ఆనాదిగా సామెతలు

ఆనాదిగా సామెతలు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

పూర్వం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, వందల సంవత్సరాల క్రితం చిన్న చిన్న రాజ్యాలుగా  చేసుకొని ఉండేవని మనం చదువుకున్నాము. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజు, ఇలా రాజులు, చక్రవర్తులు, సామంతులు, అని రాజులుగా ప్రకటించుకొని దేశాలను రాజ్యాలను ఊరులను పాలించుతూ ఉండే వారు. ఐతే ఇక్కడ వచ్చిన చిన్న చిక్కు ఈ రాజులలో ఒకరికి, ఒకరికి మధ్య పడదు. ఎప్పుడూ కయ్యాలకు కాలుదువ్వుతూ యుద్ధాలతో పోట్లాడు కొనేవారు కానీ ఎప్పుడూ ఐక్యమత్యం అనేది వారి మధ్య ఉండేది కాదు. ఇద్దరు కయ్యానికి దువ్వితే మూడవాడు తమాషా చూస్తూ ఉంటాడు. అదే విధంగా మన దేశంలోని రాజుల విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. అలా ఐక్యమత్యం లేని మనకు అది ఒక లోటుగానే ఉండేది. అప్పటి పరిస్థితులు. అదే సమయంలో  వర్తకం చేసుకుంటామని కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండే తెల్లవారు అంటే ఇంగ్లీషు వాళ్ళ సముద్ర మార్గంలో పయణించి మన దేశాంలో వచ్చి మకాం పెట్టారు. వారికి మన రాజులు మంచి మనస్సుతో అనుమతి ఇచ్చారు. తెల్లవారు వర్తకం సాగిస్తున్నట్టే ఉండి. మన రాజుల తీరుతెన్నులు గమనించి జగడమాడు కోవడం కనిపెట్టారు. “ఇది ఏదో భేష్ గా ఉంది ఈ హిందూదేశపు రాజులు చాలా తెలివి తక్కవ వాళ్ళులా కనపడుతున్నారని. వాళ్ళల్లో వాళ్ళకి పడక చస్తున్నారని.
ఈ అదునులో మనం వాళ్ళ జగడాలు ఏక్కువ చేసి వాళ్ళను విడదీసి ఒకసారి ఒకరి పక్షం ఇంకోసారి మరోకపక్షం ఉన్నట్టు నటించి నాటకం సాగిస్తే, రెండు పక్షాల వాళ్ళు కూడా మనకు చేరువై మనకు లొంగిపోయి ఉంటారు. అప్పుడు వాళ్ళ రాజ్యాలను లాక్కుని మనమే పరిపాలించు కోవచ్చు, ఈ రాజులందరూ మన చేతి కింద కీలుబొమ్మ లై చచ్చినట్టుగా పడి ఉంటారు. అని దురాలోచన చేసుకొన్నారు. వాళ్ళ ఆలోచనకు తగినట్టగానే అన్ని అనుకూలంగా అమరిపోయి మన దేశపురాజులను చీలదీసి వాళ్ళతోనూ వీళ్ళతోను మీకు వచ్చిన భయం ఏమి లేదు మేము ఉండగా మీకు అపజయం కలుగదు అంటూ..! వాళ్ళను నమ్మించ ఆరంభించారు. అందుచేత అప్పుడు రాజులలో ఎవరికీ ఏపాటి శత్రుభయం కలిగిన వెంటనే పోయి రక్షణ ఇమ్మని తెల్లవారిని ఆశ్రవించేవారు. మన రాజులు పోయి “బాబు మీరే గతి అని ప్రాధేయపడే సరికి తెల్లవారు వారికి ఇష్టం వచ్చినట్లుగా షరతులు బిగించి వారికి కళ్లెం బిగించారు. రాను రాను రాజులందరని  ఈ విధంగా లొంగదీసుకొని చివరికి ఒకపని చేశారు. “మీ రాజ్యంలో ఇప్పుడు ఉండే సైన్యాన్ని తీసీవేయాలి. వానికి బదులుగా మా తెల్లవారి సైన్యాలను పెట్టి పోషించాలి” అని ప్రకటించారు. మనరాజులు చేయగలిగినది లేక అలాగే పోషిస్తాం అని తప్పనిసరి పరిస్థితుల్లో తల ఊపారు. అలా..తెల్లవారు ముందు వర్తకానికి కని వచ్చి, ఉండటానికి చిన్న జాగ కూడా లేక బాధపడుతూ హిందూదేశాన్ని పరిపాలించే ఎత్తులో కూర్చున్నారు. మనరాజులు తెల్లవారి ఆశ్రయం పొందారు. కానీ ఇంతకాలం రాజుల కోటలో ఉండే మన సైన్యాల మాట ఏమిటా! వాళ్ళను తీసివేసి తమ తెల్లవారి సైన్యాలను పెట్టే శారుగా! ఈ తొలగించబడిన సైనికుల బ్రతుకు తెరువు ఎలాగ? అనే ప్రశ్న ప్రశ్నగా ఉండిపోయింది. అట్టి పరిస్థితులలో మన సైనికలందరూ కూడలిగా చేరి వారిలో కొందరు బతకలేక ఊళ్ళ మీద పడి దోచుకోవటం వృత్తిగా పెట్టుకున్నారు.
ఈ దోపిడీ గాళ్ళ ముఠాలనే పూర్వం బందిపోటు దొంగలు దండులని పిలిచేవారు. వీళ్ళు సైనికులుగా ఉన్నప్పుడు అదుపు అజ్ఞాన ఉండేవి. కానీ ఇప్పుడు అంతా స్వేచ్ఛ అందుకని పండిన పంటలు పశువులను, కొంపలో ఉండే నగలు, డబ్బు ఎత్తుకు పోవటం ఎవరైనా అడ్డు వస్తే ఎదిరిస్తే వాళ్ళను హింసించడం ఇలా ఇష్ట మొచ్చినట్టల్లా సంచరించే వాళ్ళు ఐతే వారు వృత్తి రీత్యా దొంగలుగా మారినా! ఇంతకు ముందు సైనికులుగా పనిచేసిన వాళ్ళు కాబట్టి ఈ వృత్తిలో ఒక పద్ధతిగా అనుసరించి వాళ్ళ నియం ఉండేది. అది చాల చిత్రంగా ఉండేది. వాళ్ళ దోపిడికి బయలుదేరే ముందు ఒక “నాదం” ఒక బూరా ఊదుకుంటూ అంటే శబ్దం చేస్తూ రావడం మొదలు పెట్టారు. దానికి దొంగలు ఆ బూర ఎద్దు కొమ్ములతో చేయడం వలన దానికి “శృంగనాదం” ఈ బూరా శబ్దం వినిపిస్తే దోపిడీ దొంగలు వస్తున్నారు. అని మీ జాగ్రత్తలో మీరు ఉండమని ఊరి ప్రజలకు హెచ్చరిక చేయడమన్న మాట. అందుచేత బూరా వినపడింది. అనే సరికి ప్రజలు హడలి దూరంగా ఏ ఆడవిలోకో పోయి ప్రాణాలు కాపాడు కొనేవారు. “ఇదే సమయంలో మరోక తమషా జరిగింది. జీలకర్ర మిరియాలు లాంటి దినుసులు అమ్ముకోవటానికి కొంత మంది మన దేశానికి వర్తకులు వచ్చే వాళ్ళు. వాళ్ళల్లో కూడ ఒక వింత అలవాటుంది. తాము సరుకుతో వచ్చినట్టు గా ప్రజలకు తెలుపుతూ వారు ఒక రకమైన బూరాతో శబ్దం చేసేవాళ్ళు.
ఊరి బయట కొమ్ము బూరా  వినిపించే సరికల్లా… అది దోపిడిగాళ్ళ లేక జీలకర్ర  వర్తకుల చేసే శబ్దంమా! అని కొంతమంది అమాయక ప్రజలకు అర్థం గాక తేడా తెలియక ఏ శబ్దం వినపడినా దొంగల ముఠా వారే అనుకొని పరుగులు పెట్టేవాడు. ఐతే గ్రామంలో కాస్త తెలివి దైర్యం ఉండే వారు తేడాను కనిపెట్టి “ఓరే మీ కంగారు కాకు లెత్తుకు పోను. మీకు వచ్చిన భయంలేదు. ఇది జీలకర్ర “శృంగనాదం” మే గాని దండు గాళ్ళ “శృంగనాదం” కాదు అంటూ! భయపడి పారిపోయే అమాయక ప్రజలను మందలించి ధైర్యం చేప్పేవాళ్ళు. అప్పుడు తేరుకొని “ఓ..ఇది జీలకర్ర “శృంగనాద” మేనా! ఐతే పరవాలేదు.” అనుకొని వెనక్కి వచ్చి కుదటపడే వాళ్ళ. దొపిడి దొంగల శృంగనాదం”వినబడేటప్పుడు గజ, గజ, వణికి పోవలసిన ఆరోజుల్లో జీలకర్ర వర్తకుల శృంగనాదానికి భయపడ వలసిన అవసరం లేక పోవటం వలన, ఏదైనా ఒక మనిషిని గురించి గాని, ఒక పనిని గురించి గాని నిర్లక్ష్య భావాన్ని తెలపటానికి గాను “అప్పటి వారు, పక్కవానితో ఆ.. పోదూ “జీలకర్ర శృంగనాదం.” అనే స్వరూపం లో సామేత వాడుకలోకి వచ్చింది. “ఇది జీలకర్ర శృంగనాదమే”కదా ఐతే ఫరవాలేదు” అని ప్రజలు అనే మాటలు క్రమేన అటునుంచి ఇటు తిరిగబడి “శింగినాదం జీలకర్ర” గా మారి పోయింది.
ఇది దొంగల బూరాకి జీలకర్ర వర్తకుల బూరాకి తేడా తెలియక తికమక పడి ఆరోజుల్లో ప్రజల ఇలా బాధపడ్డారు. కానీ ఒక సామెత పుట్టింది. ఇదే అనాదిగా వచ్చే సామెత.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!