ప్రేమ బంధం

ప్రేమ బంధం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్ధూలం కర్తవ్యం దైవమాణ్నీకం. అంటూ సుప్రభాతం పాడుతూ ఇళ్లంతా గిరగిరా తిరుగుతూ పొగ వేస్తుంది. శ్రేష్ట తన పూజ కానిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టదు సాకేత్ కాఫీ అంటూ బెడ్ రూమ్ లో నుండి పిలుస్తున్నారు. తన శ్రీవారు. ఆ వస్తున్నానండి అంటూ కాఫీ కప్పుతో తన ముందు ప్రత్యక్షమైంది! ఏంటండీ మీరు మరీను బ్రేష్ చేసుకోనిదే కాఫీ తాగొద్దని మీకు ఎన్ని సార్లు చెప్పాను. మీరు వినరు కదా! రోజు నేనిలాగే అనడం మీరిలాగే తాగడం ఇలాగే అలవాటైంది? ఎంత చేసుకున్నానికి చేసుకున్నంత కర్మ అని లేవండి కాఫీ అంది! ఏంటి శ్రేష్టా ? ఈ రోజుల్లో కూడా, నీ చాదస్తం ఏంటి ? అంటూ దగ్గరికి లాక్కున్నాడు. ఇదేంటండి పాచిమొహంతో ఇంకా పూజా పూర్తి కాలేదు అంటూ దూరంగా వెళ్ళబోయింది. మరి నీ చాదస్తంతో చంపుతున్నావు. నీ పతిభక్తిని మించిన పూజ లేదోయ్. అంటూ దుప్పట్లోకి లాక్కున్నాడు. ఇంత వయసొచ్చినా మరీ మీరు చిన్నపిల్లాడిలా అయిపోతున్నారు. ఇంట్లో పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మీరు మర్చి పోతున్నారు. ఉంటే ఏంటంట విడిపించుకో బోయింది. వదలకుండా ? గట్టిగా పట్టుకున్నాడు. అమ్మాయంటూ మామగారు కేక వేశారు. ఆ వస్తున్నానండి మామయ్యగారు అంటూ గబుక్కున తప్పించుకొని పరిగెత్తింది. తర్వాత నీ పని చెప్తానుండు, అంటూ తనలో తనే నవ్వుకున్నాడు”అమ్మాయి కాస్త కాఫీ నీళ్ళు పోస్తావా అంటూ అడిగారు. ఇందాక మీరు లేరండి అత్తయ్యగారు లేచాక ఇద్దరికీ ఒకేసారి ఇస్తానని ఆగాను ఇప్పుడే మీ అబ్బాయికి కాఫీ ఇచ్చి వస్తున్నానండి. ఇప్పుడే తెస్తానుండండి, సరే అమ్మాయి” మీ అత్తగారు కూడా లేచినట్టున్నారు. అమ్మ ! సరే మామయ్యగారు, ఇద్దరికీ పట్టుకొస్తాను. అంటూ కిచెన్లోకి వెళ్ళింది. మమ్మి నాక్కూడా కాఫీ అంటూ ప్రణతి వెనుక వైపు నుండి గట్టిగా వాటేసుకుంది. ప్రణతి అంటే అందరికి చాలా గారాబం చక్కగా తల్లిదండ్రుల మాట వింటుంది. సరే హాల్లో కూర్చో నాని దగ్గర, తెస్తున్నాను. ప్రణతి చదువు బీటెక్ అయిపోయింది. ఇప్పుడు ఖాళీగానే ఉంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. మొన్న ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయింది. తప్పకుండా వస్తుందనే కాన్ఫిడెన్సగా వుంది. కాఫీ పట్టుకొచ్చి ముగ్గురికి ఇచ్చింది. కాఫీ తీసుకుంటూ ఏం టిఫిన్ చేసావు అంటూ అడిగింది. అత్తయ్యగారు ఇడ్లీకి రెడీ చేశానత్తయ్యా? మామయ్యకు టిఫిన్ లేటైతే ఆగలేరు. ఏం ఫర్వాలేదు. కాసేపు ఆగి తింటానులే అన్నారు. మామయ్యగారు ! రాఖీ పౌర్ణమి వస్తుంది కదా ! రాజ్యంకు ఫోన్ చేశావా? తల్లి అంటూ, గుర్తు చేసింది. మీ అబ్బాయి మాట్లాడారు. అత్తయ్య సరే అంది. మీ తమ్ముడు అలా చేసుకోవడం చాలా బాధగా ఉందమ్మా ! అంటూ బాధపడింది. ఏం చేస్తాన్లేండి అత్తయ్యగారు. వాడి రాత అలా వుంది. మాకు బాధ మిగిలిచ్చి పోయాడు. నాని మళ్లీ గుర్తు చేయొద్దన్ననా అమ్మ మళ్లీ ఆ మూడులోకి వెళ్లిపోతుంది. నిజమే నమ్మనేనే మర్చిపోయాను అంది! ఇంతటితో టాపిక్ ఆపేయండి నాని! ప్రణతి కాఫీతాగి లోనికి వెళ్ళింది. అత్తగారన్నదే మనసులో తొలుస్తుంది. ఎదురు చూడగా పుట్టిన తమ్ముడు, అందరికీ తమ్ముడంటే చాలా గారాబం ప్రేమ! అన్నిటిలో తనెే ముందుండేవాడు. అనుకోకుండా ఒక్కరోజు లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చాడు ఎవ్వరూ ఏం పట్టించుకోలేదు ! తనకు ఇష్టమైన పెళ్లి కదా! అని అందరూ ఊరుకున్నారు. ఆ సంతోషం ఎన్ని రోజులు మిగుల లేదు! ఒకరోజు సడన్ గా సూసైడ్ చేసుకున్నాడని వార్త అందరినీ కలవర పెట్టింది. అదే తట్టుకోలేని బాధ అమ్మ శ్రేష్ట టిఫిన్ పెడతావా అంటూ అత్తగారు పిలిచారు. పేడతానండి అంటూ కళ్ళను తుడుచుకుని టేబుల్ దగ్గరకు వచ్చి అందరికీ టిఫిన్ పెడుతుంది. నాకు కూడ పెట్టండి శ్రీమతి గారు అంటూ సాకేత్ ఫ్రేష్ అయి వచ్చాడు. సాకేత్ చూస్తే బాధ పడుతాడని బాధను తెలియకుండా? నవ్వుతూ అందరికీ టిఫిన్ పెట్టింది. అమ్మ రాజ్యం ఫోన్ చేసింది. సాయంత్రం బయలుదేరి వస్తుందట నెేను చెప్పడం మర్చిపోయాను. వస్తానంటూ ఆఫీసుకు బయలుదేరాడు. ఈరోజు రాఖీ పౌర్ణమి అందరూ పెందలాడే లెేచారు. రాజ్యం పిల్లలు భర్త వచ్చారు. రాజ్యం సాకేత్ కు రాఖీ కట్టింది. ప్రణతి కూడా రామ్ కు రాఖీ కట్టింది. అందరూ సంతోషంగా పిండివంటలు చేసుకుని తిన్నారు. బోజనాలైనంక మధ్యాహ్నం వేళ అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అమ్మ అన్నయ్యను అడిగావా ప్రణతి పెళ్లి గురించి లేదమ్మ ఇప్పుడే అడుగుతాను, ఏమండి ప్రణతి పెళ్లి గురించి అడిగారా ? అబ్బాయిని, అడిగానమ్మా! అమ్మాయికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. “రాజ్యం” ఇప్పుడు అందరూ వున్నారుగా అమ్మ, మళ్లీ కదిలించు, ఇప్పుడు వచ్చేవి అన్నీ మంచి రోజులే ఈ మంచి రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుందాం. శ్రేష్ట అబ్బాయిని తీసుకుని ఇలా రా అలాగేనండి అంటూ సాకేత్ ను తీసుకురావడానికి గదికి వెళ్లింది. ఏమండి మీ అమ్మగారు పిలుస్తున్నారు, పదండి అంది! సరే అలాగే వెళ్దాం అంటూ దగ్గరగా వచ్చి ఏమైంది శ్రేష్ట చాలా డల్గా ఉన్నావు ఎందుకు పోయిన వాడు వస్తాడా? వాడి గురించి తలుచుకుంటూ ఉంటే మేమంతా ఏం కావాలి మా గురించి కూడా ఆలోచించాలి కదా! అంటూ శ్రేష్ఠను, దగ్గరగా తీసుకుంటూ, ఓదార్చాడు. సారి అండి మిమ్మల్ని బాధ పెట్టాను. ఇంకెప్పుడూ బాధ పెట్టనండి అంది నవ్వుతూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి! సరే నా? అలాగే నండి అత్తయ్యగారు పిలుస్తున్నారు. పదండి! ఇద్దరూ నవ్వుతూ కిందికి వచ్చారు. కింద తమ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. చెప్పమ్మా ! పిలిచారట, అదేరా ! మన ప్రణతి పెండ్లి గురించి మాట్లాడాలి అంటుంది. రాజ్యం అక్క సరే నమ్మ ప్రణతిని పిలిచారు. ఏంటమ్మా భావను చేసుకోవడం, నీకు ఇష్టమేనా? సరే డాడీ మీకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు డాడీ అంది. అందరూ చాలా సంతోష పడ్డారు. రాజ్యం అనుకున్నట్టుగానే ఈ మంచి రోజుల్లోనే పెళ్లి నిశ్చయించారు. అంగరంగ వైభవంగా ప్రణతి పెండ్లి చేశారు. పాల గ్లాసుతో లోపలికి అడుగు పెట్టింది. బావను చూడగానే సిగ్గుపడుతూ బావ పాలు అంది. పాల గ్లాసు అందుకొని తనను దగ్గరగా తీసుకుంటూ, ఏంటి ఇది సిగ్గెే అల్లరి పిల్లకు కూడా సిగ్గా ! అంటూ కళ్లు మూసుకున్న తనని తన రెండు చేతులతో తీస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. సిగ్గుగా ఉంది భావ అంటూ బావ గుండెలపై వాలింది. లైట్ ఆఫ్ చేయి బావా నాకు సిగ్గేస్తుంది. అవునా నీ సిగ్గు నెే పొగొడుతానుగా అంటూ ఓరచూపులతో చూస్తూ గుండెలపై లాక్కుంటూ ఒక చేత్తో లైటాఫ్ చేస్తూ తన కౌగిలిలో బంధించాడు. ఒకరిలో ఒకరు కరిగిపోతూ ఆనందాన్ని పంచుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!