కొంత మంది

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

కొంత మంది

రచయిత :: రమాకాంత్ మడిపెద్ది

యాంత్రిక సరళికి అలవాటు పడి
ఇప్పటి తరం జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు
ఊపిరి ఆడని ఉద్యోగం
క్షణం కూడా తీరిక లేనంత రద్దీగా మారిన నాగరిక జీవితం
చిన్న వయసుకే భాద్యత భవిష్యత్తు అంటూ వయసుకు మించిన బరువును మోస్తూ
సాంకేతికంగా ఎంత ఎదిగినా
మానసికంగా ఇంకా పసిపిల్లలు గా ప్రవర్తిస్తూన్నారు
సన్నిహితులకు దూరంగా
సామాజిక మాధ్యమానికి చాలా దగ్గరగా బతుకుతూ
ప్రపంచంలో ప్రతి దానికి డబ్బే మూలమని డబ్బుంటే ఏదైనా ఏమైనా ఏ క్షణంలోనైనా పొందొచ్చు అని అర్థం లేని వేదాంతంలో
వాళ్ళని వాళ్ళే మేధావులుగా ఈ క్షణం కళ్ళముందు ఉన్న నిజాన్ని వదిలేసి
కనిపించని అబద్ధాన్ని నమ్ముతూ
అగుపించని దూరాన్ని అంచనా వేస్తూ
నేలపై అవకాశాలు వదిలి
ఆకాశానికి నిచ్చెనలు వాల్చి
గెలిస్తే గర్వంతో ఎక్కిన మొదట మెట్టును మరచి
ఓడితే జీవితమే వ్యర్థమని తలచి
మరేజీవిగా కాకుండా మనిషిగా పుట్టడం ఒక వరమనే విషయాన్ని మరిచి చేతులారా తమ బంగారు భవిష్యత్తును బలి చేసుకుంటున్నారు.
పోతే తిరిగి రాని కాలమనే స్నేహితుణ్ణి కలల గుమ్మం అవతలే విడిచి విశేషమైన జీవితాన్ని లోటు లోపంతో అన్న పేరుతో నిషేశంగా నిస్సారంగా వెళ్లదీస్తున్నారు.
కొంతమంది 21 వ శతాబ్దపు నవ యువత…

You May Also Like

2 thoughts on “కొంత మంది

  1. ఈనాటి కాలానికి సరియిన మాటలు… సూపర్ రమాకాంత్

Leave a Reply to నాగరాజు Deva Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!