సాగరసంగమం

సాగరసంగమం (చిత్రసమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: నారుమంచి వాణి ప్రభాకరి

చిత్రం: సాగరసంగమం
దర్శకులు: కళా తపస్వి శ్రీ.కే విశ్వనాథ్ గారు

భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుకుగుణంగా ఈ చిత్రం  ఎన్నో  తరాలు ఆదర్శంగా, ఆదేశం గా ఉన్నత భావలు కలిగిన చిత్రము  అత్యంత ఉన్నత విలువలతో ఈ చిత్రం సకుటుంబంగా చూసి ఆనందించిన చిత్రము సంగీత సాహిత్య దృశ్య కావ్యము, అహర్యము సంగీత ప్రక్రియలు ఎంతో అమోఘము. అటువంటి దృశ్య కావ్యం మళ్లీ రాలేదు అందులో నటులు దర్శకుల మనో భావాలకి తగ్గట్టుగా నటించి అపురూప చిత్రంగా మన ముందుకు వచ్చింది.
ప్రతి అంశము కూడా సంగీతానికి సాహిత్యానికి కూడా కళా పట్టాభిషేకం చేశారు. కమలహాసన్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నటుడు ఆయన సహజంగా నృత్యంలో అపూర్వ ప్రజ్ఞ కలవారు అందుకే నృత్యంలో ఆణిముత్యం లాంటి నటన చేశారు శ్రీమతి శైలజ గారికి సలహాలు సూచనలు ఇవ్వడంలో ఒక పత్రికా విలేఖరుగా నృత్యం స్టేజి పై చూపించిన రీతి అద్భుతము జయప్రద గారు కళా అభిమనిగా ఆమె కమల్ గారికి ఇచ్చిన ప్రోత్సాహాఁ ఆమె జాతీయ నృత్య ఉత్సవం లో పాల్గొనే అవకాశం  కల్గించడం కమల్ గారు తన ఫోటో ఆహ్వాన పత్రికలో చూసి మురిసిన తీరు
అక్కడ ఆయన చూపిన హవా భావాలు ఎంతో బావున్నాయి. అదే విధంగా వేదం అణు వణువున నాదం అనే పాట హంస నందిని రాగంలో చక్కగా
సంగీతం సమ కూర్చి దానికి వారిద్దరూ చేసిన నృత్యం ఎంతో హృద్యంగా ఉన్నది. వివాహాల్లో గతంలో గాత్ర కచ్చేరి నృత్య ప్రదర్శనలు పెట్టేవారు.
అదే విధానంలో మంజు భార్గవి గారు నృత్యము బాల కనక మాయ చెల సృజన పరిపాల అట్టణ రాగ కీర్తన కు తగినట్టు గా నృత్యము జయప్రద గారు ఫోటోలు తియ్యడము కమల్ గారు నృత్య భావాలు కూడా అపురూప చిత్రాల అందాలు అంశాలు కమల్ గారి నుయ్యి గట్టుపై నుంచుని వర్షంలో తకిట తకిట తకదిమి తీ ల్లానా సింధు బై రవి లో పాడుతూ జతులు అంటూ చేసిన నృత్యము కుంకుమ వర్ష దారకు తడవకుండా చెయ్యి అడ్డు పెట్టీ చూపిన హవా భావాలు ఆమెను ఎంతో ఆత్మీయంగా ఎంతో ప్రేమ హృదయంలో దాచిన తీరు దర్శకుల ఆలోచనా ప్రతిభకు తార్కాణం ఎందుకంటే జయ ప్రద గారు మేకప్ లో చక్కని భారతీయ సంప్రదాయ వస్త్రాలు ధరింప చేసి నుదుటిన సూర్య బింబం వంటి బొట్టు పెట్టీ పొడుగు జడ పువ్వులు గాజులు పట్టు చీర రాణి రంగులో కట్టి ఆమె అందం మరింత పెంచారు.
మనిషి వస్త్ర ధారణ లోనే నిజమైన అందము అందుకే స్త్రీలకు కట్టు బొట్టు రీతి తీర్చిదిద్ది నట్లు కళ్ళ కాటుక ఆ నగలు కూడా ఎంతో అందము ఆ పాత్రకు ఆమె జీవించారు. అన్ని పాత్రలు సజీవంగా మలిచిన ఆయన దర్శకత్వం నేటీ కి ఆదేర్శమే !. ఆ సినిమా వచ్చిన కొత్తలో ఆమె వస్త్రాలు అలంకరణ కూడా ఎంతో మంది స్త్రీలు అనుకరించారు కూడా అది ఆ వేష ధారణ గొప్పతనము సముద్ర ఒడ్డున నృత్యాలు చక్కగా ప్రకృతి అందాలను ప్రతి బింబింపా చేశాయి  కెమెరా దర్శకుల నాడిని కళ్ళ ముందు నేటికీ దర్శింప చేస్తున్నారు, ఆ సినిమా యూనిట్ లో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభకు పట్టం కట్టి ప్రజలకు అందించారు, ఉత్తమ సమాజ కళా కారులు నైపుణ్యం చూపించుతూ ఎంతో హృద్యంగా నిర్మించిన శ్రీ ఏడిద నాగే శ్వరా రావు గారు వారి కుమారుడు శ్రీ ఏడిద శ్రీ రామ్ గారు శ్రీ విశ్వనాథ గారు భావితరాల చిత్రాలకు ఒక ఎన్ సైక్లపీడియా లాంటి వారు కథలో  హద్దులు దాటని సున్నిత ప్రేమ కళా నైపుణ్య ము భావి తరాలకు ఒకవిజ్ఞాన జ్ఞాన చిత్ర నిఘంటువు అంటే అతిశయోక్తి కాదేమో మీరు ఆలోచించండి ధన వంతులు కుటుంబంలో పుట్టిన జయప్రద వివాహిత అయిన కమల్ గారి నృత్య కళను ఆమె ఎంతో ఆకర్షించిది. అందుకే ఆమె జాతీయ స్థాయి నృత్య పోటీల్లో అవకాశం ఇప్పించింది. వాళ్ళిద్దరికీ ఉన్నది కళా ప్రేమ ఆమె భర్త ఉన్నతి స్థాయి వ్యక్తి ఆమె కూతురికి ఆమెకున్న కళాభిమానంతోనే నృత్యం నేర్పించి ప్రదర్శన ఇప్పించింది. ఆ ప్రదర్శనకు కమల్ పత్రిక విమర్శకుడిగా రావడం తో మనకు సినిమా కథ మొదలయ్యి ప్రేక్షకులను అలరించినది.
కళా శాస్త్రం కళా శాశ్వతము అని ఈ చిత్రం నిరూపించింది భారతీయ సంస్కృతిలో స్త్రీ కి కుటుంబం తన భర్త బిడ్డ వీరే జీవితము అని కూడా ఈ చిత్రం ద్వారా నిరూపించింది. మానవతా విలువలు కళాభిమానము చూపే తీరు చాలా సున్నితంగా హృదయాన్ని హత్తుకునేలా ఈ చిత్రం లో నటులు అంతా జీవించారు శరత్ బాబు కమల్ మిత్రుడి గా ఎస్పీ. శైలజ గారు తమ ప్రతిభ చూపారు, ముఖ్యంగా సంగీతం అత్యంత అద్భుతము మౌన మేలనోయి మోహన రాగంలో పాట మరపురానిది. ఓం నమశ్శివాయ హిందూ ళ్ల రాగ కీర్తన చాలా అద్భుతంగా ఉన్నది.
ఈ చిత్రంపై నా స్నేహతురాలు పరిశోధన కూడా మద్రాస్ యూనివర్సిటీ నుంచి శ్రీ మాడ భూషిసంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో డాక్టర్ పట్ట తీసుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!