జర జాగ్రత్త బిడ్డా

జర జాగ్రత్త బిడ్డా

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

అమ్మా తయారయ్యావా! పరీక్షకు ఆలస్యమౌతుంది. తొందరగా బయలుదేరు అంటూ కాళ్లకు చెప్పు లేసుకుంటూ బయటకు వస్తాడు సుందరం. ఇదిగో నాన్నా రెడీ అంటూ హాల్ టికెట్ తీసుకుని శిరీష కూడా బయటకు నడుస్తుంది. కూతురిని, పరీక్ష సెంటర్ దగ్గర దింపి. శిరీషా పరీక్ష రాసి నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. నాకు కొంచెం మీటింగ్ ఉంది అని జాగ్రత్తలు చెప్పి, తను ఆఫీస్కు వెళ్ళిపోతాడు సుందరం. శిరీష అలాగే నాన్న అని లోపలికి వెళ్తుంది.
శిరీష! పరీక్ష రాసి బయటకు వచ్చి, ఆటో ఎక్కి అడ్రెస్స్ చెప్పి ఫోన్ లో నాన్నకు, అమ్మకు లైవ్ లొకేషన్ షేర్ చేసి.. ఫ్రెండ్ తో ఎలా రాసావే అంటూ మాటల్లో పడుతుంది. ఆటోవాడు ఎటు తీసుకెళ్తున్నాడో కూడా చూడకుండా మాటల్లో పడిపోతుంది శిరీష. దారి తప్పి తీసుకెళ్తున్న ఆటోవాడు కొద్దిగా నిర్మాన్యుష్య ప్రదేశానికి తెచ్చి అమ్మాయితో అసభ్య ప్రవర్తనతో ఇబ్బంది పెడ్తుంటాడు. శిరీష కొంచం అలర్ట్ అయ్యి నాన్నకు కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి పరిస్థితి గమనించిన సుందరం. పోలీసులకు శిరీష లైవ్ లొకేషన్ షేర్ చేస్తాడు. వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్న స్టేషన్ సిబ్బందితో వెళ్లి ఆటో వాడిని అదుపులోకి తీసుకొంటారు. శిరీషతో పోలీసులు మంచి పని చేశావమ్మా. లొకేషన్ షేర్ చేసి. కానీ నీ జాగ్రతలో నువ్వు ఉండాలి. కంగారు పడకుండా పరిస్థితిని అంచనా వేసి ఎదుర్కునే ధైర్యం ఉండాలి అని అంటుండగా సుందరం పరుగు పరుగున శిరీష దగ్గరకు వచ్చి కూతురిని దగ్గరకు తీసుకుంటాడు. నాన్నా! అంటూ భోరుమంటుంది శిరీష. ఊరుకోమ్మా ఇప్పుడేం కాలేదు కదా! నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ఇంటికి బయలుదేరుతారు. ఎలా తయారైందో లోకం. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఇలాంటి వెధవల వలన అనుకుంటూ పోలీసులు కూడా అక్కడినుంచి వెళ్ళిపోతారు.
అందుకే ఆడపిల్లలూ జర జాగ్రత్త. అలర్టుగా ఉండండి. ధైర్యంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదురుకునే ఆలోచన కలిగి ఉండండి.

You May Also Like

One thought on “జర జాగ్రత్త బిడ్డా

  1. ధన్యవాదములు తపస్వీ మనోహరం.
    నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహం అందిస్తునందుకు
    🙏🙏🙏🙏👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!