అమ్మ ప్రేమకు ఒక్క రోజు సరిపోతుందా…???

అమ్మ ప్రేమకు ఒక్క రోజు సరిపోతుందా…???

రచయిత :: శ్రీకాంత్ తాళ్ళ

నీ పేగు బంధానికి పూసిన
అనురాగపు పుష్పాన్ని అని
నన్ను చూసి తెగ ఆనందపడతున్నావే అమ్మా….
నాకై ఆలోచించే తొలి వ్యక్తి
నీవు మాత్రమే అని తెలిశాక
నాకై ఎన్ని కలలు కన్నావో అవన్నీ
ఒక్కసారి తలుచుకుంటే
అద్భుతం అనే మాటకు సరైన అర్థం అమ్మ అని నిఘంటువులో నిక్షిప్తం చేయాలి అనిపిస్తుంది

అసలు కొలమానం లేని నీ ప్రేమకు
ఈ ఒక్క రోజేంటీ
అమ్మా అని పిలిచే ప్రతిసారి
ఓ మాతృదినోత్సవమే కదా

అనిర్వచనీయమైన ప్రేమకు
మరో రూపమైన అమ్మ కోసం
ఆంగ్ల మాసపు ఓ ఆదివారం మాత్రమే
మాతృ దినోత్సవ రోజుగా ప్రకటించి
శుభాకాంక్షలు చెప్పుకోవటం
అంటే… మరచిన అమ్మ ప్రేమను
గుర్తుకు తెచ్చుకోవటమా…
నిత్యం స్మరించే నీ నామామృత అనుబంధాన్ని మరోసారి తలచుకోవటమా

సమయానికి తినకుంటే పేగు కూడిపోతుంది అని చెప్పి
నా పేగు ఆకలికి అల్లాడుతుందని
తిట్టి మరి అన్నం తినిపించిన నీకు
ఈ రోజూ మాత్రమే
శుభాకాంక్షలు చెప్పటం ఏంటమ్మా

You May Also Like

3 thoughts on “అమ్మ ప్రేమకు ఒక్క రోజు సరిపోతుందా…???

  1. నిజమే కదా ఒక్కరోజు శుభాకాంక్షలు చెప్తే సరిపోదు…🙏👌

Leave a Reply to బుజ్జమ్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!