చిన్ననాటి జ్ఞాపకాలు

చిన్ననాటి జ్ఞాపకాలు

రచయిత :: బండారు పుష్ప లత

నేను పొద్దున్నే లేచి అన్ని పనులు పూర్తి చేసి ఛాయ పెట్టాను అప్పుడే మాశ్రీవారు లేచి తాను స్నానం ముగించాడు ఇద్దరం కూర్చొని చాయతాగుతున్నాం అంతలో నా చరవాణి మోగింది ఇంత ప్రొద్దున్నే ఎవరబ్బా అనిచూస్తే పేరు రాలేదు చరవాణి నొక్కి హలొ”””” ఎవరు అని మొదలెట్టా నేను సుధని…..
సుధా.. సుధ ఎవరు నాకు గుర్తుకు రావట్లేదు…
అయ్యో మొద్దు నీ చిన్న నాటి స్నేహితురాలిని నన్నే గుర్తు పట్ట లేదా……
అరె సుధ ఎలావున్నావు… అందరు ఎలా వున్నారు…
ఎక్కడుంటున్నావు.. అని ప్రశ్నలతో సుధని ఉక్కిరి బిక్కిరి చేశాను.. అప్పుడు సుధ అరె ఉండవే నేను మన వాడకట్టు లో వుండే చిన్న నాటి స్నేహితులని అందరిని కలపాలని అనుకుకుంటున్నాను…. అందరికి ఫోన్ చేశా నీ నెంబర్ దొరకటానికి చాల రోజులు పట్టింది. మీనాన్న గారు ఇంటికిరాయి కోసం వస్తే మానాన్న మీ నాన్న దగ్గర అడగమని చెప్పా. అడిగి తీసుకోని నాకు పంపారు ఆలా నీకు ఫోన్ చేశాను అమ్మవాళ్ళు హైదరాబాద్ లో నే వుంటున్నారని నాన్న చెప్పాడు…. అని చెపింది. నేను ఆ అవును ఊరినుండి వచ్చేశారు అని నిట్టూర్పుగా చెప్పాను. ఊరు చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారి కళ్ళముందు కనిపించి… కళ్ళు కన్నీటితో కప్పుకున్నాయి..
సుధ మాట్లాడుతూనే వుంది… పుష్ప మనం ఐదుగురం ఎల్లుండి మన వూళ్ళో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కలేస్తున్నాం అంటూ ఒక తీపి కబురు చెప్పింది సుధ. అలానే కాసేపు ఒకరి యోగ క్షేమాలు ఒకరం అడిగి తీసుకొని మాట్లాడుకున్నాం. సరే ఇక అల్పాహారం తాయారు చేయాలి వుంటాను అంటూ ఫోన్ పెట్టేసింది. నన్ను ఏవేవో ఊహలుఆవహించాయిఅందులోనుండి తేరుకొనే లోపే మావారు వచ్చి ఏమండి శ్రీమతి ఈరోజు అల్పాహారం ఏంచేస్తున్నారు అనగానే తేరు కొని అప్పుడు రాగిసంగటి చేయటం మొదలెట్టాను అది చేయడం అయిపోయింది. అందరం కూర్చొని తిన్నాము అన్నమాటే కాని నా మనసు అవధులు దాటి ఆలా విహరించి మావూరు చుట్టూ జ్ఞాపకాలతో చుట్టేసుకుంది. అంతలో మావారు ఇందాక ఫోన్ లో ఎవరోయ్ అంత సేపు బాతకాని పెట్టావు అన్నారు. హా….. మా చిన్ననాటి స్నేహితురాలు సుధ.ఎల్లుండి చిన్ననాటి స్నేహితులం అందరం మావూళ్ళో సుధ వాళ్ళ ఇంట్లో కలుద్దామని చెప్పింది. ఇరవై సంవత్సరాల తరువాత కలవబోతున్నాము అంటూ నా ముఖంలో మతాబుల వెలుగు చూసి సరే వెళ్ళిరా అన్నారు అయన. ఆమాటకి నా ఆనందానికి అవధుల్లేవు అలానే ఊహల్లోమునిగి తేలుతూ వంట పూర్తిచేసా అలా రెండు రోజులు గడిచాయి. నా ఆలనా, పాలనా నా అల్లరి మాకుటుంభంతో తో పాటు నన్ను ఆదుకున్న ఊరు అచ్చంగా పల్లె పచ్చని చీరకట్టి నట్టు నండూరి ఎంకిలా వుండే నావూరును మళ్లీ చూడబోతున్నాను అనే ఆలోచనల మధ్య పని పూర్తి చేసుకొన్నాను ఇక ఊరు బయలుదేరే టైం వచ్చేసింది. పిల్లకి అత్తయ్యకి అన్ని చెప్పి వంట పూర్తయంది మళ్లీ పెందలాడే వస్తాననిచెప్పి
తాను ఆఫీస్ కి వెళుతుంటే తనతో బయలుదేరి బస్సు స్టాండ్ లో దిగి తనకి బాయ్ అని చెప్పాను అంతలో మెదక్ బస్సు ఎదురు పడింది ఏవో జ్ఞాపకాలతో బస్సు ఎక్కాను కాలిగా వుంది నాలుగవ సీటు అద్దం వైపు కూర్చున్నాను. అంతలో కండక్టర్ వచ్చి టికెట్ ఎక్కడి కమ్మా అన్నారు ఇరవై ఏళ్లలో ఒక ఆరు సంవత్సరాల లో చెల్లీ పెళ్లి కి మధ్యలో కోన్నిసార్లు వెళ్లి వుంటా మావూరికి. అని మనుసులో అనుకుంటూనే వడియారం అండి అన్నాను అప్రయత్నంగా సరే అంటూ టికెట్ ఇచ్చాడు. అప్పటికే చాలామందిబస్సు ఎక్కారు జనాలతో నిండి పోయింది బస్సు అంతలో డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసాడు. కిటికీ లోంచి బయటకు చూస్తూ సుధ, సునీత, సుజాత, విజయలక్ష్మి ఇప్పుడు ఎలావున్నారో వాళ్ళతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది నన్ను గురుతు పడుతారో లేదోనని ఏవేవో ఊహలు నామదిని తొలుస్తుండగానే బస్సుకండక్టర్ తూప్రాన్వచ్చింది అనగానే నాగుండె స్పందన ఆనందంగా వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. అక్కడనుండి పదిహేను నిముషాలు మాత్రమే ఉంటుంది వడియారం అని అనుకునేంత లోపలనే ఆఊరి చల్లని గాలి నన్నుపలకరించడం
మొదలెట్టింది. బస్సు బస్ స్టాప్ లో ఆగగానే నేనువెంటనే దిగాను. నేను నేనుగా లేను ఆ బస్సు స్టాప్ చూడగానే చిన్న నాడు అమ్మా నాన్న లతో నేను ఊరికి వస్తా నని మారాము చేయడం. వారు నన్ను బుజ్జగించి అక్కడే వున్న కిరానా కొట్టులో నిమ్మకాయ పిప్పరమెంట్లు ఇప్పిచ్చి ఇంటికి పంపడం చిన్న నాటి జ్ఞాపకం ఒక్కసారి కళ్ళముందు మెదిలింది. ఆలాఆ నిమ్మకాయ పిప్పర్మెంటు జ్ఞాపకాన్ని ఆస్వాదిస్తూ నడుచు కుంటూ వెళ్తున్నాను పక్కనే నేను చదువుకున్న బడి కనిపించింది
నాహృది నా మది ఒక
ఊసూచెప్పింది
అదివిని నామనసు ఉరకలు వేసింది బస్సు కంటే ట్రైన్ కంటే వేగంగా మనసు వెళ్ళింది.. పాఠశాల గేటు నాతో ఎన్నో చిన్ననాటి ముచ్చట్లుచెప్పింది.
అదిదాటి వెళుతుంటే గంట నను పిలిచింది అది మసులో మోగింది పలుమార్లు నాపాఠశాల చిత్రాలు విచిత్రాలతో.
ఆఫీసు వైపు చూడగానే అదిరిపడ్డానేను ఎన్నో మార్లు తెలియక చేసిన చిన్న చిన్న తప్పులకు దండనలు నేర్పిన పాఠాలు గురుతొచ్చాయి
క్లాస్ రూమునన్ను కవ్విస్తూ పిలిచింది సోపతి గాళ్ళతో చేసిన అల్లరిని మెల్లమెల్లగా నాకు చెవిలోన వేసింది అదివిని నామనసు ఆనందంగా నవ్వింది
అటునుంచి నా కన్ను గ్రౌండ్ పైనిలిచింది కబడ్డీ కూతలు కోకో కోర్టులు రా రమ్మనినన్ను రమ్యముగా పిలిచి ఆనాటి ఆటలనునా మనసుతో ఆడుకున్నాయి
తుమ్మ చెట్టు కొమ్మలు ననుచూసి మిలమిల నవ్వాయి మా ఐదుగురు స్నేహితులం లంచ్ అక్కడే చేసేవాళ్ళంఅందుకే ఆచెట్టు లంచు డబ్బాలో తొంగి తొంగి చూసి లోలోనమురిసిపోయంది.
బడిలోన ప్రతిచెట్టు ప్రతి పుట్ట ఈనాటి ఎదుగు దలకు ఆనాటి సోపానం అనిగురుతురాగానే మిగిలాయి ఆలా ఆ జ్ఞాపకాలను దాటి వెళుతుంటే ఆంజనేయస్వామి గుడి కనిపించింది అప్పుడు అక్కడనేను నిలబడి చూస్తున్నానుఅంతలోనామ నసు లో ఓక చిన్న మెరుపు మెరిసింది నేనుపది సంవత్సరాల వయసులో బతుకమ్మ పండగకి నేను లంగా ఓని కావాలని మారాము చేస్తే అమ్మా కుట్టిస్తే అమ్మతో నేను బతుకమ్మ తీసుకోని వస్తే అందరు నన్ను చూసి నవ్వుతుంటే నేను అమ్మకొంగు పట్టుకొని అమ్మవెనుకాల దాచుకున్న రోజు గుర్తుకు వచ్చింది వెంటనే నాకళ్ళలో నవ్వులు వెళ్లి విరిశాయి. అలానే ఎన్నో జ్ఞాపకాలతో ఆలా ముందుకు వెళుతుంటే నాకాళ్ల ని ఒక్కసారి ఎదో ఆపింది అని పించింది. చూస్తే మా ఇల్లు నన్ను ఒక్కసారి కౌగిలించు కొన్నటు నా జ్ఞాపకాల పొదరింటిని ఆయిల్లు మేలుకొలిపింది వెంటనే లోపలికి వెళ్ళాను మాఇంటిలో పెద్ద గచ్చు దాని చుట్టూ పది మొగరాలు అదిచూడగానే నా మనసు ద్రవించింది నేను చెల్లీ అన్నయ్య అమోఘరాల చుట్టూ వురుకుతూ ఆడుకొనే ఆటలు నన్ను చుట్టేసాయి. అటు నుంచి వంట గది లోకి వెలితే అక్కడ అమ్మని కూరల కోసం బాధించిన సిల్లీ విషయాలు మాకుంభం లోని అందరము కూర్చొని భోజనం చేసిన దృశ్యం నాకళ్ళ ముందు మెదలి నాకు ఊపిరి ఆడకుండా చేసింది. అందులో నుండి తేరుకుంటూనే పెద్దగది మేము అందరం నిదురించే గది నాన్న నేర్పించిన ఎన్నో పాటలు, ఎన్నో స్పీచ్ లో ఎన్నో కథలు నా కళ్ళముందు మెదిలాయి. అంతలోనే సునీత, సుధా విజ్జి సుజాత వెననుండి వచ్చి కళ్ళు మూసారు. వెంటనే నేను తేరుకొని,ఏబాగున్నారనే అనిఅనగానే వెంటనే అందరు నన్ను కౌగిలించు కొని ఒకరినొకని చూసుకొని సుధ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా వాళ్ళని కలిసాము.భోజనాల సమయం అవుతుంది అంటూ అంతలో అంటి రాకరకాలకురాలతో భోజనం వడ్డించింది. భోజనాలు పూర్తి చేసి. ఇక ప్రపంచాన్ని మరిచిపోయి
చిన్ననాటీ జ్ఞాపక ప్రపంచం లోకి వెళ్ళిపోయి చిన్ననాడు ఆడుకున్న చరిపత్తర్, దాగుడుమూతలు, తొక్కుడు బిళ్ళ ఆడుకొన్నపుడుమేము గెలిస్తే విజ్జి అలిగి కూర్చోవడం మేము దాన్ని మళ్లీ చక్కిలి గింతలు పెట్టి నవ్వించడం,మానవ్వులతో పంచుకొన్నాము. ఎండాకాలం అందరము కలిసి పొలాల వెంట వెళ్లి మామిడి పళ్ళు తిన్న తీపి జ్ఞాపకాలను, అందరం కలిసి ఇంటిముందుకు వెళితే, ఆగచ్చు గచ్చకాయలు అ క్కడ ఆడిన గురుతులు ఇవే అన్నట్టు చుస్తున్నాయనిపించింది మమ్మల్నిఆలా పలకరించిందనిపించింది.చిన్నపుడు టవల్ చీరలాగా వేసుకొని చిన్న చిన్న పావులతో వంటచేసి వడ్డించే ఆటలు గుర్తు చేసుకున్నాము. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, మళ్లీ కలిసి ఆడుకోవడాలు,పెద్దయ్యాక ఒకరొకరి పెళ్లిళ్లు అయితే ఉండలేక కన్నీళ్లు పెట్టుకోవడాలు గుర్తుకు వచ్చి అందరి కళ్ళలో ఆనంద బాష్పలు మెదిలాయి. అది తేరుకొనేసరికి సమయం నాలుగు అయ్యింది. వెంటనే అందరం ఇక వెళుదామని లేచి బస్సు స్టాండ్ కు వచ్చి అజ్ఞాపకాల వజ్రాలు మాగుండెలో పదిల
పరుచుకొనిఒక్కసారి ఒకరినొకరం కౌగిలించుకొని బస్సు ఎక్కిఆవూహలని నెమరువేస్తూ ఇంటికి చేరుకొన్నాను. మళ్లీ మాకుటుంభంలో కలిసి రాత్రి భోజనం చేసి మావారితో నాజ్ఞాపకాలను పంచుకొని అక్కడ జరిగిందంతా చెప్పి ఆనందంతో పడుకున్నాను…..
తెల్ల వారింది అంత మాములే మళ్లీ ఇదండీ నాజ్ఞాపకాల కథ

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!