D/o మల్లిఖార్జునరావు

D/o మల్లిఖార్జునరావు

 

రచయిత:బుజ్జమ్మ


మళ్ళీ ఆడపిల్లేనా అంటే..
నా పోలికలేనమ్మా అంటూ 
నాన్నమ్మ నోటికి తాళం వేసిన 
నాన్న గురించి ఏమని చెప్పను…

నాన్న అద్దంలో చూస్తే..
నేను కనిపిస్తానని అమ్మ అంటుంటే
పోలికలేమో అనుకున్నా.. కానీ
తన మనసు అద్దం నేననే గర్వం ఎలా చెప్పను..

తర్వాత పుట్టిన తమ్ముడి కన్నా…
తనకి నేనే ఎక్కువ ఎందుకో..
ఎప్పటికి అర్దం కాని ఆ అనుబంధం 
ఎంత అపురూపమో ఎలా నిర్వచించగలను..
 
బయటకు వెళ్ళను అంటే..
భయపడుతూ ఉంటే ఎలా అంటూ..
బండి నేర్పించి మరీ పంపిస్తుంటే..
బ్రతుకు బాటలో ఇచ్చే భరోసాని ఎలా తెలుపగలను..

అందరూ పిచ్చి మారాజు అంటుంటే..
నలుగురికీ మంచి చేసే మనసున్న
ఆ పసిపిల్లాడితో ఆటలు ఆడుకునే
ఆ సంతోషాలను ఏ పదంతో రాయగలను

ఎలా ఉన్నా.. ఏం చేసినా..
నాలో అమ్మని చూసుకుని..
తనే నా బిడ్డలా మారిపోయే
మకుటం లేని ప్రేమ మారాజు 
మా నాన్న మల్లన్న అంతే…
నాన్న కూతురిగా నేను ఇంతే…!

You May Also Like

6 thoughts on “D/o మల్లిఖార్జునరావు

Leave a Reply to Gowthami Rayala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!