మస్కటు పోయిన మల్లేశం

మస్కటు పోయిన మల్లేశం

 

పల్లెను మరిచి మస్కటు పోయిన మల్లేశం కథ ఇది,,,,,

→కొక్కోర కో అని  కోడి కూత విని లేచాడు మల్లేశం తండ్రి

మల్లేశం కు కూడా నిద్ర లేపాడు తండ్రి,,

ఎందుకు నాన్న  నన్ను ఊరికే విసిగిస్తావ్ అనుకుంటూ నిద్ర లేచాడు,,మల్లేశం

ఇంటి దగ్గర పనీ చేసుకొని 8:00 గంటలకి ఇంటి ముందు ఉన్న ఆవులను తీసుకొని పొలానికి వెళ్ళాడు మల్లేశం నాన్న ,,   వెళుతూ వెళుతూ నువ్ కూడా రారా మల్లేశం   పొలం కాడ చల్లటి ఏ0డ  ఉంటది ,,అని అన్నాడు

చల్ నెన్ రాను  పొలం లేదు   గిలం లేదు  అని కోపంగా అరిచాడు మల్లేశం,,

నేను వెళ్లిపోత  నాకు ఈ ఊర్లో  వుండబుద్ది కావడం లేదు అని  చెప్పాడు తన తండ్రితో

”మల్లేశం తండ్రి ఇలా అన్నాడు” ఒరే కొడకా మల్లేశం పల్లెనిడుస్తే పానమిడిషి నట్టే రా!ఉన్న ఊరు కన్నా తల్లి లాంటిది రా!ఎక్కడికెళ్లినా పల్లెతనం దొరకదు రా!ఎక్కడికెళ్లినా తల్లి తనం కూడా రా!అక్కడికెళ్తే తిట్టే వాళ్లు కొట్టే వాళ్ళు ఉటారు రా!ఇక్కడ నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు రా!అని బుజ్జగించాడు మల్లేశం వాళ్ల నాన్న

నాకేం చెప్పకు నాన్న నెన్ వెళ్తున్న అని ….బయల్దేరాడు మల్లేశం

హైదరాబాదు బస్సు ఎక్కి బయల్దేరాడుహైదరాబాదు నుండి మస్కటు కు వెళ్ళిపోయాడు ..మల్లేశంమస్కటు కు వెళ్లిన  మల్లేశం బిత్తర చూపులు చూస్తున్నాడు.మల్లేశం బిత్తర చూపులను గమనించిన అక్కడున్న బ్రోకరు గాడు గమనించాడు.

మల్లేశం దగ్గరకు వచ్చి సర్ మీకేమైనా పని ఇప్పించాల అని అడిగాడు బ్రోకరు

హ ఒక పని కావాలన్న అని అన్నాడు మల్లేశం

ప్రస్తుతం నీకు ఏమి పని లేదు ఇప్పుడు ఉన్న పని బస్టాండులో బాత్రూమ్ కడిగేటళ్లకు ఓనర్ పనులు చేయించాలి,,,,ఒక్క పది రోజులకి   నీకు దగ్గట్టు పెద్ద జాబ్ ఇప్పిస్తా   ,,,నీకు జాబ్ రావాలంటే 10000 ఖర్చు అవుతాయి అని బ్రోకరు అన్నాడు

అన్న నా దగ్గర 10000 రూపాయలు మాత్రమే ఉన్నాయి  నికిస్తే నేనెలా ఉండేది అని అన్నాడు మల్లేశం,,,,

నీకు రోజుకి 1000 రూపాయలు వస్తాయి 10 రోజులకి 10000 లు వస్తాయి తరువాత నేను నీకు మంచి జాబ్ వెతికి పెడుతా అని మల్లేశం కు మురిపించి డబ్బులు తీసుకొని మెల్లేశం కు ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు బ్రోకరుగాడు

తెల్లవారిన నుండి పనికి వెళ్లాడు అక్కడికి వెళ్ళేసరికి దాదాపు వంద బాత్రూం లు ఉన్నాయి యాబై అరవై మంది సపయిలు వున్నారు ,,,అక్కడికి ఒకడు తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకొని వచ్చాడు వాడే విల్లా అందరికి ఓనర్ ,,,,అతని దగ్గరికి వెళ్ళాడు మల్లేశం.    సర్ నా పని అని అడిగాడు ,,చిపిరి కట్ట ఇచ్చి  పినాయిల్ డబ్బా ఇచ్చి  వెళ్ళు.    బాత్రూం లు కడుగుపొ అన్నాడు ,,,ఎందుకు సర్ అని అన్నాడు మల్లేశం,,,, నువ్వు అందరికి హెడ్ అనుకోని వచ్చావా ,,,,చేయరా పని చెయ్ అని ,, తిట్టి ముడ్డి మిద తన్నాడు వాడు మల్లేశం కు

దుఃఖం తో మల్లేశం ఆ కంపు బాత్రూం లు కడుగుతూ ,,,తండ్రి నీ గుర్తు చేసుకున్నాడు  10 రోజులు అయిపోయింది ,,,బ్రోకరు  గాడు రాలేదు   వాడి నంబర్ కలువను లేదు

మల్లేశం తండ్రికి ఫోన్ చేసాడు

నాన్న నేను మల్లేశం మాట్లాడుతున్నాను ,,నువ్వు చెప్పిన మాట వినలేదు పల్లె అందాలను మరిచి ,,,ఈ కంపు బాత్రూం లల్ల పని చేస్తున్నాను నాన్ననా పల్లె తల్లి ని వెక్కిరించాను నాన్న

నన్ను క్షమించి  నా తల్లి దగ్గరకి పిలుచులో నాన్న అని అన్నాడు నా పల్లె ను వీడి ఏ బతుకు బతకలెను నాన్నా అని అన్నాడు మల్లేశం.

రచయిత :: రాజెల్లి సాయికృష్ణ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!