ఆవేశం

ఆవేశం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: గాయత్రి

ఈ మధ్య మా అత్తకి ఆరోగ్యం బాగ లేదు అని, హాస్పటల్ కి తీసుకొని వెళ్ళాను. డాక్టర్ ఇంకా రాలేదు టోకన్ మందే తీసుకొని వున్నాము. బి.పి చెక్ చేసారు నార్మల్ గానే వుంది. డాక్టర్ చాలా సేపు అయినా రాలేదు. అందుకు అని రిసెప్షన్లో కూర్చొని ఉన్న, కొంతమంది పేసెంట్స్ వస్తున్నారు పోతున్నారు. డాక్టర్ ఇంకా రాలేదు. అప్పటికే చాలా సేపు సమయం వృధా అయింది. మా అత్త గుండెల్లో నొప్పిగా వుంది అంటుంది. సరే అని సిస్టర్ ని డాక్టర్ ఎప్పుడు వస్తారు అని అడిగాను.11.30 కి వస్తారు వెయిట్ చేయండి అన్నది. సరే అని మా అత్తకి జ్యూస్ తెచ్చి ఇచ్చి కూర్చొని ఉన్న ఆమె పొద్దున్నే టిఫిన్ ఏమి తినలేదు. నా ముందు ఒక పేషంట్ ని వీల్ చెయిర్ లో తీసుకొని వెళ్తున్నారు. నాకేమి హాస్పిటల్ కొత్త కాదు కానీ, ఈ మధ్య స్మెల్ పడటం లేదు. అందుకు మాస్క్ వేసుకొని కూర్చొని ఉన్న నేను. ఆ పేషంట్ తో పాటు ఒక ఆవిడ వెళ్తుంటే? ఒక్క నిమిషం గమనించి ఈవిడ అక్క అనుకోని. టక్ న లేసి వెళ్ళాను. “శివక్క” అంటే “హా” అని వెనక్కి తిరిగింది. నేను గుర్తు పట్టక పోవడానికి కారణం వుంది అండోయ్. ఆ అక్క కి చిన్నప్పటి నుండి బొల్లి వుంది. అది క్రమేని పెరిగింది ఏమో. నేను ఈ మధ్యలో చూడలేదు. మొత్తం వ్యాపించి మొహం గుర్తు పట్టలేని విధంగా వుంది. “హా ఎవరు” “మాస్క్ తీ” అన్నది ఆ అక్క. నన్ను కూడా గుర్తు పట్టలేదు కదా!? నేను ఈ మధ్యలో గుండు చేయించుకొని ఉన్న. పైగా మళ్ళీ మాస్క్ లో ఉన్న. హా అని మాస్క్ తీసాను. అరుణ అన్నది. “హా అక్క అని ఎవరు ఈయన అన్నాను. ఎవరు ఏంటి? పెద్ద నాన్న అన్నది. అప్పుడు చూసా నేను ఆయన్ని అస్సలు గుర్తు పట్టలేని విధంగా వున్నారు. అసలు ఎలా ఉండేవారు. పెద్ద కోర మీసం. తెల్లగా ఉంటాడు. ఎంత ఎండకు వెళ్లినా రంగు మాత్రం మారలేదు. ఒడ్డు, పొడుగు చాలా చక్కగా ఉంటాడు. నన్ను చూస్తే చాలు ఏరా నాకొడక ఆరోజు అని నవ్వేవాడు. అంటే మనం చేసిన పని అలాంటిది. లేకపోతే శాలువా కప్పి సన్మానం చేస్తారా! ఏంటి.? ఒకసారి నా చిన్నప్పుడు. నేను 5 వ తరగతి చదువుతూ ఉంట. మా ఇల్లు కడుతున్నాం. మధ్యలో కొన్ని కారణాల వల్ల మేము మా మేనమామ ఇంట్లో వున్నాము. మా పెద్ద అత్త చాలా గడుసు. ఇష్టం వచ్చినట్టుగా తిట్టేది. మనకేమో పౌరుషం. కొంతమందికి అంతేనేమో? తినడానికి లేకున్నా పౌరుషంకి తక్కువ లేదు. అది బ్లడ్ లో సచ్చింది ఏమో. ఆరోజు పండుగ అని రోట్లో అరిసలకి బియ్యం పిండి దంచుతుంది మా పెద్ద అత్త. “ఒసేయ్ అరుణ కాసిన్ని నీళ్లు తేవా” అన్నది.
నేను ఆట్లాడుకుంటూ పలకలేదు. పలకలేదు అని నన్ను బండ బూతు తిట్టింది అబ్బా..అంతే నాకు రోషం పొడుచుకొని వచ్చింది. నీళ్లు తీసుకొని పోయి రోట్లో పోసా! ఇంకేం వుంది పిండి మొత్తం ఖరాబ్ అయింది. ఇక చూసుకో అత్త నన్ను కొట్టి, తిట్టింది. ఆహా! నన్నే కొడతావా! అని అలిగి ఇంట్లోకి వెళ్లి వాకిలి వేసుకొని గడియ పెట్టేసుకొని నేను ఉరి వేసుకుంట అని మంచం కింద కూర్చున్న. అసలు ఉరి అంటే కూడా తెలియదు గాని, ఉరి వేసుకోవాలి అని, ఎవడైనా మంచం కింద కూర్చుంటారా! అందరు వచ్చారు. కిటికీ లో నుండి పిలుస్తూ ఉన్నారు. అబ్బే మనం డోర్ తీస్తేగా! లాస్ట్ కి శివయ్య పెద్ద నాన్న వచ్చారు. ఆ పెద్ద నాన్నకి అందరు అమ్మాయిలే. కూతుర్లని కూడా కొడకా అనేవారు. నన్ను కూడా! రేయ్ కొడకా! ఉరి వేసుకొని ఏం సాధిస్తావ్ రా! బయటకురా! మనం ఆయమ్మి గురించి మీ మామకు చెప్పి కొట్టిద్దాం అన్నారు. అదే మా అత్త గురించి. అవును కదా! పెద్ద నాన్న మామ రానివ్వు కొట్టిద్దాం అన్నాను. మరి ఉరి వేసుకుంటే ఎలా? దా బయటకు అన్నారు. సరే అని డోర్ తీసుకొని బయటకు వచ్చా. ఆ సంఘటన జరిగాక, నేను ఎప్పుడు ఎదురు పడ్డా కూడా, నన్ను చూసి ఏరా నా కొడక ఆరోజు ఉరి వేసుకొని ఉంటే? ఇంత బాగా చదివి ఉద్యోగం తెచ్చుకొని వుండే దానివా?వాడికి, అంటే? మా నాన్న కి, నేనంటే బోలెడు ఇష్టం అట. నాకు సరిగ్గా గుర్తు లేదు. నాన్న నా ఎనిమిదవ ఏటనే దేవుడి దగ్గరకి వెళ్లిపోయారు. అలాంటి పెద్ద నాన్నని నేను అలా ఆ పరిస్థితి లో చూసి చాలా బాధ పడి “ఏమైనది అక్క అన్నాను.” పెరాలసిస్ వచ్చింది అరుణ. బాగానే ఉన్నారు. సడన్ గా మూత్రం రాలేదు. అని అంటుంటే ఇక్కడికి వచ్చాము అన్నది. అనేసి టైమ్ లేదు మా, అర్జెంట్ గా అడ్మిట్ చేస్తున్నాము. వెల్లేసి వస్తాను అని వెళ్లిపోయారు. ఆరోజు నాది చిన్న తనం ఆవేశం, కోపం అన్ని కానీ ఆ క్షణం దాటితే తర్వాత ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయలేదు. అందుకే ఆవేశాలు మనకు సమస్యలు తెచ్చి పెడతాయి తప్పితే, ఇంకేమి రావు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!