తల్లి బాధ్యత

తల్లి బాధ్యత

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల.

కీర్తన, కైలాస్ గొడవ పడుతున్నారు. అది చూసి అభి “నానమ్మ.. నానమ్మ” అంటూ ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి నానమ్మ ముందు నిలబడ్డాడు. “ఏంటమ్మా! అంతలా పరిగెడుతూ వచ్చావు ఏమైంది ఏడుస్తున్న అభిని చూస్తూ అడిగింది.” సుందరమ్మ మళ్ళీ అమ్మానాన్న దెబ్బలాడుతున్నారంటూ చెప్పాడు. నువ్వేమి కంగారు పడకు. నువ్వు ఇలా రా!” ఇటు వచ్చి కూర్చో అంటూ బుజ్జగిస్తూ భయపడుతున్న అభిని తన పక్కన కూర్చోబెట్టుకుంది. “ఇంకేం చేస్తారు. తిన్నది అరక్క గొడవ పడుతున్నారు. గొడవ పడని అంది.” “అదేంటే అలా చెప్తావు పిల్లాడు ఎంత కంగారు పడుతున్నాడో చూడు. ” లేకుంటే ఏంటండీ అడిగే వారు లేకనా రోజు ఇలా దెబ్బలాడుకోవడం ఏంటి? ఇంట్లో అత్త, మామ ఉన్నారని భయం లేకుండా, పక్కన ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారోనని లేకుండా ఇంత మొండిగా తయారయ్యారు ఏమిటండి? ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా ప్రవర్తిస్తున్న వారిని ఏమంటారు? “. పిల్లాడిని చూడండి ఎలా కంగారు పడుతున్నాడో ఓపికలు లేకుంటే పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలి. పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని ఎందుకు కనాలి? ఈ కాలం పిల్లలకి ఇదేం మాయ రోగమండి వెనుకటి రోజుల్లాగా పదిమంది పిల్లలా! ఏంటి ఒక పిల్లాడిని కనీ చూసుకోవడమే బ్రహ్మాండమవుతుంది. ఉద్యోగాలంటూ వెళ్లడం రాగానే చికాకు పడుతూ గొడవలు పడడం, ఇంట్లో అత్త, మామలు ఉండొద్దు. సమిష్టి కుటుంబాలు అంటే తెలియదు. పోనీ ఇద్దరు భార్యాభర్తలే ఉండి చక్కగా పిల్లల్ని చూసుకుంటారంటే అది లేదు ఎప్పుడూ గొడవలే మనం కలగ చేసుకుందాం అంటే మళ్ళీ ఎంత గొడవ చేస్తారోనని భయంగా ఉంది. “అమ్మ అంటూ కైలాష్ వచ్చాడు అభి ఏడంటూ?” “ఇక్కడే ఉన్నాడు ఎంత బెదిరిపోతున్నాడో చూడు రోజు ఇలా గొడవ పడడం మీకు అలవాటయింది”. మీకు ఇదేమన్నా బాగుందా!” అంటూ సుందరమ్మ కోపంగా అంది. నేనేం చేసేదమ్మా తనే గొడవపడుతుంది అంటూ చెప్పాడు.” “చెప్పండి ఇంకా ఉన్నవి లేనివి అన్నీ చెప్పండి మీరేం చేయలేదా! అంతా నేనే చేశానా!” అంటూ కీర్తన మళ్లీ గొడవ పడింది. “ఎవరిది తప్పు ఉన్న ఇద్దరు సర్దుకుపోవాలి అప్పుడే కాపురం బాగుంటుంది. మీరు గొడవ పడుతుంటే పిల్లాడిని చూడమ్మా ఎంత బిగుసుకుపోయి ఉన్నాడో కీర్తన! నేను అంటున్నానని ఏమనుకోవద్దు రోజు ఇలా గొడవ పడితే పిల్లవాడు నీ చేతిలో ఉండడు. మానసికంగా కృంగిపోతాడు నాకు మీరిద్దరూ సమానమే మీరేం చిన్న పిల్లలు కాదు. నీకు ఓపిక లేకుంటే ఉద్యోగం మానేయమ్మ. ఉద్యోగం చేయమని ఎవరు బలవంతం చేస్తున్నారు. చక్కగా పిల్లాడిని చూసుకో, పిల్లాడు చెడిపోతే మీకేగా నష్టం  నేను మీ ఇద్దరికీ చెప్తున్నాను అంది సుందరమ్మ!” కీర్తన పిల్లాడిని రమ్మని చేతులు చాపింది రానంటూ నానమ్మ వెనకాల భయపడదు దాక్కున్నాడు. మీరు ఇలాగే ఉంటే మీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడడు”. వీళ్ళ గొడవలకి ఏం కారణాలు ఉంటాయో తెలియదు. ” చూడురా! కైలాస్ ఇలా ఎంత కాలం గొడవలు పడతారు ఇద్దరు సర్దుకోవాలి”. ” అది ఏమన్నా నువ్వు సర్దుకోవాలి నువ్వు ఏమన్నా అది సర్దుకోవాలి అప్పుడే సంసారం బాగుంటుంది.” మాకు చాలా బాధగా ఉందిరా! మీరు ఇలా గొడవ పడుతుంటే కీర్తన నువ్వు ఉద్యోగం మానేయమ్మ మనకు బొచ్చెడు ఆస్తి ఉంది. వాడు ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. ఒక్కగానొక్క కొడుకు వాడు బావుంటేనే మీకు కూడా బాగుంటుంది. మా ముందు మీరంతా బాగుంటనే
మేం సంతోషంగా కాలం గడిపేస్తాను. కీర్తన మీ అమ్మలా చెప్తున్నాను నా మాట విను అలాగే అత్తయ్య మీరు చెప్పినట్టుగానే పిల్లల్ని మిమ్మల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను అంది. చెమర్చిన కళ్ళతో కీర్తనను దగ్గరకు తీసుకుంది. ఇంతకంటే మాకు కావాల్సింది ఏముంటుంది. ఈరోజులలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలంటూ పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంట్లో తల్లి ఇంటిపట్టున ఉండి పిల్లలను చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కైలాస్ కూడా కీర్తనకు సారీ చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరు సర్దుకుంటే ఆ ఇల్లు స్వర్గసీమవుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!