మానవ సేవే మాధవ సేవ

మానవ సేవే మాధవ సేవ

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

7గంటలయింది.నాగేశ్వరరావు రావు నిద్ర లేచాడు.కాంప్ వెళ్ళాలి 8గంటలకు ట్రైన్.గాబరా గాబరా గా రెడి అయ్యి స్టేషన్ కు  బయలుదేరాడు. తుఫాన్ కారణం గా continue గా వర్షం పడుతోంది ఏదో ఆటో దొరికింది.స్టేషన్ కి ఎక్కేసాడు.మధ్యలో ట్రాఫిక్. ఆటో ఆగింది.ఇంతలో ఇద్దరు పిల్లలు ఒక ముసలివయసున్నవాడు వర్షం లో ట్రాఫిక్ లో అడుక్కోవడం చూసాడు.అసలే సమతా భావాలు ఆదర్శవాదాలు ఉన్న వ్యక్తి.వెంటనే వాళ్ళను ఆపి డీటెయిల్స్ కనుక్కున్నాడు. ఇద్దరు పిల్లలు అనాధులు తల్లిదండ్రులు ఎవరో తెలీదట.తాత కూడా ఎవరులేని అనాది.
వాళ్లకథ విని వాళ్ళను వృద్ధాశ్రమం లో అనాధ ఆశ్రమంలో జాయిన్ చేస్తానని చెప్పాడు. కానీ ట్రైన్ మిస్ అవుతుందని ఒక ప్రక్క భాద పడుతున్నాడు.అయిన మానవసేవకు మించిన సేవ లేదు కదా అని భావించి next ట్రైన్ కివెల్దామని decide అయ్యాడు.ఆటో వాడికి డబ్బులిచ్చి పంపించేశాడు.వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్లి మంచి టిఫిన్ పెట్టించాడు. పక్కనే ఉన్న ఔట్ బాత్రూం లో స్నానాలు చేయించి శుభ్రం గా తయారు చేయించాడు.
ముగ్గుర్ని తీసుకొని వెళ్ళాడు ముందుగా తాతను వృద్ధాశ్రమం లో జాయిన్ చేసాడు.గార్డియాన్ గా సంతకం చేసాడు.తరువాత ఇద్దరు పిల్లలని అనాధ ఆశ్రమంలో జాయిన్ చేసాడు.గార్డియాన్ గా సంతకం చేసాడు.స్కూల్ అప్లికేషను ఫారం కూడా నింపి వాళ్ళకే జాయిన్ చేయమని గార్డియాన్ గా సంతకం చేసాడు.
ఇవన్నీ అయ్యేసరికి ఆ రోజు సాయంత్రం. అయిపోయింది.తన కాంప్ ని కూడా మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నాడు. ఇంటికి చేసుకొని విశ్రాంతి తీసుకున్నాడు.చేసిన మంచి పనికి సంతృప్తి తో ఊపిరి పీల్చుకున్నాడు ఆనందంగా feel అయ్యాడు. బాగా నిద్ర పట్టింది.
నాగేశ్వరరావు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వృత్తిలో పాఠశాలలో మంచి గుర్తింపు ఉన్నది.ఎంతో మంది పిల్లలకు ఉచిత పుస్తకాలు బట్టలు కావలసినవి ఇచ్చేవాడు.ఊరిలో పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయడం .యువతకు భవిషత్ కు పోటీ పరీక్షలకు కావలసిన సమాచారాన్ని అందించి సలహాలు ఇచ్చి ప్రోత్సహించే వాడు. ఆ ప్రాంతం లో ఎవరికి ఏ ఆపద వచ్చిన ముందుంటాడు.అందరికి తలలో నాలుక లా ఉంటాడు.కరోనా కష్ట కాలం లో కూడా ఎంతో మంది సామాజిక భాధ్యత తో సాయం చేసాడు. ప్రభుత్వం అతని సేవలను గుర్తించి సేవా పధకం కూడా ఇచ్చింది.నిరంతరం సేవామయమైన హృదయం నాగేశ్వరరావు ది.
నాగేశ్వరరావు రాత్రి ఆనందం తో మత్తుగా పడుకొని లేచాడు.టీవీ  on చేసాడు.వార్తలు చూస్తున్నాడు. అందులో నిన్న తాను వెళ్ళవలసిన ట్రైన్ accident అయిందని విని చూసి బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు.
ఒకరికి మనం సాయం చేస్తే తప్పక ఏదో ఓ రూపం లో మనకు మంచి జరుగుతుంది.ఇదే విధిరాత.నాగేశ్వరరావు మానవత్వమే అతనిని కాపాడింది.నిస్వార్ధ సేవా ఊరకే పోదు.మానవ సేవయే మాధవ సేవ.

రచన:పసుమర్తి నాగేశ్వరరావు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!