల్లో పెరిగిన పిల్ల.మనం ఏమి చెబితే అదే ఉంటుంది.
అయినా మన వంశం లోనే లేదు. ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వడం.
అది కాదు డాడీ,ఇక ఆపు నువ్వు మాట్లాడకు.
నేను మాట్లాడతా సంధ్య తో వచ్చే శుక్రవారం మీ ఇద్దరికి పెళ్ళి జరగడం కాయం.

పెళ్ళి ముందురోజు సంధ్య హాస్టల్ నుంచి రాగానే ఇల్లు అంతా సందడిగా ఉండటం చూసి.
ఏమిటి ఇల్లు ఇంత హడావిడిగా ఉంది అని తనకి దిష్టి తీసే పనిఅమ్మాయి ని అడుగుతుంది.
మీకు తెలియదా అమ్మ రేపు మీకు సూర్య బాబు కి పెళ్లి కదా మీకు తెలియదా అనగానే సంధ్యకి ఏమి మాట్లాడాలో తెలియలేదు.
వెంటనే సూర్య దగ్గరకు వెళ్ళి ఏంటి బావ ఏదో అంటున్నారు.
అది నిజం కాదు అని చెప్పు.
అది నిజమే సంధ్య రేపు మన ఇద్దరి పెళ్లి కి ముహూర్తం పెట్టించారు డాడీ.
అవునా. అది ఎలా బావ
నాకు ఒక మాట కూడా చెప్పలేదు,నాకు ఇష్టమో కాదో తెలుసుకోరా,అయినా నీతో నా పెళ్ళి ఏంటి,నిన్ను ఇప్పటివరకు మంచి స్నేహితుడుల చూసా కానీ,నాకు నీ మీదా అటువంటి ఉద్దేశ్యం లేదు.
మావయ్య కు నువ్వు చెబుతావా,నన్ను చెప్పమంటవా ఈ పెళ్ళి జరగదు అని.
ఎందుకు సంధ్య నువ్వు అంటే నాకు ప్రాణమే.
నువ్వు లేకపోతే నేను ఉండలేను.
నన్ను క్షమించు బావ,నిన్ను ఎప్పుడు ఆ ఉద్దేశ్యం చూడలేదు.
అయినా బావ నేను I.P.S ట్రెయినింగ్ లో రవి అనే అతన్ని నేను ప్రేమించాను.తననే పెళ్ళి చేసుకుంటా .
సరే సంధ్య నేను డాడీ తో మాట్లాడతా.అప్పటి వరకు నువ్వు కంగారు పడకు.
సరే బావ.
సంధ్య ఈ విషయం రవి కి ఫోన్ చేసి చెపుతుంది.
సూర్య రెడ్డి తో ఈ విషయం చెప్పగానే.రెడ్డి కోపంతో రగిలిపోతాడు.
సూర్య నెమ్మదిగా మాట్లాడి ఒప్పిస్తాడు.
సూర్య సంధ్య దగ్గరకు వచ్చి డాడీ మీ పెళ్లి కి ఒప్పికున్నారు.
తన అడ్రెస్,ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్లతో మాట్లాడి ,ముహూర్తం పెట్టిస్తాను అన్నారు అనగానే, సంధ్య థాంక్యూ బావ.
అని రవి నెంబర్ ఇస్తుంది.
రెడ్డి వాళ్ళ తో మాట్లాడి.
శనివారం మంచి ముహూర్తం ఉంది.
మీరు పెళ్లి టైం కి కళ్ళ వచ్చేయండి అని చెప్పాను సంధ్య ఇప్పుడు నీకు సంతోషమేనా.!
చాలా సంతోషంగా ఉంది మావయ్య.
థాంక్యూ అని కౌగిలించుకొని ఏడుస్తుంది.
రెడ్డి ఎందుకు తల్లి ఏడుస్తున్నావ్,నీ సంతోషమే, మా సంతోషం తల్లి.మీ అమ్మ,నాన్న నిన్ను చిన్నవయస్సులో నే మా చేతుల్లో పెట్టి వాళ్లు చనిపోయారు.
అప్పటి నుంచి మా కంటికి రెప్పలా నిన్ను చూసుకున్న.
ఇప్పుడు మటికి నీ ఇష్టాన్ని ఎందుకు కాదు అంటాము తల్లి, నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం.
అని చెప్పి వెళ్లిపోతాడు.
సంధ్య సంతోషా నికి అవధులు లేవు,రవి తో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకుంది.
ఏంటి మేడమ్ ఇప్పుడే అంత సంతోషం, అంత సిగ్గు పడితే రేపు పెళ్లి అయినతర్వాత మన శోభనం గదిలో ఏమి చేస్తావ్.
పో..రవి
అయినా చాలా ఉందే సర్ కి ఆశ.
అయినా పెళ్ళి జరుగుతుంది కాని, జాబ్ లో జాయిన్ అయ్యేవరకు అటువంటి వేషాలు ఏమి కుదరవు గుర్తుపెట్టుకో.
అబ్బా ఎంటే ఇది చాలా అన్యాయం తెలుసా.
హా. హా.. తెలుసులే కానీ.
ఇప్పుడు ప్రశాంతంగా బజ్జో కన్నా.
ఉంటాను బై.
రాక్షసి నీకు జాలి, దయ లేవే అని సరే నే ఉంటాను. అని సంధ్య అని పిలుస్తాడు,
ఏంటి రవి.
ఐ లవ్ యు సంధ్య.
ఐ లవ్ యు టూ రవి.
సరే గుడ్ నైట్ రవి.
పెళ్ళి రోజు రానే వచ్చింది అంతా సందడిగా ఉన్నారు.
సూర్య మటికి లోపల ప్రాణం పోయే బాధ ఉన్న పైకి నవ్వుతూ పెళ్లి పనులు చేస్తున్నాడు.
అది గమనించిన రెడ్డి కూడా బాధ పడతాడు.
సంధ్య ని పెళ్ళికూతురు గా చూసి రెడ్డి సంధ్య ను దగ్గరకు తీసుకొని సంతోషంగా ఉండు అని దీవించి
అమ్మా సంధ్య ముహూర్తం టైం అవుతుంది.రవి వాళ్ళు ఇంకా రాలేదు. ఫోన్ చెయ్యి ఎక్కడ ఉన్నారో అని అంటాడు. సరే మావయ్య అని ఫోన్ చేస్తే ఫోన్ కలవదు.
స్విచ్చాఫ్ వస్తుంది అని చెబుతుంది.అవునా ఇప్పుడు ఎలా ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసు కునేది.
టైం దగ్గరికి వచ్చేసింది. అని కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతాడు, అందరూ వచ్చేసారు పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిపించాడు.
సంధ్యని పీటలమీద కూర్చోపెట్టి గౌరీ పూజ జరిపించడం అయ్యింది కానీ రవి వాళ్లు రాలేదు అని కంగారు గానే ఉంది సంధ్య కి.
పంతులు గారు పెళ్ళి కుమారుడిని తీసుకురావాలి అని పిలువగానే ఒక అంబులెన్స్ వచ్చి ఆగుతుంది.
అందులోనుంచి రవి శవాన్ని, మిగతావాళ్ళవి దించుతారు.
రవి ని అలా చూడగానే సంధ్య కళ్ళు తిరిగిపడిపోతుంది.
సంధ్య ని హాస్పటల్ లో జాయిన్ చేస్తారు.
డాక్టర్ వచ్చి చెక్ చేసి సంధ్య తల్లి కాబోతుంది అని చెబుతాడు. అందరికి ఏమి మాట్లాడాలో తెలియలేదు.
సంధ్య స్పృహ లోకి వచ్చి రవి కోసం ఏడుస్తుంటే. సంధ్య తల్లి కాబోతున్న విషయం చెబుతారు.ఆ మాట వినగానే ఆ రోజు ట్రెయినింగ్ లో అనుకోని పరిస్థితుల్లో సంధ్య,రవి
ఒకటి అవ్వడం గుర్తుకు వచ్చి ఏడుస్తుంది.
ఇప్పుడు ఏమి చెయ్యేమంటవ్ చెప్పు తల్లి. పెళ్లి కాకుండా తల్లివి అయ్యావు అంటే పరువు ఉంటుందా,ఇప్పుడు ఎలా.
దీనికి ఒకటే మార్గం నువ్వు మీ బావ తో తాళి కట్టించుకోవడం.
వద్దు అని ఏడుస్తుంది. సరే రేపు నీ బిడ్డకు ఒక తండ్రి కావాలి. పెళ్లి కాకుండా బిడ్డకు తల్లి అయ్యావు,ఆ బిడ్డకు తండ్రి ని అయినా ఇవ్వు.
ఈ పెళ్లి తప్ప వేరే మార్గం లేదు

తప్పని సరి పరిస్థితి లో సూర్య,సంధ్య పెళ్లి జరుగుతుంది.
కానీ ఇద్దరు ఒకటి అవ్వరు.
ఒక రోజు అనుకోకుండా సంధ్య డ్యూటీ పని మీదా రవి వాళ్ళ ఊరు వెళుతుంది.
అక్కడ సంధ్య కి రవి వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తాడు.
రవి ది ప్రమాదం కాదు,మీ మావయ్య నే రవి ని చంపేశాడు.రవి నే కాదు, మీ అమ్మ,నాన్న ని కూడా నీ ఆస్థి కోసం చంపేశాడు.
దీనికి సంబంధించిన సాక్ష్యం అంతా ఇందిలో ఉంది అని ఒక కవర్ ఇస్తాడు.అది చూసి సంధ్యకు మతిపోతుంది.
కాసేపు ఆగి అన్ని ఆలోచిస్తే నిజమే అని తెలుస్తుంది.
రెడ్డి ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తుంది.
సూర్య,సంధ్య ఇద్దరు ఆస్తి ని అంతా అనాధాశ రాణలాయనికి రాసి,పాప ను తీసుకొని.
వేరే ఊరు వెళ్ళిపోతారు.
**
వాళ్ళ కేసు వినగానే సంధ్య గతం గుర్తుకు తెచ్చుకొని బాధ పడుతుంది.
వాళ్ళ కేసు తనే స్వయంగా చూసి,కిడ్నాప్ అయిన అబ్బాయ్ ని తీసుకొచ్చి తల్లితండ్రులకు అప్పచెబుతుంది.
సంధ్య ,సూర్య మటికి ఎప్పటికి కలుస్తారో,సంధ్య మనస్సు మారి సూర్య ప్రేమ ని అర్ధం చేసుకోవాలి దేవుడిని కోరుకుంటు సూర్య అలా ఉండిడిపోతాడు.
*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!