బంధాలు – బంధనాలు

బంధాలు – బంధనాలు

రచయిత :: బొడ్డు హారిక

పైసలతో ఏర్పడిన బంధం
పైసా పోగానే పగిలిపోతుంది
ప్రేమతో ఏర్పడిన బంధం
పేగు పంచిన బంధం
ప్రాణం వీడు వరుకు వీడిపోదు
వివాహా బంధం విడాకులతో
పోతుంది
మనసుతో ఏర్పడిన బంధం
మనువుకి చేరువ కాకపోయినా
మాటల బంధంగా లేకపోయినా
భావాలు బంధనాలై బాధించిన
మేను మన్ను లో కలిసి
భువిని వీడు వరుకు
నీతో నాకేర్పడిన ఈ మనోబంధం
మారిపోదుగా నా ప్రాణమా…..!!!

You May Also Like

2 thoughts on “బంధాలు – బంధనాలు

  1. బంధాల విశ్లేషణ చాలా చక్కగావుంది.చివరి రెండు వరుసలలో
    భావాలు చాలాతాత్వికంగా సత్యమైనవీగా చెప్పారు.మంచి భావుకత తో రాశారు.అభినందనలు.

Leave a Reply to Boddu Harika Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!