నా ప్రేమ రేపల్లేలో

నా ప్రేమ రేపల్లేలో .

          అవును ఏమో,నిజం ఏమో!

          ఇలకు జారిన నెలవంక ఏమో.!

                       తురుపున ఉదయించిన రవికిరణం.!

          ఆమె నుదిటిన సింధురమై.!

          నను తన నీడ గా నడిపింది ఏమో.!

          ఆమె కనులలో కనిపించే కాంతికి!

          వెన్నెలే అసూయపడెను ఏమో!

          ఆ బ్రహ్మదేవుడే నా కోరకై  మలిచిన

          నవ లావణ్యమేమో.!

          ఈ సుందరి సుకుమారి.

          పచ్చందలా పూ బోణి.!

                   తన కాళి మువ్వల సవ్వడికి.

          నా ఎదచప్పుడు జత కలిసి.

          మయూరమై నర్తించేనెమో.!

          ఈపల్లె లో చిలిపి అల్లరి చేస్తూ.

          చిలిపి చిరుగాలికి పోటీ పడుతూ.

          నా కోసం ముస్తాబైంది ఏమో!

 

కార్తీక దీపాల వెలుగులో  తనని మొదటిసారి చూసినప్పుడు నా మనస్సు చెప్పిన ఊసులు అన్ని,ఇన్ని కాదు. ఆ చిరునవ్వులు నా సొంతం కావాలని నా ఎదచప్పుడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆమె మోము చంద్రబింబం లా నా కలల్లో మెదులుతూ నను నిద్రపోనివ్వడం  లేదు రా.

తనది రేపల్లె మా మేనత్త ఊరు . మొన్న కార్తీకపౌర్ణమి కి ,అత్త వాళ్ళ ఇంట్లో నోములు ఉంటే వెళ్ళాము రా అక్కడ గుడిలో చూసా ఆమెను. చూడగానే ఆమె నా పక్కన జీవితం అంతా ఉంటే బాగుండును అనిపించింది. కానీ ఆమెతో మాట్లాడాలి అంటేనే భయం వేసింది రా.! ఆమె నన్ను కన్నెత్తి కూడా చూడలేదు.ఇక ఆమె తో ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు. పోనీ రెండు రోజులు ఉండి తనతో ఫ్రెండ్షిప్ చేద్దాం అంటే. అమెరికా ప్రయాణం రెండు రోజుల్లోనే,అని భయలు దేరి వచ్చేసాము. ఇప్పుడు నా వల్ల కావడం లేదు రా తనని మర్చిపోవడం. అని నేను రవి కి చెప్పినప్పుడు.

వాడు ఎందుకు రా మర్చిపోవడం. ఎలాగూ నీకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు అన్నావ్ కదా! మీ మేనత్త ఊరే కదా! మీ అత్త నీతో  ఫ్రెండ్లీ గా ఉంటుంది అన్నావ్ కదా!

ముందు ఆవిడకి ఫోన్ చేసి,నీ ప్రేమ విషయం ముందు ఆవిడ తో చెప్పి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడమను! నువ్వు మీ పేరెంట్స్ తో చెప్పు. అంతే..!

హా అవును ఈ ఐడియా బాగుంది. కానీ, ఆ అమ్మాయి మా అమ్మకు నచ్చాలి కదా! నీకు తెలుసు గా మా అమ్మకు అంత తేలికగా ఎవ్వరూ నచ్చరు. పైగా ఆ అమ్మాయి కి నేను కూడా నచ్చాలి కదా!

ఒరేయ్ ఫూల్ ..! నువ్వు నచ్చని వాళ్ళు ఉంటారా! నువ్వు ఏమి ఆలోచించకుండా నే చెప్పినట్టు మీ అత్తకు ఫోన్ చెయ్యి ముందు.

వాడు చెప్పిన మాటలు మంత్రంగా పనిచేశాయి నాకు!.

నేను అత్త కు ఫోన్ చెయ్యడం. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడటం. అమ్మ వాళ్ళ కి కూడా తను నచ్చి మా పెళ్ళి జరగడం అంతా రెండు నెలలోనే జరిగిపోయింది.

ఆ అక్షరాలను చదువుతున్న “స్నేహకి “ఒక పక్క బాధతో కన్నీళ్లు వస్తున్నాయి.  ఒక పక్క సంతోషంతో మాటలు రావడం లేదు. అవినాష్ నన్ను ప్రేమించి,నా కోసం అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా! అంత ప్రేమ ఉన్నవాడు నన్ను ఇంత దూరం లో అందరికి దూరంగా తీసుకువచ్చాడు ఏమిటి?

అవును లే తన తప్పు ఏముంది లే తన జాబ్ ఇక్కడ అయితే.! ఇంకా తన ప్రేమ , తను నన్ను చిన్నపిల్లలా  చూసుకునే తీరు.నా కోసం తన ఫ్రెండ్స్ దగ్గరకు కూడా వెళ్ళడం మానేశాడు.ఇంతకన్నా ఏమి చెయ్యగలరు ఎవరైనా! ఊరు కానీ ఊరు,దేశం కానీ దేశంలో భాష రాదు, ఎవరు తెలియదు.చిన్నప్పటి నుంచి చూట్టూ జనం, స్నేహితులు అల్లరి,బామ్మ చెప్పే కథలు, తను ఆడుకున్నా చేలగట్లు, అమ్మ చేతి గోరు ముద్దలు. నాన్న తో కబురులు అన్ని చాలా గుర్తువస్తున్నాయి. ఈ అమెరికాలో ఏముంది.ఒక నా అవినాష్ ప్రేమ తప్ప.మా అమ్మ,నాన్న, బామ్మ,మా ఊరు చాలా గుర్తుకువస్తున్నాయి. అవును! ఈరోజు ఎలా అయిన తనతో మాట్లాడాలి.

ఈలోపు అవినాష్ వచ్చి స్నేహాని వెనుక నుంచి కౌగిలించుకొని ఏంటి పిల్ల.అలా డల్ గా ఉన్నావ్.నీరసంగా ఉందా! ఉందా చెప్పు,హాస్పటిల్ కి వెళదాం పదా!

స్నేహ:-వద్దు అవినాష్  ఈ నీరసం ఒంట్లో బాలేక కాదు. మనస్సు బాలేక!

ఏమైంది స్నేహ?

మా రేపల్లే చాలా గుర్తుకువస్తోంది.

అవినాష్:-వాట్!ఊరు గుర్తుకు వస్తుందా.! ఏముంది ఆ ఊరు లో.!ఓహ్  ఫన్నీ అని నవ్వుతున్నా అవినాష్ ని చూసి ఏడుస్తుంది స్నేహ..తనని అలా చూసి అవినాష్ నవ్వు ఆపి!

ఓయ్ పిల్ల ఎందుకు ఏడుస్తున్నావ్!

స్నేహ:-ఏముందా ఊరి లో ! స్వచ్ఛమైన  ప్రేమ. అనుబంధాలతో అల్లుకున్న పొదరిల్లు మా రేపల్లే.ఎవరికైనా చిన్న అవసరం అనగానే మన ముంగిట వాలే బంధువులు.స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని కూరగాయలు. పక్షుల కిల కిల రావాలు శ్రావ్యమైన సంగీతం లా. వేకువజామున ఆలయంలో వినిపించే సుప్రభాతం, శక్తి ని ఇచ్చే మంత్రాలు.బామ్మ చెప్పే కథలు మనకు విలువలు గురించి చెప్పే గురుకులాలు గా పని చేస్తాయి.స్నేహితులతో ఆడుకునే ఆటలు వ్యాయామ శాలాలు గా..వేప చెట్టు,తులసి మొక్కలు, ప్రతీ మొక్క మనకు దివ్యౌషధం గా పనిచేస్తాయి..ఇక్కడి లా హాస్పిటల్ కి పరిగేట్టుకొని వెల్లక్కరలేదు.పల్లెల్లో దొరికే స్వచ్ఛమైన గాలి,ఇక్కడ చలిమర గదులలో దొరుకుతుందా !.ఇవ్వన్నీ మా పల్లెల్లో దొరికినట్టు మీ పట్టణాలలో దొరుకుతుందా!.ఇక్కడ అన్ని డబ్బుతో కొనక్కోవాలి ప్రేమ తో సహా.!కానీ మా రేపల్లెలో అలా కాదు.!అందరూ ప్రేమ ఆప్యాతలు పంచుతూ సరదాగా నవ్వుకుంటూ చాలా సంతోషం గా ఉంటాం.ఇక్కడ వారాంతంలో మాత్రమే సంతోషం గా ఉండటం కోసం కలుస్తారు..మన సంతోషం మనలోనే ఉండాలి అవినాష్.ఇలా ప్రత్యకం గా డబ్బులు పెట్టి కాదు.మన చుట్టూ ఉన్న మనుష్యులు, మన చూట్టూ ఉన్న ప్రదేశాలు మన సంతోషం కావాలి.అని ఏడుపు మొదలు పెట్టిన స్నేహాని అలా చూడలేక ,

ఏడవకు ఇప్పుడు ఏమంటావ్.నువ్వు ఊరు కి వెళ్తావా .

హా…

సరే ఇద్దరం వెళదాం , నాకు కొంచెం టైం ఇవ్వు.

సరే నా !

ఇక నవ్వు స్నేహ!ఆఫీస్ వాళ్లతో మాట్లాడి మనం ఇండియా కి వెళ్ళే ఏర్పాటు చేస్తా!నేను కూడా ఇండియా లోనే జాబ్ చుడుకుంటా సరేనా!నీ కోసం  నేను ఈ మాత్రం చెయ్యకపోతే .నా ప్రేమ కు అర్ధం ఉండదు.అయినా ఊరు గురించి ఎంత బా చెప్పావు!అంత ఇష్టమా నీకు మీ ఊరు అంటే!

హ… చాలా చాలా ఇష్టం.అని  అమాయకంగా మొఖం పెట్టినా స్నేహాని చూసి  అవినాష్.!స్నేహకి తన ప్రేమ కానుక గా ఊరు ని ఇవ్వాలని.ఒక నెలలో ఇండియాకు తీసుకు వెళ్తాడు.!

రచయిత ::జయకుమారి

 

You May Also Like

2 thoughts on “నా ప్రేమ రేపల్లేలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!