బాంధవ్యాలు

బాంధవ్యాలు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

తల్లిదండ్రులు పిల్లలను ఎంతో అపురూపంగా పెంచి వారి ఎదుగుదలకు ఎంతో తోర్పడతారు. వారి ఆశలన్నీ పిల్లల మీదనే పెట్టుకొని పుట్టినప్పటి ఒక స్థాయికి వచ్చేవరకు పిల్లల చేయి పట్టుకొని నడకను నేర్పిస్తూ మంచి మాటలతో జ్ఞానాన్ని బోధిస్తారు. పుట్టగానే వారికి వారే ఎదగరు. తల్లిదండ్రులే వారి ఎదుగుదలకు కారణమవుతారు. మంచి చెడ్డలలో నీడలా తమ వెన్నంటే ఉంటారు. పెద్దయ్యాక. ఇది గుర్తించరు. మాకు మేమే ఎదిగాము, మేమే కష్టపడ్డాం అంటూ తల్లిదండ్రులకు ఇతబోధ చేస్తారు. స్కూల్లకి పిల్లల బ్యాగులను మోసుకుంటూ తీసుకువెళ్తారు కూడా పిల్లలకు ఎక్కడ బరువు అవుతుందోనని భుజాన వేసుకుని వెళ్ళేది తల్లి! స్కూల్ నుండి ఉద్యోగాలు వచ్చేవరకు తల్లిదండ్రుల దయాభిక్షనేనని మర్చిపోవద్దు. రెక్కలు ముక్కలు చేసుకొని తిండి, తిప్పలు అనక నిద్రలేని రాత్రులు గడిపి కష్టపడి పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మంచి వృద్ధిలోకి రావాలని పడని అగచాట్లన్నీ పడుతూ కష్టపడి చదివిస్తారు. చిన్నప్పుడు ఎంతో వివేకవంతుల్లా వారిని అనుసరిస్తూ బుద్ధిమంతుల్లా ఉంటారు. ఉద్యోగాలతో రెక్కలు వస్తాయి. తల్లిదండ్రులు పరాయివారైపోతారు. వారు చేసిన కష్టం మర్చిపోతారు. ఎన్ని మాటలు అన్న నా పిల్లలే కదా! అనుకుంటూ ఓపికతో సహిస్తారు. పెళ్లి చేసుకొని స్వతంత్రులైపోతారు. నా కుటుంబం అంటారు. అప్పుడే నీ, నా అనే తేడాలు కూడా వస్తాయి.
అప్పుడు తల్లిదండ్రులకు ఏమీ తెలియదంటూ, మా పురుషార్థమే అనుకుంటూ కన్ను మిన్ను కానరాకుండా తల్లిదండ్రుల విలువలను మర్చిపోతారు. తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టు దూషిస్తారు. ఇప్పుడు అలా చూస్తూనే ఉన్నాము. తల్లిదండ్రులు ఏదన్న పిల్లల బాగు కొరకే అంటారని ఏది అనుచితంగా అనరని తెలుసుకోవాలి. మనకు కనిపించే దైవాలు మన తల్లిదండ్రులు. ఎప్పుడు ఆ కృతజ్ఞత మర్చిపోవద్దు. ఇంకా కొంతమంది ఇండ్లలో తల్లిదండ్రులు ఏదో అన్నారని అలిగి ఇంట్లోంచి వెళ్లిపోవడం ఆత్మహత్యలకు పూనుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ మధ్యలో చాలా సంఘటనలు మనం చూసాం కూడా, ఇలాంటి ఆలోచనలు శాడిజం లాంటివి తల్లిదండ్రులు అంటే మన మేలుకొరకే అంటారని గుర్తించాలి. మనం ఏమైనా తప్పు చేశామా! ఎందుకు అంటున్నారనే విషయం అర్థం చేసుకోకుండా, మన తప్పును కప్పిపుచ్చుకొని తల్లిదండ్రులపై రుద్దేస్తున్నారు. ఈ చిన్న వయసులలో కూడా ఇలాంటి ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. మీ ఆలోచనలు తల్లిదండ్రులకు వివరంగా చెప్పాలి. అర్థం చేసుకునే దాకా ఓపికగా నచ్చచెప్పాలి.
తల్లితండ్రులు కూడా ఒక్కొక్క టైంలో ఆవేశంతో ఏదో ఒక చిన్న మాట అంటారు. నాన్న మీరు ఇలా అన్నారు ఇది నాకు నచ్చలేదు అంటూ మీ అభిప్రాయాన్ని ధైర్యంగా తండ్రితో చెప్పాలి. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచిస్తారు వారికి ఆ ఆలోచన కల్పించాలి. తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. తండ్రి పిల్లల మధ్యలో అభిప్రాయ భేదాలు దూరవుతాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించండి? తల్లిదండ్రులు ఏమన్నా పిల్లలు తొందరపడి ఏ చెడు ఆలోచన రానివ్వకండి, మంచి నడవడిక నేర్చుకోండి తల్లిదండ్రులకు బాధను మిగిలించకండి. తల్లిదండ్రుల్లారా, పిల్లల్లారా కొద్దిగా ఆలోచించండి. ఇప్పుడు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పిల్లల్లో కూడా మార్పులు మనం చూస్తూనే ఉన్నాము. పిల్లలని మనం గౌరవిద్దాం, మీ కుటుంబం కూడా విచ్చినం కాకూడదు అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇదే నా అభిప్రాయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!