పడుగు పేకల అల్లికలు

పడుగు పేకల అల్లికలు

రచన:చంద్రకళ. దీకొండ

ప్రకృతిలోని వర్ణాల దారాలతో…
పడుగు పేకలను కూర్చి…
రోజులకు రోజులు
ఇంటిల్లిపాదీ కష్టపడి…
చేతితో నేసే జరీపోగుల జలతారు చీరలు…!
అగ్గిపెట్టెలో పట్టే చీనాంబరాలు నేసిన
చేనేత కళాకారుల ఖ్యాతి మనది…
నేర్పుగా,ఓర్పుగా,అందమైన కూర్పుతో…
రూపసృజన గావించే హస్త
కళలకు పేరెన్నిక గన్న
జాతి మనది…!
సాంప్రదాయ కళల కోటగోడలు బద్దలు కొట్టాలని

సామ్రాజ్యవాద దేశాలు యంత్రకుతంత్రం చేసినా…
నక్కజిత్తుల మాయోపాయాలెన్ని పన్నినా…
ఆధునిక రీతులను ఆకళింపు చేసుకొని…
అజరామరమైన మన
వారసత్వ కళ ఇంకా ప్రపంచ
మన్ననలందుకుంటూనే ఉంది…!
ప్రజలు ఆదరిస్తే…
ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిస్తే…
చేనేత కళాకారులు
ఆత్మహత్యలు చేసుకొనే
అగత్యం తప్పి…
మళ్లీ జవసత్వాలు పుంజుకుని…
పునర్వైభవం పొందడం సాధ్యమే…!!!

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!