కరోన కోరలు

కరోన కోరలు

పరుగులు ఆగితే,
కడుపులో కాళ్ళు పెట్టుకుని
పడుకోవాల్సిన రోజులు!
అడుగులు తడబడితే,
ఆగిపోయే బ్రతుకులు!
యాభయ్యో పడిలో కూడా
ఆగని ఉరుకులు పరుగులు!

గూడు కదిలితే
కాటేసే కరోనా కాలం
స్తబ్దుగా ఉంటే
ఆగిపోయే జీవితకాలం

కాటేసిన కాలం కోరలు పీకి
కావాల్సిన జాగ్రత్తలు శ్రద్ధగా పాటించి
జీవిత కాలానికి విలువనిచ్చి
ప్రమాదాలను తోసిపుచ్చి

ప్రభుత్వ మాటలకు విలువనిస్తూ
బంధాలను భద్రపరచుకుంటూ
అవసరానికి మించిన ప్రయాణాలు మానుకుంటూ
అనవసర కరచాలనాలకు దూరంగా ఉంటూ…

జీవితాన్ని కాపాడుకుందాం!
బంధాలను బలపరచుకుందాం!
మన సంస్కారమైన నమస్కారాన్ని అందరికి పరిచయం చేద్దాం!
కరోన కోరల్ని పీకేద్దాం!

రచయిత:: శాంతి కృష్ణ

You May Also Like

2 thoughts on “కరోన కోరలు

Leave a Reply to హసీనాఇల్లూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!