ధ్యేయం

ధ్యేయం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కె.కె.తాయారు

ఇప్పుడు పదవ తరగతి పరీక్ష అయింది కాబట్టి ఏం ఆలోచిస్తున్నావు? తర్వాత ఏం చేస్తావు? నీ ఉద్దేశం ఏమిటి? అని అడిగితే సమాధానం ఉండదు కదా!
ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు చేతిలోంచి జారిపోతారని అతి భయంతో, ఇంకా అతి జాగ్రత్తగా, వాళ్ళని తమ చేతుల్లోనే ఉండాలని పెంచుతారు. అంచేత విద్యార్థులకి, ఆలోచించటానికి, అదే తమ గురించి ఆలోచించుకోవడానికి అవకాశం ఉండదు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏదైనా తినిపించే పదార్థం ఉంటే స్పూన్ తో తినిపిస్తారు కదా! అలాగా వీళ్ళ ప్రవర్తన కూడా బందీకృతం చేస్తారు, స్వేచ్ఛ ఇవ్వరు.
నా విన్నపం 15 సంవత్సరాలు వచ్చి తర్వాత దీని , అర్థం ఏమిటో తెలుసుకోవాలి తల్లిదండ్రులు. జీవితంలో నాలుగు దశలు ఉన్నాయి. ఒకటి బాల్యం, రెండు యవ్వనం, మూడు కౌమారం, నాలుగు వృద్ధాప్యం. ఈ దశలు దృష్టిలో పెట్టుకొని ఎదుగుతున్న ప్రతి సంవత్సరం నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, ముందడుగు ఎలా వెయ్యాలి, అని నేర్పించాలి. ఎందుకంటే జీవితం మనకి చాలా ముఖ్యమైనది. అందుకే మనం మంచి, చెడులు విభజన చేసుకొని, ఉన్నతికై ప్రతి అడుగు ఆచీ, తూచి వేయాలి. తప్పుడు ఆలోచనలు తప్పట అడుగులు ఉండకూడదు. మధ్యలో మనకి కలిగిన సజ్జన సాంగత్యం మంచికి దారి తీస్తుంది. అదే దుర్జనులు సహవాసం అయితే చెడుకి దారి తీస్తుంది. వీటిని కాపాడుకుంటూ విలువైన కాలం బంగారు బాటలో నడిపించడమే మన ధ్యేయంగా పెట్టుకొని ముందుకి అడుగు వేయాలి.
ఎప్పుడూ కూడా అర్జునుడికి, ద్రోణాచార్యులు వారు చెప్పారు కదా! బాణం వేసినప్పుడు పక్షి కన్ను మాత్రమే నీకు కనిపించాలి మిగిలిన చైతన్యవంతమైనవి నీకు కనిపించకూడదు అని, అటువంటి ఏకాగ్రతతో, దృఢ చిత్తంతో ధ్యేయాన్ని అందుకోవాలనే ప్రయత్నం మనకి అకుంఠిత విశ్వాసంతో పాటు, అద్వితీయమైన విజయాన్ని కూడా చేకూరుస్తుంది. అందుకే ఏ పని చేసినా మనకి ధ్యేయం ముఖ్యం. దానికోసం శ్రమపడి ముందుకి ఎదగాలని ఆశ తప్పు కాదు. ఎదగవచ్చు కానీ ఇతరులకు ఎటువంటి కీడు మనం తలపెట్టకూడదు. ఎందుకంటే మనం మన బాగోగులను, మనకి ముఖ్యం అని మర్చిపోకూడదు. అనుకున్నది పొందాలని ఒక పరిపూర్ణమైన నిశ్చయమే ధ్యేయం అందుకు మనం ఎప్పుడు సన్మార్గాన్ని అవలంబించాలి. సద్బుద్ధి అన్నిటికీ మించి, మన బుద్ధి దినం దినం ప్రవర్థమానమైయ్యేట్టుగా ఉండాలి. అలాంటి పరిస్థితి కావాలంటే సద్గురువుల ఆలంబన కావాలి.
దేనికి ఏమైనా మన సత్శీలత మనకు శ్రీరామరక్ష. మనం నిర్ణయాన్ని సరియైన మార్గంలో ఆలోచించి పెద్దల ఆశీర్వాదంతో వాళ్ళ నిశ్చయంతో ధ్యేయాన్ని నిర్ణయించుకోవాలి. అలా ముందుకు అడిగేస్తే ఎన్ని అద్భుతాలు ఎంతమంది ఆశీర్వచనాలు, ఎందరి పొగడ్తలు అన్నిటికీ మించి మంచి విజయఫలం. జీవితాన్ని సంతోషాన్ని నింపే గమ్యానా తప్పక తీసుకెళ్తుంది. నీ ధ్యేయం పరిపూర్ణత, ఇది ప్రతి ఒక్కరికి అవసరం తప్పక ఆలోచించి ఆచరించాలి. తెలియకపోతే ఉద్బోధ చేసి నేర్పించాలి మంచి మార్గంలో నడిపించడం, ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు, గురువులు, స్నేహితులు అందరిదీ. ఆశించిన విజయఫలం అందినప్పడు. ఆవ్యక్తీ మాత్రమే కాదు. అందరూ బంధుమిత్రు సహోదరులు గురువులు, సంఘం, సమాజం, ఆఖరికి దేశం కూడా కీర్తిస్తుంది నీ ధ్యేయానికి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!