కరెంటు కష్టాలు

కరెంటు కష్టాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

ప్రకృతి మీద ప్రేమ పెరిగి
బాధ్యత యని గుర్తెరిగి
పర్యావరణ పరిరక్షణకై
సెల్లు ఫోను వదిలేసా
లేండ్ ఫోన్ పెట్టించా
చీటికి మాటికి లేచుటెందుకని
కార్డ్ లెస్ ఫోనూ కొన్నా
పెట్రోల్ డీజిల్ వద్దని
స్కూటర్ కారు అమ్మేసా
కరెంటు వాహనాలు కొనేసా
ఇప్పుడేమో ఛార్జింగ్ కోసం
కరెంటు ఉండనే ఉండదు
కదలాలంటే కష్ట మాయె
ఫోనుకి కూడా దూరమాయె
సోలార్ విద్యుత్ పెట్టాలంటే
తలకి మించిన భారమాయె

You May Also Like

9 thoughts on “కరెంటు కష్టాలు

Leave a Reply to rajeshwar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!