జలధార

పుడమిని తాకడానికి శిఖరం అంచు నుంచి జాలువారే పాల ధార…

వంపుసొంపుల వయ్యారాలతో భూమిని తాకే నీటి ధార…

ఉదయపు కిరణాలతో బంగారంలా తళ తళ లాడే కిరణ ధార…

వెన్నెల కాంతిని పూసుకొని వెండి ధారలా మెరుస్తోంది…

వాగులవంకలను కలుపుతూ సెలయేరులా పారే జలపాతం…

అందరి చూపుని తనవైపు తిప్పుకుని

పచ్చని చెట్ల నడుమ పారే నీటి ప్రవాహం నయనానందం…

కొండలు లోయలు దాటుతూ పారే అందాల జలధార స్వచ్చని తెల్లని నీళ్ళ ఝరి…

చిన్ని చిన్ని కొండలని తాకుతూ రెండుగా చీలిన మళ్లీ ఏకమై పారే నిర్హరి…

సూర్య కిరణాలు తాకి ఇంద్రధనస్సుని ప్రతిబింబించే జలధార…

జంతువుల దాహాన్నితీర్చే ఝరి ఆ ధార…

ప్రకృతి అందాలను పెంచి చూపరులను కట్టిపడేస్తుంది…

                                                                                                                        కొఠారి అనూష

You May Also Like

3 thoughts on “జలధార

Leave a Reply to Swapnika balaji Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!